తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Benefits Of Walking : రోజూ నడవండి భయ్యా.. ఆరోగ్యానికి మంచిది

Health Benefits of Walking : రోజూ నడవండి భయ్యా.. ఆరోగ్యానికి మంచిది

13 September 2022, 8:04 IST

    • Health Benefits of Walking : డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఆరోగ్యం విషయంలో ముందు నడక ప్రారంభించండి అంటారు. డైలీ వ్యాయామాలు చేయకపోయినా పర్లేదు కానీ.. నడవాలి అంటారు. ఎందుకంటే ఇది మీరు ఫిట్​గా ఉండేందుకు, వివిధ ఆరోగ్య ప్రయోజనాలు అందించేందుకు సహాయం చేస్తుంది. 
ఆరోగ్యానికి నడక మంచిది
ఆరోగ్యానికి నడక మంచిది

ఆరోగ్యానికి నడక మంచిది

Health Benefits of Walking : రోజూ ఏదొక సమయంలో నడుస్తూనే ఉంటాం కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. రోజంతా బెడ్​రూమ్​ నుంచి వంటగదికి లేదా క్యాంటీన్ నుంచి ఆఫీస్ క్యూబికల్‌కి నడుస్తున్నాం కదా అనుకుంటారు చాలామంది. కానీ అది అలా కాదు. నిర్ణీత కాలం పాటు నడకవిషయంలో కొన్ని నిబంధనలు పాటిస్తేనే ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా మీరు కొవ్వును తగ్గించుకోవాలనే లక్ష్యంతో నడుస్తున్నా.. మీరు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందుతారు. మరి నడక వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు చుద్దాం.

రక్తపోటు

రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి.. వైద్యుల సలహా మేరకు ఆహారం, తాగే నియమాలను పాటించడం అవసరం. అంతేకాకుండా ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

గుండె ఆరోగ్యంగా కోసం

క్రమం తప్పకుండా నడవడం వల్ల ధమనులలో పేరుకున్న కొవ్వు తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నడక మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కీళ్ల నొప్పుల నుంచి రోగనిరోధక శక్తి వరకు

మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే.. నడకను కచ్చితంగా ప్రారంభించండి. ఇది కీళ్ల నొప్పులను దూరం చేయడంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు చాలా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది.

బరువు తగ్గడానికి

డైటీషియన్ సుమేధా సింగ్ మాట్లాడుతూ.. ప్రతి వారం 250 నిమిషాలు నడవండి. అంటే రోజుకు అరగంట కంటే కొంచెం ఎక్కువ నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ఫలితంగా ఇది శరీరం నుంచి అదనపు కొవ్వును తొలగించడానికి సహాయపడుతుందని వెల్లడించారు.

సుదీర్ఘ జీవితం.. మెరుగైన మానసిక స్థితి

నెమ్మదిగా నడిచే వారి కంటే వేగంగా నడిచే వారు సగటున 20 శాతం ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. కాలి కండరాలు బలపడతాయని తెలిసింది. రోజూ 30 నిమిషాలు నడిస్తే మానసిక స్థితి మెరుగుపడుతుంది కూడా.