తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Gain Diet । బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఇలా తినండి!

Weight Gain Diet । బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఇలా తినండి!

HT Telugu Desk HT Telugu

23 November 2022, 15:11 IST

    • Weight Gain Diet -బరువు తగ్గటం కంటే బరువు పెరగటం చాలా సులభం. మీరు బరువు పెరగాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? బరువు పెరిగేందుకు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
Weight Gain Diet
Weight Gain Diet (Unsplash)

Weight Gain Diet

మనలో చాలా మంది తమ శరీర బరువు గురించి ఆందోళన చెందుతుంటారు. కొంత మంది అధిక బరువును మోయలేక తగ్గాలని తంటాలు పడుతుంటే, మరికొంత మంది ఎంత తిన్నా, ఏం తిన్నా బరువు పెరగటం లేదు సన్నగా తయారవుతున్నామని కలవరపడుతుంటారు. కండల కాంతారావులా కండలు పెంచాలని, కడుపుపై సిక్స్ ప్యాక్ తీసుకురావాలని చాలామందికి ఆశ ఉన్నప్పటికీ అది సాధ్యం కాదు. అయితే ఫ్యామిలీ ప్యాక్ మాత్రం ఈజీగా వచ్చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Tired After Sleeping : రాత్రి బాగా నిద్రపోయినా.. ఉదయం అలసిపోవడానికి కారణాలు

Foxtail Millet Benefits : మీకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కొర్రలు చాలు

Egg potato Fry: పిల్లలకు నచ్చేలా కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెసిపీ, చిటికెలో వండేయచ్చు

Mango eating: ఆయుర్వేదం ప్రకారం మామిడిపండ్లను తినాల్సిన పద్ధతి ఇది, ఇలా అయితేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది

బరువు తగ్గడం లేదా బరువు పెరగడం ఇందుకోసం చేసే ప్రయత్నాలలో కొన్ని సఫలమవ్వచ్చు, కొన్ని విఫలం అవ్వొచ్చు. కానీ ఒకేసారి బరువు పెరగటం లేదా అమాంతంగా తగ్గిపోవడం కూడా మంచిది కాదు. ఏదైనా ఆరోగ్యకరమైన రీతిలో జరగాలి. మన ఎత్తు, వయసు, లింగం ఆధారంగా ఎంత బరువైతే ఉండాల్సిన అవసరం ఉంటుందో అంత ఉండటం అన్ని విధాల శ్రేయస్కరం. మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలనుకుంటే ఈ చిట్కాలను అనుసరించండి.

Weight Gain Tips- బరువు పెరిగేందుకు చిట్కాలు

తల్లిదండ్రులు తమ పిల్లల సన్నబడటం గురించి తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే సులభంగా బరువు పెరగవచ్చు. బరువు పెరగాలి అంటే శరీరానికి అవసరమైన కేలరీల కంటే సుమారు ఒక వెయ్యి కేలరీలు ఎక్కువగా తీసుకోవడం అవసరం అని నిపుణులు అంటున్నారు.

ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగాలి. ఇది పేగులోని జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది, ఇది పోషకాలను సరిగ్గా గ్రహించడంలో సహాయపడుతుంది.

రోజుకు మూడుసార్లు భారీ ఆహారం, రెండుసార్లు తేలికపాటి ఆహారం తీసుకోండి. అలాగే, ప్రతి భారీ భోజనం తర్వాత అల్పాహారం కోసం కొన్ని గ్రానోలా బార్లు లేదా డోనట్స్ తీసుకోండి.

