తులసి పరిసరాల్లో ఈ మొక్కలను నాటవద్దు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే!
తులసి ఔషధ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన మొక్క. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రంలో తులసిని ఇంట్లో ఉంచడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.
తులసి ఔషధ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన మొక్క. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రంలో తులసిని ఇంట్లో ఉంచడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. ఈ కారణాల వల్ల చాలా మంది ఇళ్లలో తులసి మొక్కను పెంచుతారు. జ్యోతిష్యం పరంగా తులసి దళం విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. విష్ణువుకు తులసి అంటే అత్యంత ప్రీతి. అలాగే తులసితో కూడిన ఇంట్లో లక్ష్మి నివసిస్తుందని చెబుతారు.
తులసిని నాటేటప్పుడు , గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు
1. తులసి మొక్కను ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి. తులసిని తప్పుదారిలో పెట్టినా ప్రయోజనం ఉండదు.
2. సాధరణంగా ఇంట్లో తులసిని మొక్కి పూజిస్తారు. ఇందుకోసం ఉదయాన్నే తలస్నానం చేసి తులసి నీళ్లను పోసి సాయంత్రం దీపారాధన చేయాలి.
3. తులసికి నీటిని పోసేటప్పుడు మహిళలు జుట్టు వేసుకోకూడదు .
4. ఆదివారం, ఏకాదశి నాడు తులసికి జలాన్ని పోయకూడదు. ఈ రోజున తులసి మహావిష్ణువు వ్రతం జరుపుకుంటుందని నమ్ముతారు.
5. పొరపాటున తులసి చుట్టూ చెత్త, మురికి నీరు, పాదరక్షలు, చీపుర్లు లేదా చెత్త వేయవద్దు. అలాగే తులసి మొక్కపై మురికి నీరు లేకుండా చూసుకోవాలి
తులసి చుట్టూ ఈ మొక్కలను నాటవద్దు:
చుట్టూ ముళ్ల మొక్కలను నాటవద్దు. లేకపోతే, ఇంట్లో దురదృష్టం, ప్రతికూలత పెరుగుతుంది.
2. తులసి మొక్కలు నాటే బుట్టలో మరే ఇతర మొక్కను నాటవద్దు. అలాగే డాబా మీద తులసిని పెట్టకూడదు. తులసిని ఇంటి ప్రాంగణంలో లేదా బాల్కనీలో ఉంచాలి.
3. సాయంత్రం తులసి కింద దీపం పెట్టిన తర్వాత లైట్స్ ఆర్పాలి.
సంబంధిత కథనం