Home Remedies for Acidity : మలబద్ధకం, అజీర్ణ సమస్యలను.. ఇంటి చిట్కాలతో వదిలించేసుకోండి..-5 ayurvedic home remedies for acidity that you must try ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  5 Ayurvedic Home Remedies For Acidity That You Must Try

Home Remedies for Acidity : మలబద్ధకం, అజీర్ణ సమస్యలను.. ఇంటి చిట్కాలతో వదిలించేసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 23, 2022 02:11 PM IST

Home Remedies for Acidity : ఈ మధ్యకాలంలో మన జీవన శైలి, తినే ఆహారంలో మార్పుల వల్ల కడుపులో, గుండెల్లో మంటలు, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అయితే ఈ సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నట్లైతే.. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఉపశమనం పొందవచ్చు.

ఆయుర్వేద చిట్కాలతో.. అజీర్ణ సమస్యలు దూరం చేసుకోండి..
ఆయుర్వేద చిట్కాలతో.. అజీర్ణ సమస్యలు దూరం చేసుకోండి..

Home Remedies for Acidity : మీ కడుపులో, గొంతులో తిన్నవెంటనే.. లేదా సడెన్​గా మంటగా అనిపిస్తుందా? గుండెల్లో మంట, మలబద్ధకం, అజీర్ణం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయా? అవును అయితే.. మీరు ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతున్నారు. సరైన సమయంలో భోజనం చేయకపోవడం వల్ల, భోజనం తర్వాత సరైన యాక్టివిటీ లేకపోవడం వల్ల, మద్యం, ధూమపానం అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రావొచ్చు.

ఈ సమయంలో జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడం చాలా ముఖ్యం. అంతేకాకుండా యాసిడ్ రిఫ్లక్స్ వంటి బాధాకరమైన లక్షణాల నుంచి విముక్తి పొందేందుకు.. మీరు కొన్ని ఉత్తమమైన ఇంటి నివారణలను పాటించవచ్చు అంటున్నారు నిపుణులు. ఆయుర్వేదంలో వీటికి మంచి ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏమిటి? వాటిని ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి ఆకులు

తులసి ఆకులు కార్మినేటివ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందినవి. ఇది మీ జీర్ణవ్యవస్థను త్వరగా శాంతపరుస్తుంది. మీకు కడుపులో ఇబ్బందిగా అనిపించినప్పుడు కొన్ని తులసి ఆకులను నమలండి. దీని వల్ల మన కడుపులో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఇది కడుపులో మంటలను తగ్గిస్తుంది. కడుపులో ఎసిడిటీవల్ల వచ్చే సమస్యలను ఈ తులసి ఆకులతో నయం చేయవచ్చు.

కొన్ని ఆకులను నీటిలో ఉడకబెట్టి.. ఆ నీటిని వేడిగా ఉన్నప్పుడే.. సిప్ వేస్తూ ఉండండి. ఇది మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

గోరువెచ్చని నీరు..

జీర్ణక్రియను సులభతరం చేయడానికి, కడుపు లైనింగ్‌ను శాంతపరచడానికి, గ్యాస్ట్రిక్ ఆమ్లాల వల్ల ఇబ్బంది కలగకుండా, యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించడానికి ఒక కప్పు వేడి నీటిని తాగాలని ఆయుర్వేదం సూచిస్తుంది. అద్భుతమైన ఫలితాల కోసం రోజులో ఒక గ్లాసు ఖాళీ కడుపుతో తీసుకోండి. దానిని రోజు మొత్తం కంటిన్యూ చేయండి.

బెల్లం

బెల్లం మంచి పరిమాణంలో మెగ్నీషియంను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరాన్ని తగ్గించి.. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలి లేకపోవడాన్ని కూడా బెల్లం ద్వారా సరిచేసుకోవచ్చు. తక్షణ ఫలితాల కోసం చిన్న ముక్కను తినండి.

మజ్జిగ

మజ్జిగ ఒక గొప్ప ప్రోబయోటిక్. ఇది మీ కడుపు ఆరోగ్యానికి అద్భుతాలు చేయగలదు. అంతేకాకుండా ఎసిడిటీకి అద్భుతమైన విరుగుడుగా మారుతుంది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఈ పరిస్థితి మీకు చికాకు కలిగించే లక్షణాల నుంచి తక్షణమే ఉపశమనం అందిస్తుంది. గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది.

ఫెన్నెల్ సీడ్స్

ఇది మీ జీర్ణక్రియ సమస్యలన్నింటికీ సరైన మంత్రదండం. ఇవి బలమైన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి కండరాలు, పేగులను సడలించడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా గ్యాస్ నుంచి ఉపశమనం అందిస్తాయి.

మీరు కూడా కడుపు సంబంధిత సమస్యలతో, ఎసిడిటీతో బాధపడుతూ ఉంటే ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి. అప్పటికీ తగ్గకుంటే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్