మీ ఆహారంగా ఎర్ర దుంపలు, ఆప్రికాట్లు, తృణధాన్యాలు, స్క్వాష్, ఎండుద్రాక్ష, అరటిపండ్లు, ఖర్జూరాలు, బీన్స్, మొక్కజొన్న, బంగాళాదుంపలు బీన్స్, కాయధాన్యాలు మొదలైనవి ఎక్కువగా తినండి. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాలు, మజ్జిగ, తాజా పండ్ల రసాలు మొదలైనవి తాగడం వల్ల శరీరానికి సరిపడా కేలరీలు అందుతాయి. ఇవి మీరు బరువు పెరిగేందుకు దోహదపడతాయి. వీటన్నింటితో పాటు కండరాలు పెరగాలంటే వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం

Weight Gain Diet - బరువు పెరిగేందుకు ఆహారాలు

మీరు బరువు పెరగడానికి అలాగే కండరాలను నిర్మించడానికి సహాయపడే ఉత్తమ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.

అన్నం- చికెన్

మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు చికెన్ కాలేను తినండి. ఒకపూట తింటే మీకు 400 కేలరీలు లభిస్తాయి. అలాగే వెజిటబుల్-టోఫు ఫ్రైడ్ రైస్ కూడా మంచి ఆప్షన్.

వెన్నపూసిన నట్స్

మీరు బరువు పెరగాలని చూస్తున్నట్లయితే నట్ బటర్స్ సరైన ఎంపిక. గింజలు చాలా క్యాలరీలను కలిగి ఉంటాయి కాబట్టి, రోజుకు కేవలం రెండు పూటలు భోజనంతో పాటుగా లేదా అల్పాహారంగా తీసుకుంటే వందల కొద్దీ కేలరీలు లభిస్తాయి. స్మూతీస్, యోగర్ట్‌లు, క్రాకర్స్ వంటి వివిధ రకాల స్నాక్స్ లేదా డిష్‌లకు నట్ బటర్‌లను జోడించవచ్చు. పీనట్ బటర్ బనానా స్మూతీని ప్రయత్నించండి, అప్పటికప్పుడే 270 కేలరీలు లభిస్తాయి. అయితే చక్కెర లేదా అదనపు నూనెలు లేని నట్ బటర్‌లను తినాలి.

ఎర్రమాంసం

మటన్ వంటి రెడ్ మీట్‌లు కండరాలను పెంచే ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. సన్నని మాంసం, కొవ్వు మాంసాలలో ప్రోటీన్ శాతం చాలా ఉంటుంది, అయితే కొవ్వు మాంసం ఎక్కువ కేలరీలను అందిస్తుంది. ఇది మీరు బరువు పెరగడానికి సహాయపడుతుంది. 85 గ్రాములు కొవ్వు మాంసంలో సుమారు 300 కేలరీలు ఉంటాయి.

బంగాళదుంపలు

ఆలుగడ్డలలో కార్బోహైడ్రేట్లు చాలా ఉంటాయి. సులభంగా బరువు పెరిగేందుకు ఆలు గడ్డలు, ఇతర దుంపలను తినవచ్చు. ఇవి మీరు బరువు పెరగడానికి కార్బోహైడ్రేట్లు, కేలరీలను అందించడమే కాదు, మీ కండరాల గ్లైకోజెన్ నిల్వలను కూడా పెంచుతాయి. చాలా క్రీడలు, ఇతర ఆటలు సమర్థవంతంగా ఆడేందుకు గ్లైకోజెన్ ప్రధాన ఇంధన వనరు. బంగాళదుంపలతో మీకు 330 గ్రాముల కేలరీలు అందుతాయి.

గుడ్లు

కండరాలను పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలలో గుడ్లు ఒకటి. ఇవి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల గొప్ప కలయికను అందిస్తాయి. 2 గుడ్లు తింటే సుమారు 74 కేలరీలు అందుతాయి. అయితే ఎగ్ వైట్ ను వేరుచేయకుండా మొత్తం గుడ్డును తినడం కూడా చాలా ముఖ్యం. నిజానికి గుడ్డులోని దాదాపు అన్ని ప్రయోజనకరమైన పోషకాలు పచ్చసొనలో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఎగ్ వైట్ మాత్రమే తినాలి.

టాపిక్

తదుపరి వ్యాసం