తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mutton Curry Recipe । మటన్ కర్రీ.. ఇలా వండితే మైమరిపించే రుచి!

Mutton Curry Recipe । మటన్ కర్రీ.. ఇలా వండితే మైమరిపించే రుచి!

HT Telugu Desk HT Telugu

17 March 2023, 14:43 IST

google News
    • Mutton Curry Recipe: తక్కువ సమయంలోనే మటన్ కూరను రుచికరంగా ఎలా వండాలో ఇక్కడ సులభమైన రెసిపీ ఉంది చూడండి.
Mutton Curry Recipe
Mutton Curry Recipe (unsplash)

Mutton Curry Recipe

Ramadan 2023: ఇది వేడుకల సీజన్, విందులు- వినోదాలతో ఆనందంగా కలిసి గడిపే సమయం. ఈ ఏడాది మార్చి 22 నుంచి రంజాన్ మాసం కూడా ఆరంభం కాబోతుంది. రంజాన్ సమయంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం అవసరం. బలవర్ధకమైన ఆహారాలతో శరీరానికి తగిన శక్తిని అందించడం ముఖ్యం. అంతేకాకుండా ఈ రంజాన్ మాసంలో హలీం, బిర్యానీ, షీర్ ఖూర్మా వంటి గొప్ప వంటకాల రుచులను కూడా ఆస్వాదించవచ్చు. మీ కోసం ఇక్కడ రుచికరమైన మటన్ కూరను బెంగాలీ శైలిలో వండే రెసిపీని అందిస్తున్నాం.

మటన్ కూర సరిగ్గా వండితే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన ప్రోటీన్ ఆహారం, మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. బెంగాలీ మటన్ కర్రీ రెసిపీ ఈ కింద ఉంది, ఇక్కడ అందించిన సూచనల ప్రకారం సులభంగా, రుచికరంగా మాంసం కూరను వండుకోవచ్చు.

Mutton Curry Recipe కోసం కావలసినవి

  • 1 కిలో మేక మాంసం
  • 3 ఉల్లిపాయలు
  • 5 టేబుల్ స్పూన్లు నూనె
  • 1 స్పూన్ దాల్చిన చెక్క, లవంగాలు, బిరియాని ఆకు
  • 1 టీస్పూన్ జీలకర్ర
  • 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్
  • 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి
  • 1 స్పూన్ పసుపు పొడి
  • 2 tsp కాశ్మీరీ మిర్చి
  • 2 స్పూన్ కారం పొడి
  • 2 టేబుల్ స్పూన్లు కరాహి మసాలా
  • 2 స్పూన్ నల్ల మిరియాలు
  • 2 తాజా టమోటాలు
  • 1/2 టిన్ తరిగిన టమోటాలు
  • 2 టేబుల్ స్పూన్లు టొమాటో ప్యూరీ
  • ఉప్పు తగినంత

మటన్ కూర తయారీ విధానం

1. ముందుగా ఒక పాత్రలో నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క , లవంగం, బిరియాని ఆకు , జీలకర్ర వేసి వేయించాలి.

2. ఆపైన మాంసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నల్ల మిరియాలు, పసుపు పొడి వేసి కలపండి. మాంసం నుండి నీరు విడుదలయి, ఆవిరైపోయే వరకు మీడియం వేడి మీద ఉడికించాలి.

3. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

4. అనంతరం కారం పొడి, కాశ్మీరీ మిర్చి, కరాహి మసాలా, తాజా టొమాటోలు, టమోటో ప్యూరీ వేసి కలపండి. టమోటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

5. ఇప్పుడు కావలసిన విధంగా సూప్ లేదా గ్రేవీని బట్టి నీరు పోయండి, అందులో బేబీ పొటాటోలను వేయండి. మాంసం మృదువుగా, బంగాళాదుంపలు ఉడికినంత వరకు ఉడకబెట్టండి.

6. చివరగా తరిగిన తాజా కొత్తిమీరతో అలంకరించండి.

అంతే, రుచికరమైన మటన్ కూర రెడీ. అన్నం లేద రోటీలతో తింటూ ఆస్వాదించండి.

తదుపరి వ్యాసం