L&T Infotech, Mindtree విలీనం: ఇక ఎల్టీఐమైండ్‌ట్రీగా ఆవిర్భావం
06 May 2022, 17:00 IST
ముంబై: ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనం కానున్నాయి. భారీస్థాయి ఐటీ సేవల సంస్థగా ఎదిగేందుకు మెగా విలీనాన్ని ప్రకటించాయి. నూతన సంస్థ పేరు ఎల్‌టీఐ మైండ్‌ట్రీ అని తెలిపాయి.
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్
‘విలీన స్కీమ్ ప్రభావవంతంగా మారిన తర్వాత.. మైండ్‌ట్రీ ప్రతి 100 షేర్లకు ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ 73 షేర్లను అందిస్తుంది..’ అని సంయుక్త ప్రకటన తెలిపింది.
అలా జారీ చేసిన ఎల్టీఐ కొత్త షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్‌ఈలో ట్రేడవుతాయి. విలీనం తర్వాత లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ ఎల్టీఐలో 68.73 శాతం కలిగి ఉంటుంది.
విలీనంపై ఎల్టీఐ ఛైర్మన్ ఎ.ఎం.నాయక్ మాట్లాడుతూ ‘ఎల్టీఐ, మైండ్‌ట్రీ అనుబంధ వ్యాపారాలు ఈ విలీనాన్ని మా వినియోగదారులు, పెట్టుబడిదారులు, వాటాదారులు, ఉద్యోగులకు విన్-విన్' ప్రతిపాదనగా మారుస్తాయి’ అని పేర్కొన్నారు. విలీనం గురించి వివరిస్తూ విలీన సంస్థకు డీసీ ఛటర్జీ నాయకత్వం వహిస్తారని నాయక్ విలేకరులతో అన్నారు.
ఎల్‌టీఐ సీఈవో సంజయ్ జలోనా వ్యక్తిగత కారణాలతో కంపెనీకి రాజీనామా చేశారు. ‘ఇటీవలి పరిశ్రమ మార్పులు భారీ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తున్నందున, రెండు సంస్థలు మెరుగైన సేవలందించేందుకు వీలుగా విలీనమవ్వాలని నిర్ణయించుకున్నాయి..’ అని ప్రకటన పేర్కొంది.
టాపిక్