తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Crispy And Spicy Onion Samosa Recipe In Telugu

Onion Samosa Recipe: ఆనియన్ సమోసా రెసిపీ.. నోరూరించేలా ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu

17 March 2023, 18:00 IST

    • Onion Samosa Recipe: ఆనియన్ సమోసా రెసిపీ తెలుసుకుంటే మీరు రోడ్డుపై అనారోగ్యకరమైన సమోసాలను తినాల్సిన బాధ తప్పుతుంది.
నోరూరించే ఆనియన్ సమోసా రెసిపీ
నోరూరించే ఆనియన్ సమోసా రెసిపీ (pexels)

నోరూరించే ఆనియన్ సమోసా రెసిపీ

Onion Samosa Recipe: ఆనియన్ సమోసా అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే బయట తినేందుకు చాలా మంది జంకుతారు. ఎలా చేశారో, ఎలాంటి నూనె వాడారో అన్న భయం ఉంటుంది. అయితే ఇంటి వద్దే ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. క్రిస్పీగా, స్పైసీగా ఆనియన్ సమోసా చేసి మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచండి.

Onion Samosa Recipe ingredients: ఉల్లి సమోసాకు కావాల్సిన పదార్థాలు

1. మైదా పిండి

2. గోధుమ పిండి

3. ఉప్పు

4. వంట నూనె

5. అటుకులు

6. ఉల్లిపాయలు

7. పచ్చి మిర్చి

8. కారప్పొడి

9. పసుపు

10. జీలకర్ర

11. ధనియాల పొడి

12. అల్లం వెల్లుల్లి పేస్ట్

13. కొత్తి మీర

Onion Samosa Recipe making: ఉల్లి సమోసా తయారీ విధానం

ఆనియన్ సమోసా ప్రిపరేషన్

1. ఒక బౌల్‌లో 2 కప్పుల మైదా పిండి లేదా 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి.

2. పిండిలో కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి మొత్తం కలిపేయాలి.

3. ఇప్పుడు కొద్దికొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండి ముద్దలా కలపాలి

4. ఈ పిండి ముద్దను అలా 20 నిమిషాల పాటు నాననివ్వాలి

5. స్టఫింగ్ కోసం పావు కప్పు అటుకులు స్మాష్ చేయాలి.

6. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఈ స్టఫింగ్‌లో వేయాలి.

7. ఒక పచ్చి మిర్చిని సన్నగా తరిగి అందులో కలపాలి.

8. రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు కలపాలి.

9. అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కలపండి.

10. అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కొత్తిమీర కూడా కలపండి.

11. పిండిని చిన్న భాగాలుగా చేసి సాధ్యమైనంత పలుచగా ఒత్తుకోవాలి.

సమోసా తయారీ

12. ఈ షీట్‌ను పెనం మీద వేసి రెండు వైపులా 10 సెకెండ్లపాటు వేడి చేసుకోవాలి.

13. షీట్‌ను రిబ్బన్ల మాదిరిగా కట్ చేసి పెట్టుకోవాలి. రిబ్బన్ కంటే కాస్త వెడల్పుగా ఉండాలి.

14. ఒక బౌల్‌లో కొద్దిగా మైదా పిండి తీసుకుని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

15. ఇప్పుడు రిబ్బన్లను మధ్యలోకి ఫోల్డ్ చేయాలి.

16. ఒక సగ భాగాన్ని మళ్లీ త్రికోణాకారంలోకి ఫోల్డ్ చేయాలి.

17, రెండో సగభాగం కొసకు మైదా పేస్ట్ పూయాలి.

18. త్రికోణాకృతిని పేస్ట్ పూసిన చోట రెండో సగభాగానికి అంటించాలి.

19. ఇప్పుడు కోణ్ ఆకృతి రెడీ అవుతుంది.

20. ఇందులో స్టఫింగ్ పెట్టాలి. దాన్ని కాస్త ప్రెస్ చేయాలి.

21. పేస్ట్ సాయంతో పైన కొసలను అంటించాలి.

22. అవి ఊడిపోకుండా పేస్ట్‌తో అన్ని కొనలనూ అంటించాలి. ఇలా అన్ని ఆనియన్ సమోసాలు రెడీ చేసుకోండి

డీప్ ఫ్రై చేయడం ఇలా

స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయండి. ఒకే సమయంలో రెండు మూడు సమోసాలు ఏడెనిమిది నిమిషాలు వేయించాలి. మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. వేయించిన ఆనియన్ సమోసాలను తీసి ఒక డిష్‌లో పెట్టి సర్వ్ చేయండి.

ఆనియన్ సమోసాలకు తోడు డీప్ ఫ్రై చేసిన పచ్చి మిర్చి బాగుంటుంది. పచ్చి మిర్చికి రంద్రాలు చేసి డీప్ ఫ్రై చేసి తీయడమే. వాటిపై కాస్త ఉప్పు చల్లుకుంటే సూపర్ ఉంటుంది.

టాపిక్