Bedtime Snacks : థైరాయిడ్ ఉన్నవారు నిద్రకు ముందు ఇవి తినాలి
12 February 2023, 19:30 IST
- Thyroid Disease : థైరాయిడ్ వ్యాధి విషయంలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో వ్యాధి నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు. నిద్రకు ముందు.. థైరాయిడ్ ఉన్నవారు.. కొన్ని రకాల ఐటమ్స్ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్ ఉన్నవారికి చిట్కాలు
థైరాయిడ్.. సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్‌ని విడుదల చేయడం ద్వారా.. శరీరంలోనే మెటబాలిక్(metabolic) ప్రాసెస్‌లని ప్రభావితం చేస్తుంది. కొన్ని సమయాల్లో ఈ గ్రంథి పనిచేయకపోవడం, చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. వీటిని వరుసగా హైపర్ థైరాయిడిజం(hyperthyroidism), హైపోథైరాయిడిజం అని పిలుస్తారు. అయోడిన్(iodine) వంటి కొన్ని పోషకాల లోపం థైరాయిడ్ సమస్యకు ఒక కారణం. ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంథి పనితీరును నిర్వహించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
అయోడిన్ కాకుండా, థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును ప్రభావితం చేసే అనేక ఇతర సూక్ష్మపోషకాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయలను తినాలి. బీన్స్, పప్పులు, చేపలు(Fish), గుడ్లు(Eggs), మాంసాన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యంగా థైరాయిడ్ పనితీరుకు సహాయపడే సెలీనియం ఉంటుంది. పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా నిద్రవేళ కొన్ని స్నాక్స్ సూచించారు. అవి ఇక్కడ ఉన్నాయి.
4-5 నానబెట్టిన జీడిపప్పు(cashews) తినాలి. ఇందులో సెలీనియం అనే ఖనిజం ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును నిర్ధారించడంలో, థైరాయిడ్ స్థాయిలను నియంత్రించడం ఉపయోగపడుతుంది. శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా థైరాయిడ్ కణజాలాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
కొబ్బరిలో(Coconut pieces) ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది జీవక్రియ, శక్తి స్థాయిలను పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ ఉన్నవారి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా నిండిన చియా సీడ్స్(chia seeds) మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. చియా విత్తనాలు ఒమేగా-3 గొప్ప మూలం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి సంబంధిత పరిస్థితులలో హషిమోటోస్ థైరాయిడిటిస్, డిక్వెర్వైన్స్ థైరాయిడిటిస్, ఇతర రకాల థైరాయిడిటిస్‌లో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
టేబుల్ స్పూన్ కాల్చిన గుమ్మడికాయ గింజలు(pumpkin seeds) తీసుకోవాలి. గుమ్మడికాయ గింజలు జింక్ యొక్క గొప్ప మూలం. ఇది థైరాయిడ్ ఆరోగ్యానికి కీలకం, థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణకు అవసరం. గుమ్మడికాయ గింజలు ట్రిప్టోఫాన్ యొక్క సహజ మూలం. నిద్రను ప్రోత్సహించే అమైనో ఆమ్లం. గుమ్మడికాయ గింజలలోని జింక్, కాపర్, సెలీనియం నిద్ర వ్యవధి, నాణ్యతను కూడా ప్రభావితం చేస్తాయి.