తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poco F4 5g : అసలు ధర 33 వేలు.. కానీ ఆఫర్​లో రూ.7,999కే..

POCO F4 5G : అసలు ధర 33 వేలు.. కానీ ఆఫర్​లో రూ.7,999కే..

27 July 2022, 10:11 IST

    • POCO F4 5G ధర రూ. 32,999. కానీ ఫ్లిప్ కార్ట్ ఈ దీనిపై భారీ డిస్కౌంట్​ ఇస్తుంది. 15శాతం డిస్కౌంట్​తో దీనిని రూ. 27,999కే అందిస్తుంది. అంటే రూ.5 వేలు తగ్గింపు ధరతో ఇది మనకు వస్తుంది. అంతే కాదండోయ్.. మరో రూ. 20,000 తగ్గించే మరో బంపర్ ఆఫర్​ను ఇచ్చింది. అదేంటో తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి. 
POCO F4 5G
POCO F4 5G

POCO F4 5G

POCO F4 5Gపై ఫ్లిప్​కార్ట్ భారీ ఆఫర్​ ఇచ్చింది. దీని అసలు ధర రూ. 32,999 కాగా.. సుమారు 8 వేలకు ఈ ఫోన్​ను వినియోగదారులకు అందిస్తుంది ఫ్లిప్ కార్ట్. 15 శాతం డిస్కౌంట్​తో రూ.5,000 తగ్గించి.. రూ.27,999కి అందిస్తుంది.

అంతేకాకుండా ఎక్స్​ఛేంజ్ పేరుతో రూ. 20,000 వేలు తగ్గిస్తుంది. మీరు ఎక్స్​ఛేంజ్ చేసే ఫోన్ కండీషన్ బట్టి.. సుమారు ఇరవై వేలు డిస్కౌంట్ ఇస్తుంది. పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా. అంతేకాకుండా పలు బ్యాంక్​లపై కూడా ఆఫర్​లు ఇస్తుంది. ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తుంది.

మరీ ఈ ఫోన్ ఫీచర్లేమిటి?

POCO F4 5G ఆక్టా కోర్ (3.2 GHz, సింగిల్ కోర్ + 2.42 GHz, ట్రై కోర్ + 1.8 GHz, క్వాడ్ కోర్) స్నాప్‌డ్రాగన్ 870తో వస్తుంది. 6 GB RAM, 6.67 అంగుళాలు (16.94 సెం.మీ.)395 PPI, AMOLED120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. బ్యాటరీ కూడా 4500 mAhSonic ChargingUSB టైప్-సి పోర్ట్​తో వస్తుంది.

కెమెరా విషయానికొస్తే..

64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు LED Flash20 MP ఫ్రంట్ కెమెరాతో ఆకట్టుకుంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం