తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Snacks For Weight Loss : బరువు తగ్గడానికి హెల్ప్ చేసే హెల్తీ స్నాక్స్ ఇవే..

Snacks for weight Loss : బరువు తగ్గడానికి హెల్ప్ చేసే హెల్తీ స్నాక్స్ ఇవే..

26 November 2022, 11:43 IST

    • Low Calorie Snacks for weight Loss : రోజుకు ప్రధానంగా మూడు మీల్స్ ఉంటాయి. అవి బ్రేక్​ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ మీల్స్ తీసుకున్నా సరే.. మధ్య మధ్యలో ఆకలివేస్తూ ఉంటుంది. ఆ టైమ్​లో ఏవిపడితే అవి స్నాక్స్​లా తినేస్తారు. కానీ.. వాటి వల్ల చెడు కొలస్ట్రాల్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. మీరు బరువు తగ్గాలనుకుంటున్నట్లైతే.. కొన్ని హెల్తీ స్నాక్ ఇక్కడున్నాయి. ఓ లుక్కేయండి.
హెల్తీ స్నాక్స్
హెల్తీ స్నాక్స్

హెల్తీ స్నాక్స్

Low Calorie Snacks for weight Loss : ఫుడ్ లేకుంటే మనిషి బతకలేడు. కానీ సరైన ఫుడ్ తీసుకోకుంటే ఆరోగ్యంగా బతకలేడు. ఈ విషయాన్ని మనం ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత మంచిది. ఎందుకంటే.. చాలా మంది చిరుతిళ్లు తినేప్పుడు ఆలూ చిప్స్, వివిధ బేకరీ ఐటమ్​లు, అన్​హెల్తీ స్నాక్స్ తింటూ ఉంటారు. దీనివల్ల బరువు పెరగడం, ముఖం మీద మచ్చలు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మీరు స్నాక్స్ తింటూ కూడా బరువు తగ్గే ఉపాయాలు ఉన్నాయి. అదేంటి తింటూ బరువు తగ్గొచ్చా అనుకుంటున్నారా? ఇంతకీ బరువు తగ్గడంలో సహాయపడే.. ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీల స్నాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బెర్రీలు

బెర్రీలు చాలా రుచికరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు అంటూ మార్కెట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఇవి కేవలం టేస్ట్ ఇవ్వడమే కాకుండా.. పూర్తిగా ఫైబర్​తో నిండి ఉంటాయి. ఇవి మీరు అవాంఛనీయ బరువు కోల్పోవడంలో సహాయపడటానికి ఒక గొప్ప ఎంపికగా చెప్పవచ్చు.

కీర దోసకాయలు

కీరదోసకాయల్లో.. 95% నీరు-కంటెంట్‌ ఉంటుంది. ఇవి మీకు చక్కని, శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తాయి. అవసరమైన విటమిన్లు (కె, సి), మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్‌తో నిండి ఉంటాయి. ఇవి మిమ్మల్ని శక్తివంతం చేస్తాయి. అంతేకాకుండా ఫిట్‌గా ఉంచుతాయి.

పుచ్చకాయ

పుచ్చకాయలు తీపిగా, జ్యూసీగా ఉంటాయి. ఇవేకాకుండా పుచ్చకాయల్లో 92% నీరు ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా.. ఆకలిని తీర్చడానికి, ఎక్కువ కేలరీలు పోగుపడకుండా చేయడంలో గొప్పగా ఉంటుంది.

పెరుగు

బరువు తగ్గాలనుకునేవారికి పెరుగు మరొక గొప్ప చిరుతిండి. ఇది పుష్కలంగా ప్రోటీన్‌ను సరఫరా చేస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అనవసరమైన కేలరీల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

ద్రాక్ష

ద్రాక్ష అనేది మీ డైట్​లో ఒక గొప్ప స్నాక్​గా చెప్పవచ్చు. ఇది మిమ్మల్ని ఎక్కువ కాలం సంతృప్తిగా ఉంచుతుంది. దీనివల్ల మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పొటాషియంతో నిండిన ద్రాక్ష వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా చేస్తుంది. మిమ్మల్ని హైడ్రేట్‌గా, నిండుగా ఉంచడంలో సహాయం చేస్తాయి. పైగా దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని రక్షించడంలో సహాయపడుతుంది.

పాప్‌కార్న్

పాప్​కార్న్ షుగర్-ఫ్రీ, ఫ్యాట్-ఫ్రీ స్నాక్​గా చెప్పవచ్చు. క్యాలరీలు తక్కువగా ఉన్నందున.. మీరు బరువు పెరగడం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇది మీకు బెస్ట్ స్నాక్ అవుతుంది.

బాదం

బాదం పప్పులను ఎక్కువగా తింటే చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదనంగా బాదం రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. మెదడు శక్తిని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్

మీ డైట్​నుంచి చక్కెరతో కూడిన చాక్లెట్లను తొలగించడం మానేసి.. బరువు తగ్గడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి డార్క్ చాక్లెట్లు తినండి. ఇవి మీరు బరువు తగ్గడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తుంది.