తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Reverse Walking:రివర్స్‌ వాకింగ్‌తో ఎన్ని ప్రయోజనాలో.. లాభాలు తెలిస్తే షాకవుతారు

Reverse Walking:రివర్స్‌ వాకింగ్‌తో ఎన్ని ప్రయోజనాలో.. లాభాలు తెలిస్తే షాకవుతారు

HT Telugu Desk HT Telugu

04 June 2022, 15:31 IST

    • Reverse Walking: బ్యాక్‌ స్టెప్ వాకింగ్ వల్ల అరోగ్య అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గుండె, మానసిక, జీవక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది సాధారణ నడక కంటే వేగంగా కేలరీలను బర్న్ చేస్తుంది. వ్యతిరేక దిశగా 100 అడుగులు నడవడం సాధారణ నడకలో నడిచే వెయ్యి అడుగులతో సమానం
Reverse Walking
Reverse Walking

Reverse Walking

ఉదయం-సాయంత్రం వాకింగ్ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అయితే సాధరణ నడక కంటే రివర్స్ వాకింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్‌స్టెప్ వాకింగ్ మన గుండె, మనస్సు, జీవక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది సాధారణ నడక కంటే వేగంగా కేలరీలను బర్న్ చేస్తుంది. వ్యతిరేక దిశగా 100 అడుగులు నడవడం సాధారణ నడకలో నడిచే వెయ్యి అడుగులతో సమానం. దీని వల్ల గుండె రక్తాన్ని వేగంగా పంప్ చెస్తోంది. దీని వల్ల రక్తం, ఆక్సిజన్.. శరీరం, కండరాలకు, మెదడులోని అన్ని భాగాలకు పంపు చెస్తోంది. అలాగే మెదడు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.

స్ట్రోక్, ఆర్థరైటిస్‌ నుండి ఉపశమనం

రివర్స్ వాకింగ్ అలవాట్లు స్ట్రోక్ పేషెంట్‌లకు ఉపయోగకరంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలోని గార్డనర్ న్యూరోసైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఒక పరిశోధకులు తెలిపారు. వెనుకకు నడవడం వల్ల అవయవాల సమతుల్యత మెరుగుపడుతుందని, దిగువ అవయవాల ప్రొప్రియోసెప్షన్, కదలికను సర్దుబాటు చేస్తుందని వెల్లడించారు. మోకాలిలో ఆర్థరైటిస్ లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చని చాలా అద్యయనాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా రివర్స్‌లో నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుందని తెలిపాయి.

గుండె జబ్బులు దూరంగా ఉంటాయి

రివర్స్ వాకింగ్ వల్ల చాలా వరకు గుండె సమస్యలు దూరంగా ఉంటాయి. గుండె, ఊపిరితిత్తుల మెరుగైన పనితీరుకు ఈ వాకింగ్ మంచిదని పరిశోధకులు తెలిపారు. ఎంత ఎక్కువ నడిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అంత తగ్గుతుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇన్సులిన్‌ను కంట్రోల్ ఉంచతూ.. రక్తంలో చక్కెరను నియంత్రించి మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రివర్స్ వాకింగ్ ఆరోగ్యంపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుందని డాక్టర్స్ వివరిస్తున్నారు. ఇది ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది. వైద్యుల అభిఫ్రాయం ప్రకారం, రివర్స్ వాకింగ్.. నడక పద్ధతిని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని బ్యాలెన్సీంగ‌ా ఉంచుతుంది. ఇది కంటి చూపును, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.