తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon Diet : వర్షాకాలంలో రోగాల బారినుంచే తప్పించే ఆహారాలు ఇవే..

Monsoon Diet : వర్షాకాలంలో రోగాల బారినుంచే తప్పించే ఆహారాలు ఇవే..

24 June 2022, 15:51 IST

google News
    • వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, ఇతర ఇన్​ఫెక్షన్​లు ఈజీగా వస్తాయి. కాబట్టి మంచి డైట్ తీసుకోవాలి. అయితే ఆరోగ్య సమస్యలు రాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ఆహారాలను మీ డైట్​లో చేర్చుకోవాలంటున్నారు ఆహార నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
వర్షాకాలం
వర్షాకాలం

వర్షాకాలం

Monsoon Diet : రుతుపవనాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వేసవి వేడి నుంచి మనోహరమైన వాతావరణంలోకి అడుగు పెట్టేశాం. కానీ ఈ సీజన్​లోనే ఎక్కువ రోగాలు ప్రబలే అవకాశముంది. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి, బలమైన రోగనిరోధక శక్తి కోసం కొన్ని ఆహారాలను డైట్​లో చేర్చుకోవాలి అంటున్నారు ఆహార నిపుణులు.

పసుపు

పసుపు మీ ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది. మీరు పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగవచ్చు. సాధారణ వంటలలో పసుపు పొడిని ఉపయోగించాలి. లేదా తాజాగా తురిమిన అల్లం, పసుపును కలిపి తీసుకోవాలి. ఇది వర్షాకాలంలోనే కాకుండా అన్ని సీజన్‌లలో మంచి ఫలితాలు ఇస్తుంది.

నిమ్మకాయ

నిమ్మకాయ విటమిన్ సి సహజ మూలం. పైగా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోగాలు ప్రబలే ఈ సీజన్​లో ప్రస్తుతం ప్రపంచానికి ఇది చాలా అవసరం. మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనకరమైన ప్రభావాలను ఇస్తూ.. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలను బలపరుస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. జలుబు, ఫ్లూకి కారణమయ్యే సూక్ష్మక్రిములతో పోరాడుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో T- కణాల పరిమాణం పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. తద్వారా సాధారణ జలుబు, ఫ్లూ వంటి వైరల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

నట్స్

ఈ సీజన్‌లోనే కాదు.. ఏ సీజన్​లోనైనా ఖర్జూరం, బాదం, వాల్‌నట్‌లను అల్పాహారంగా తీసుకోవడం మంచిది. వీటిలోని విటమిన్స్, మినరల్ కంటెంట్స్.. మీ మాన్సూన్ డైట్‌కి అద్భుతంగా పనిచేస్తాయి.

పాలకూర

ఇది ఫైబర్, విటమిన్లు A, E, Cకి మంచి మూలం. దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అన్నీ మీ శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలం కోసం మిమ్మల్ని సిద్ధం చేయడానికి అవసరమైన సాధనాలను అందిస్తాయి. బురద, ధూళి కారణంగా వర్షాకాలంలో ఆకు కూరలు తినకూడదని మూలాధారాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎల్లప్పుడూ వంట చేసే ముందు వాటిని బాగా కడగాలని గుర్తించుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం