తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods To Loss Weight : బరువు తగ్గాలంటే వారానికి రెండు మూడు సార్లైనా ఈ ఫుడ్ తీసుకోండి..

Foods to Loss Weight : బరువు తగ్గాలంటే వారానికి రెండు మూడు సార్లైనా ఈ ఫుడ్ తీసుకోండి..

05 November 2022, 10:12 IST

    • Foods to Loss Weight : బరువు తగ్గడం అనేది చాలా సమయం తీసుకునే ప్రక్రియ అని అందరికీ తెలుసు. కేవలం ఒకటి, రెండు రోజుల్లో ఇది సాధ్యం కాదు. డైట్, ఎక్సర్ సైజ్ వంటి అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొన్ని ఆహారాలు మీకు బరువు తగ్గడానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గించే ఆహారాలు
బరువు తగ్గించే ఆహారాలు

బరువు తగ్గించే ఆహారాలు

Foods to Loss Weight : బరువు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి సమస్య అయిపోతుంది. అయితే కొందరు వారం అంతా డైట్ చేసి.. వారాంతాల్లో ఎక్కువగా తినేస్తారు. లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల కూడా బరువు పెరుగుతారు. రోజువారీ ఆహారం మాత్రమే కాకుండా.. వారాంతాల్లో మీరు తీసుకునే ఆహారం కూడా బరువు తగ్గించే ప్రక్రియకు భంగం కలిగిస్తుందని తెలుసుకోవాలి.

అయితే మీరు కొన్ని ఆహారాలను కనీసం వారానికి ఒక్కసారి తీసుకున్నా.. అది మీరు బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. వాటిని రోజూ కూడా మీ ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. ఆ ఆహారాలు ఏమిటి? వాటితో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్లు

కోలిన్, విటమిన్ డి వంటి మూలకాలు గుడ్డులోని పచ్చసొనలో, 4-6 గ్రాముల ప్రోటీన్ గుడ్డులోని తెల్లసొనలో ఉంటాయి. మీ కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి వారానికి కనీసం రెండు గుడ్లు తినండి. ఇవి మీరు బరువు తగ్గడంలోనూ, మరిన్ని ఆరోగ్యప్రయోజనాలను అందిస్తాయి.

పెరుగు

పెరుగులో కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీకు జీర్ణక్రియలో సమస్యలు ఉంటే.. మీరు పెరుగును ఆహారంలో చేర్చుకోవచ్చు. దాని ఆరోగ్యకరమైన, ప్రభావవంతమైన ఫలితాలను పొందాలంటే.. కనీసం వారానికి రెండు మూడు సార్లు పెరుగు తినండి.

చేప

చేపల్లో అధిక ప్రొటీన్లు ఉంటాయి. మీరు నాన్‌వెజ్‌ ఫుడ్‌ తినాలనుకుంటే.. వారానికి ఒక్కసారైనా చేపలు తినాలి. ప్రోటీన్‌తో పాటు మీ కంటి చూపు, జుట్టు మొదలైన వాటికి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా దీనిలో అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి.

చియా విత్తనాలు

చియా సీడ్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతమైనవి. కాబట్టి మీరు వారానికి రెండు టీస్పూన్ల చియా విత్తనాలను మీ డైట్లో చేర్చుకుని.. ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

టాపిక్