తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Moon Eclipse : చంద్రగ్రహణం రోజు దుర్గగుడి మూసివేత

Moon Eclipse : చంద్రగ్రహణం రోజు దుర్గగుడి మూసివేత

HT Telugu Desk HT Telugu

06 November 2022, 13:12 IST

    • Moon Eclipse చంద్రగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఆలయాలను మంగళవారం మూసివేయనున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ ప్రకటించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు  చంద్రగ్రహణ సమయంలో ఎలాంటి దర్శనాలకు అనుమతించరని గుర్తించాల్సిందిగా కోరారు. 
చంద్రగ్రహణం రోజు ఇంద్రకీలాద్రిపై దర్శనాలు రద్దు
చంద్రగ్రహణం రోజు ఇంద్రకీలాద్రిపై దర్శనాలు రద్దు

చంద్రగ్రహణం రోజు ఇంద్రకీలాద్రిపై దర్శనాలు రద్దు

ChandraGrahanam : కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మూసివేయనున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ ప్రకటించారు. నవంబర్ 8న రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా దేవస్థానం వైదిక కమిటీ సూచనల ప్రకారం మంగళవారం ఉదయం 8గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Bengalore Rave Party: బెంగుళూరులో రేవ్‌ పార్టీ భగ్నం, పోలీసుల అదుపులో ఏపీ రాజకీయ నేతలు

Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

AP Weather Update: మండు వేసవిలో మారిన వాతావరణం, బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Gopi Thotakura: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రవాసాంధ్రుడు.. భూ కక్ష్య వెలుపలికి విజయవాడ యువకుడి ప్రయాణం

దుర్గగుడితో పాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న ఇతర ఉపాలయాలను కూడా మూసివేస్తారు. మంగళవారం సాయంత్రం ఆరున్నరకు తిరిగి ఆలయ కవాట ఉద్ఘటన చేసి దేవతా మూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించిన తర్వాత అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

మంగళవారం ఉదయం 8గంటల్లోపు ఆర్జిత సేవలైన సుప్రభాత సేవ, ఖడ్గ మాలార్చన, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, రుద్రహోమాలు మాత్రమే నిర్వహిస్తారు.ఇంద్రకీలాద్రిపై ఉదయం ఏడు గంటల తర్వాత నిర్వహించే లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం, శ్రీచక్ర నవావరణార్చన, చండీహోమం, పంచ హారతులు, పల్లకీ సేవ వంటి సేవల్ని పూర్తిగా రద్దు చేస్తారు.చంద్రగ్రహణం వీడిన తర్వాత బుధవారం అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలు పున:ప్రారంభించి యథావిధిగా నిర్వహిస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం