తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lunar Eclipse 2022 | చంద్ర గ్రహణం ఏయే ప్రాంతాలలో ఏ సమయంలో ఏర్పడుతుంది? పూర్తి వివరాలు ఇవిగో!

Lunar Eclipse 2022 | చంద్ర గ్రహణం ఏయే ప్రాంతాలలో ఏ సమయంలో ఏర్పడుతుంది? పూర్తి వివరాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

07 November 2022, 10:28 IST

    • Moon Eclipse 2022: నవంబర్ 8, 2022 మంగళవారం నాడు చంద్రగ్రహణ ఏర్పడుతుంది. ఏ ప్రాంతంలో ఏ సమయానికి గ్రహణం ఏర్పడుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఎంత సేపు ఉంటుంది వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Moon Eclipse 2022:
Moon Eclipse 2022: (Pixabay)

Moon Eclipse 2022:

Moon Eclipse 2022: ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం, సంపూర్ణమైన చంద్రగ్రహణం నవంబర్ 8, 2022న సంభవిస్తుంది. ఆ తర్వాత తదుపరి సంపూర్ణ గ్రహణం మళ్లీ మూడేళ్ల తర్వాత మార్చి 14, 2025న ఉంటుంది. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు కనిపించడు, లేదా పాక్షికంగా మాత్రమే కనిపిస్తాడు. అది కూడా ఎరుపు రంగులో కనిపిస్తాడు. అందుకే Blood Moon అని కూడా పిలుస్తారు. ఈ ఖగోళ అద్భుతాన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు.

ట్రెండింగ్ వార్తలు

Mothers day 2024: మదర్స్ డేను ప్రతి ఏటా మే నెలలో వచ్చే రెండో ఆదివారమే ఎందుకు నిర్వహించుకుంటాం?

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

అయితే ఈ చంద్ర గ్రహణాన్ని (Lunar Eclipse 2022) వీక్షించడానికి ప్రత్యేక పరికరాలు ఏవీ అవసరం లేదు. అయినప్పటికీ, బైనాక్యులర్‌లు, టెలిస్కోప్‌లు, ప్రకాశవంతమైన లైట్లకు దూరంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి చూడటం వలన మరింత స్పష్టంగా గ్రహణాన్ని వీక్షించవచ్చు.

Moon Eclipse 2022 in India- భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఎక్కడ?

భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం తూర్పు ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది, మిగతా ప్రాంతాలలో పాక్షిక గ్రహణం మాత్రమే కనిపిస్తుంది. పశ్చిమ, దక్షిణ , ఉత్తర ప్రాంతాలలోని ప్రజలు పాక్షిక గ్రహణాన్ని చూస్తారు.

దేశంలోని కోహిమా, అగర్తల, గౌహతి, కోల్‌కతా, భువనేశ్వర్, సిలిగురి, పాట్నా, రాంచీలో సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది.

ఇక.. ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, నాగ్‌పూర్, శ్రీనగర్, నోయిడా, గురుగ్రామ్, చండీగఢ్, హైదరాబాద్, చెన్నై, సూరత్, పూణే, జైపూర్, లక్నో, మధురై, ఉదయపూర్ వంటి ఇతర నగరాలలో పాక్షిక గ్రహణం చూడవచ్చు.

Moon Eclipse 2022 Place, Date and Timings- భారతదేశంలోని ప్రధాన నగరాల్లో గ్రహణ సమయాలు:

కోల్‌కతా: సంపూర్ణ చంద్రగ్రహణం

కోల్‌కతాలో నవంబర్ 8, సాయంత్రం 04:55 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. గ్రహణం సాయంత్రం 04:52 గంటలకు ప్రారంభమై 07:26 గంటలకు ముగుస్తుంది. ఇది 2 గంటల 34 నిమిషాల పాటు కొనసాగుతుంది.

ఢిల్లీ: పాక్షిక చంద్రగ్రహణం

దేశ రాజధాని ఢిల్లీలో చంద్రగ్రహణం సాయంత్రం 05:28 గంటలకు ప్రారంభమై 07:26 గంటలకు ముగుస్తుంది, 1 గంట 58 నిమిషాల పాటు కొనసాగుతుంది. సాయంత్రం 05:31 గంటలకు 66 శాతం అస్పష్టతతో చూడవచ్చు.

ముంబై: పాక్షిక చంద్రగ్రహణం

ముంబైలో చంద్రగ్రహణం సాయంత్రం 06:01 గంటలకు ప్రారంభమై 07:26 గంటలకు ముగుస్తుంది, 1 గంట 25 నిమిషాల పాటు కొనసాగుతుంది. సాయంత్రం 06:04 గంటల నుంచి కేవలం 14 శాతం అస్పష్టతతో చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు.

బెంగళూరు: పాక్షిక చంద్రగ్రహణం

బెంగళూరులో సాయంత్రం 05:49 గంటలకు ప్రారంభమై 07:26 గంటలకు ముగుస్తుంది, 1 గంట 36 నిమిషాల పాటు కొనసాగుతుంది. సాయంత్రం 05:57 గంటల నుంచి 23 శాతం అస్పష్టతతో గ్రహణం గరిష్టంగా ఉంటుంది.

హైదరాబాద్: పాక్షిక చంద్రగ్రహణం

హైదరాబాద్‌లో చంద్రగ్రహణం సాయంత్రం 05:40 గంటలకు ప్రారంభమై, 07:26 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 05:42 వద్ద గ్రహణం గరిష్టంగా ఉంటుంది. వ్యవధి 1 గంట 46 నిమిషాలు ఉంటుంది.

చెన్నై: పాక్షిక చంద్రగ్రహణం

చెన్నైలో చంద్రగ్రహణం సాయంత్రం 05:38 గంటలకు ప్రారంభమై, 07:26 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 05:42 వద్ద గ్రహణం గరిష్టంగా ఉంటుంది. 1 గంట 48 నిమిషాల పాటు చంద్ర గ్రహణం వీక్షించవచ్చు.

టాపిక్