Basil Leaves Health Benefits । ఆయుర్వేద ఔషధం.. తులసి ఆకులు నమిలితే కలిగే ప్రయోజనాలు ఇవే!-consume basil leaves daily you will get these health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Basil Leaves Health Benefits । ఆయుర్వేద ఔషధం.. తులసి ఆకులు నమిలితే కలిగే ప్రయోజనాలు ఇవే!

Basil Leaves Health Benefits । ఆయుర్వేద ఔషధం.. తులసి ఆకులు నమిలితే కలిగే ప్రయోజనాలు ఇవే!

HT Telugu Desk HT Telugu

Basil Leaves Health Benefits: ఆయుర్వేదం ప్రకారం తులసి ఒక ఔషధ మొక్క. తులసి ఆకులతో పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

Basil Leaves Health Benefits (Unsplash)

ప్రతి హిందువుల ఇంట్లో తులసి మొక్క ఉంటుంది, ఈ మొక్కను ఎంతో పవిత్రంగా భావించి ప్రతిరోజు పూజలు కూడా చేస్తారు. ఈ విషయం అటుంచితే, ఈ తులసి ఆరోగ్యపరంగానూ విశేష ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో తులసి మొక్కను ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా చెబుతారు. దీని ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు.

తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది, అంటు వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Basil Leaves Health Benefits

తులసి ఆకులు నమలడం, నీటిలో మరిగించి తీసుకోవడం లేదా మరేరకంగానైనా తీసుకోవచ్చు. తులసి ఆకులు తినడం ద్వారా ఈ కింది ప్రయోజనాలు ఉంటాయి.

ఒత్తిడిని తగ్గిస్తుంది

రోజూ ఖాళీ కడుపుతో 10-12 తులసి ఆకులను నమలడం వలన ఒత్తిడి నుండి బయటపడతారు. తులసి ఆకుల్లోని గుణాలు శరీరంలో ఒత్తిడికి కారకమయ్యే కార్టిసాల్ అనే హర్మోన్ ఉత్పత్తిని అదుపు చేయగలవని పరిశోధనలో తేలింది. ఈ హర్మోన్ ఉత్పత్తి తగ్గినపుడు, ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడతాయి.

మధుమేహాన్ని అదుపులో

తులసిలో యూజినాల్, మిథైల్ యూజినాల్, కారియోఫిలీన్ వంటి మూలకాలు ఉంటాయి, ఇవి ప్యాంక్రియాటిక్ బీటా కణాలను సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యాన్ని కల్పిస్తాయి. దీని కారణంగా శరీరంలో ఇన్సులిన్ సమతుల్యంగా ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. తద్వారా ఇది మధుమేహాన్ని నివారిస్తుంది.

నోటి దుర్వాసన

నోటి నుండి దుర్వాసన వస్తుంటే, కొన్ని తులసి ఆకులను నమలండి. నోటి దుర్వాసన తొలగిపోతుంది.

తలనొప్పి, జలుబుకు

తులసి గుణాలు సీజనల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. సైనసైటిస్, అలెర్జీలు, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు ఉంటే, తులసి ఆకులను నీటిలో బాగా మరిగించి, ఆ తర్వాత వాటిని ఫిల్టర్ చేయండి. ఈ ఫిల్టర్ చేసిన నీటిని కొద్దికొద్దిగా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత కథనం