తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Chutney: మినప్పప్పు పచ్చడి... ఓసారి చేసి చూడండి, వేడి వేడి అన్నంలో స్పైసీగా అదిరిపోతుంది

Spicy Chutney: మినప్పప్పు పచ్చడి... ఓసారి చేసి చూడండి, వేడి వేడి అన్నంలో స్పైసీగా అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

01 May 2024, 11:30 IST

    • Spicy Chutney: మినప్పప్పు పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది ఇడ్లీలు, గారెలే. ఎందుకంటే వీటితో ఈ అల్పాహారాలను అధికంగా చేస్తాం. కానీ మినప్పప్పుతో టేస్టీగా పచ్చడి కూడా చేసుకోవచ్చు.
మినప పప్పు చట్నీ రెసిపీ
మినప పప్పు చట్నీ రెసిపీ

మినప పప్పు చట్నీ రెసిపీ

Spicy Chutney: మినప్పప్పు పచ్చడి ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా. మినప్పప్పు కేవలం ఇడ్లీలు, దోశలు, గారెలకే కాదు టేస్టీ చట్నీ కూడా చేయొచ్చు. వేడి వేడి అన్నంలో మినప్పప్పు పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచి వేరు. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మీకే నచ్చుతుంది. అలాగే ఇడ్లీలోకి కూడా ఈ మినప్పప్పు పచ్చడి టేస్టీగా ఉంటుంది. స్పైసీగా కావాలనుకునేవారు ఎండుమిర్చిని అధికంగా వేసుకుంటే సరి, ఇక మినప్పప్పు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Tips In Telugu : ఈ 6 గుణాలపై మీకు నియంత్రణ లేకుంటే జీవితంలో ఓడిపోతారు

Jeera Rice : ఉదయం అల్పాహారంగా జీలకర్ర రైస్ ఇలా చేసుకోండి.. 10 నిమిషాల్లో రెడీ..

Tuesday Motivation : అందాన్ని చూసి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకు.. అంతమించిన విషయాలు చాలా ఉంటాయి

Talking In Sleep : నిద్రలో మాట్లాడే సమస్య ఉంటే బయటపడేందుకు సింపుల్ చిట్కాలు

మినప్పప్పు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

పొట్టు తీయని మినప్పప్పు - అర కప్పు

ఎండుమిర్చి - ఎనిమిది

మెంతులు - అర స్పూను

నూనె - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

చింతపండు - నిమ్మకాయ సైజులో

ఉప్పు - రుచికి సరిపడా

ఆవాలు - అర స్పూను

వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు

కరివేపాకులు - గుప్పెడు

మినప్పప్పు పచ్చడి రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో మినప్పప్పు వేసి వేయించాలి.

2. ఒక పావు గంటసేపు వేయించాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఆ తర్వాత అదే కళాయిలో జీలకర్ర, ఎండు మిర్చి, మెంతులు, చింతపండు వేసి వేయించాలి.

4. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న దినుసులతో పాటు మినప్పప్పును వేసి, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త నీళ్లు పోయాలి.

5. ఆ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

6. ఆ పచ్చడిని తీసి ఒక గిన్నెలో వేయాలి.

7. స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి.

8. ఈ మొత్తం మిశ్రమాన్ని మినప్పప్పు పచ్చడిపై వేయాలి.

9. అంతే టేస్టీ మినప్పప్పు పచ్చడి రెడీ అయినట్టే.

10. ఇది చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో తిన్న ఇడ్లీ, దోశల్లో కూడా అదిరిపోతుంది.

మినప పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో గుండెను కాపాడే లక్షణాలు ఉంటాయి. మినప పప్పు తినడం వల్ల నాడీ వ్యవస్థ బలంగా మారుతుంది. ఇది బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఎముకలను గట్టిగా మారుస్తుంది. ఆయుర్వేదంలో కూడా మినప పప్పు గొప్ప తనాన్ని వర్ణించారు.

టాపిక్

తదుపరి వ్యాసం