తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Care In Monsoon : వర్షాకాలంలో చర్మాన్ని ఇలా కాపాడుకోండి..

Skin Care in Monsoon : వర్షాకాలంలో చర్మాన్ని ఇలా కాపాడుకోండి..

23 June 2022, 11:23 IST

    • వేసవి తాపం నుంచే కాదు.. వర్షాకాలంలో కూడా చర్మాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు చర్మ నిపుణులు. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం.. కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలను అందిస్తున్నారు. 
స్కిన్ కేర్
స్కిన్ కేర్

స్కిన్ కేర్

Skin Care in Monsoon : వర్షాకాలంలో తేమ స్థాయిలు పెరుగుతాయి. వాతావరణం అనూహ్యంగా మారుతుంది కాబట్టి దానికి మీ చర్మం దానికి అడ్జెస్ట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఈ సమయంలో అదనపు జిడ్డు, మొటిమలు, రంధ్రాలు మూసుకుపోవడం వంటి వివిధ చర్మ సమస్యల తలెత్తుతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీ చర్మం మరింత ఆరోగ్యంగా ఉంటుందని సూచనలిస్తున్నారు చర్మ వ్యాధి నిపుణులు. మరి వారు ఇచ్చిన సూచనలు మీరు కూడా ఫాలో అయిపోయి.. వర్షాకాలంలో చర్మాన్ని కాపాడుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Night Time Ice Cream : రాత్రిపూట ఐస్‌క్రీమ్ తినడం రొమాంటిక్ అనుకోకండి.. మెుత్తం ఆరోగ్యం మటాష్!

Cucumber Lassi Benefits : దోసకాయ లస్సీ.. 5 నిమిషాల్లో రెడీ.. శరీరాన్ని చల్లబరుస్తుంది

International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

Chewing Food : ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని ఎన్నిసార్లు నమిలితే ఆరోగ్యానికి మంచిది

ఎక్స్ఫోలియేషన్

ఈ సీజన్​లో మీ చర్మానికి ఎక్స్‌ఫోలియేషన్ చాలా ముఖ్యం. మృత చర్మ కణాలను తొలగించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపడానికి వర్షాకాలంలో కనీసం వారానికి రెండుసార్లు మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలని గుర్తుంచుకోండి.

స్క్రబ్​..

ఎక్స్‌ఫోలియేషన్ మీ ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తులను బాగా గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. బ్రౌన్ షుగర్, కాఫీ గ్రౌండ్స్, కొబ్బరి నూనె, తేనె కలిపి మీ చర్మాన్ని ఒక మూడు నిమిషాలు స్క్రబ్ చేయండి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేస్తే మెరిసే చర్మం మీ సొంతం.

సన్​స్క్రీన్

సన్‌స్క్రీన్ అప్లై చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది వర్షాకాలంలో సన్‌స్క్రీన్‌ను ఉపయోగించరు. అయితే ఇది మనం మనం చేసే అతిపెద్ద పొరపాటు. సన్‌స్క్రీన్‌ను ఏడాది పొడవునా అప్లై చేయాలి. సన్​ ఉన్నా లేకపోయినా.. సన్​స్క్రీన్​ను అప్లై చేయాలి. ఇది హానికరమైన UV కిరణాలు, పర్యావరణ కాలుష్య కారకాల నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి సన్​స్క్రీన్​ను ఉపయోగించాలి. SPF 30, యాంటీఆక్సిడెంట్ ప్రొటెక్షన్, PA ఫ్యాక్టర్‌తో తేలికపాటి, జెల్ ఆధారిత సన్‌స్క్రీన్‌ను ఉపయోగించండి.

ముల్తానీ మట్టితో మాస్క్..

వారానికి రెండుసార్లు ముల్తానీ మట్టితో మాస్క్ వేయండి. వర్షాకాలంలో విపరీతమైన తేమ మీ చర్మంపై దురద, జిడ్డును కలిగిస్తుంది. అదనపు నూనెను నియంత్రించడంలో, మొటిమలను తగ్గించడంలో.. మీ చర్మాన్ని టాక్సిన్స్ నుంచి రక్షించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వారానికి రెండుసార్లు దీనిని ట్రై చేయండి. అదనపు ప్రయోజనాల కోసం కలబంద లేదా గ్రీన్ టీ వంటి సహజ, యాంటీ బాక్టీరియల్ పదార్ధాలను ఎంచుకోండి.

ఫేస్ సీరం

క్రమం తప్పకుండా విటమిన్ సి సీరమ్ ఉపయోగించండి. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, విటమిన్ సి మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఇది పూర్తిగా యాంటీ ఏజింగ్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది మీ ఛాయను ప్రకాశవంతం చేస్తుంది. గీతలు, మచ్చలను తగ్గిస్తుంది. మొటిమల మచ్చలను పోగొడుతుంది. మీకు సహజమైన, ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది.

ప్రతిరోజూ రెండుసార్లు విటమిన్ సి సీరమ్‌ని క్లెన్సింగ్, టోనింగ్ తర్వాత ఉపయోగించవచ్చు. అయితే మీ మాయిశ్చరైజర్‌ను అప్లై చేసే ముందు దీనిని రాస్తే.. ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం.

టాపిక్

తదుపరి వ్యాసం