తెలుగు న్యూస్ / ఫోటో /
Basil Leaves Benefits | ఆందోళన వద్దు.. తులసి ఆకులు నమలండి, అనేక ప్రయోజనాలు!
- తులసి ఆకులలో విటమిన్ K, విటమిన్ A అధికంగా ఉంటుంది. ఈ ఆకులను నమలడం ద్వారా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మితంగా తీసుకుంటే సురక్షితం.
- తులసి ఆకులలో విటమిన్ K, విటమిన్ A అధికంగా ఉంటుంది. ఈ ఆకులను నమలడం ద్వారా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మితంగా తీసుకుంటే సురక్షితం.
(1 / 7)
రోజూవారీగా తులసి ఆకులను నమలటం వలన ఆరోగ్యానికి మంచిది. ఇది ఆందోళన తగ్గిస్తుంది, ఆలోచనల్లో స్పష్టతను పెంచుతుంది. వయసుతో పాటు వచ్చే మతిమరుపును తగ్గిస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి.
(2 / 7)
నోటి దుర్వాసన పోవాలంటే, నేరుగా కొన్ని పచ్చి తులసి ఆకులను నమలాలి. తులసి ఆకులను ఎండబెట్టి పొడిచేసి, ఆవాల నూనెలో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ నమిలితే తాజాదనం లభిస్తుంది.
(3 / 7)
తులసిలో యాంటీ స్ట్రెస్ గుణాలు ఉన్నాయి. ఆందోళనగా ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులను నమలడం వలన ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.
(4 / 7)
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే సామర్ధ్యం తులసి ఆకులకు ఉంది. తులసి ఆకులు నమలడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు.
(6 / 7)
తేనె, అల్లం, తులసి కలిపి తయారుచేసిన కషాయాన్ని తాగడం వల్ల బ్రాంకైటిస్, ఆస్తమా, కఫం, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇతర గ్యాలరీలు