తెలుగు న్యూస్  /  Lifestyle  /  Must Carry These Emergency Things In Your Monsoon Kit

Monsoon Kit | వర్షంలో బయటకు వెళ్తున్నపుడు ఈ వస్తువులు మీ బ్యాగులో ఉండాల్సిందే!

HT Telugu Desk HT Telugu

29 June 2022, 15:44 IST

    • ఈ వర్షాకాలంలో బయటకు వెళ్తున్నపుడు బరువు అనుకోకుండా మీ బ్యాగులో కొన్ని అదనపు వస్తువులను తీసుకెళ్లడం ఎంతో ఉత్తమం. మీకు ప్రయోజనకరంగా ఉండే మాన్‌సూన్ కిట్‌లో ఏమేం ఉంచుకోవాలో తెలుసుకొని జాగ్రత్తపడండి.
Monsoon
Monsoon (Pixabay)

Monsoon

వర్షాకాలం వచ్చేసింది, వానలతో పాటు కొన్ని కష్టాలను కూడా తోడుగా పట్టుకొస్తుంది. ఈ వానాకాలంలో ఆఫీసుకు గానీ, బయటకు ఎక్కడికైనా వెళ్తే మన ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఏది సాగకపోవచ్చు. క్యాబ్ డ్రైవర్లు అదనపు ఛార్జీలు డిమాండ్ చేయడం, ఫుడ్ డెలివరీ సర్వీస్ వారు తమ సర్వీస్ నిలిపివేయడం లేదా ఆలస్యంగా డెలివరీ చేయడం, ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడం, ఆలస్యంగా ఇంటికి చేరటం ఇలాంటి కష్టాలు కచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు ముందస్తుగానే సిద్ధం అవడం ఎంతో ఉత్తమం.

ట్రెండింగ్ వార్తలు

Rachakonda Trip: హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న రాచకొండ కోటను కచ్చితంగా చూడాల్సిందే, ఒక్కరోజులో వెళ్లి రావచ్చు

Spicy Chutney: మినప్పప్పు పచ్చడి... ఓసారి చేసి చూడండి, వేడి వేడి అన్నంలో స్పైసీగా అదిరిపోతుంది

King Tut: వందేళ్ళ రహస్యాన్ని చేధించిన శాస్త్రవేత్తలు, ఆ సమాధిలోని మరణాలకు శాపం కారణం కాదట

Cough: దగ్గు అధికంగా ఉన్నప్పుడు తినకూడని ఆహారాలు ఇవే

మాన్‌సూన్ సమయంలో బయటకు వెళ్లేటపుడు ఎప్పుడైనా కొద్దిగా పెద్ద సైజ్ బ్యాగ్‌ను క్యారీ చేయాలి, అందులో అసరానికి పనికివచ్చే కొన్ని వస్తువులను తీసుకెళ్లాలి. ఆ రోజు వర్షంపడే సూచన ఉన్నా లేకపోయినా బరువు అనుకోకుండా మాన్‌సూన్ కిట్ తీసుకెళ్లగలిగితే మీ ఇబ్బందులు తగ్గుతాయి.

ఎలాంటి వస్తువులతో మాన్‌సూన్ కిట్‌ను సిద్ధం చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్

మీరు మీ మొబైల్ ఫోన్‌తో పాటు పవర్ బ్యాంక్ లేదా ఛార్జర్‌ను తీసుకెళ్లాలి. ఒకవైపు క్యాబ్ ఆలస్యం అవుతుంది, మరోవైపు మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. కానీ మీరు ఉన్న చోట పవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి రిస్క్ లేకుండా పవర్ బ్యాంక్ లేదా ఛార్జర్ తీసుకెళ్లడం మంచిది.

అదనపు జత దుస్తులు

రెయిన్ కోట్, గొడుగు మాత్రమే కాకుండా మీ బ్యాగులో ఒక అదనపు జత బట్టలు కూడా తీసుకెళ్లండి. మీరు నడుస్తూ వెళ్తున్నపుడు ఏదైనా వాహనం మీకు బురద నీటితో హ్యాపీ హోలీ చెప్పవచ్చు, గాలివానతో మీ బట్టలు తడిగా మారవచ్చు. కాబట్టి ఒక జత అదనంగా ఉంటే వెచ్చగా, సౌకర్యంగా ఉంటుంది.

వాటర్ రెసిస్టెంట్ జిప్‌లాక్

సెల్ ఫోన్, ఛార్జర్, పవర్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్‌లు, నగదు వంటి విలువైన వస్తువులను తీసుకెళ్తున్నపుడు వాటిని వర్షపు నీటిలో స్నానం చేయించకండి. తేమ నుంచి సురక్షితంగా ఉంచే ఒక వాటర్‌ప్రూఫ్ ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లండి.

స్నాక్స్

వర్షం ఎక్కువ ఉన్నప్పుడు ఫుడ్ డెలివరీ సర్వీస్ అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు ఇంటికి వెళ్దామనుకున్నా వర్షం కారణంగా ఆఫీస్‌లో లేదా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవచ్చు. కాబట్టి ఒక బాక్సులో పండ్లు, ఇతర అల్పాహారం ఏదైనా తీసుకెళ్లండి. మీకు టైంపాస్ అవుతుంది, ఆకలి కూడా తీరుతుంది.

ప్రాథమిక ప్రథమ చికిత్స

బ్యాండ్-ఎయిడ్స్, యాంటిసెప్టిక్స్, నొప్పి నుంచి ఉపశమనం కలిగించే స్ప్రేలతో కూడిన ప్రథమ చికిత్స సామగ్రిని, అలాగే మీరు రోజువారీగా ఉపయోగించే అత్యవసర మందులను కూడా తీసుకెళ్లడం మరిచిపోవద్దు.

టాపిక్