తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market | భారీగా 'అమ్మేస్తున్నారు'.. నష్టాల్లో దేశీయ సూచీలు

Stock market | భారీగా 'అమ్మేస్తున్నారు'.. నష్టాల్లో దేశీయ సూచీలు

HT Telugu Desk HT Telugu

06 May 2022, 9:25 IST

    • దేశీయ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడి ప్రభావం దేశీయ స్టాక్​ మార్కెట్లపైనా పడింది.
భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు
భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు (PTI)

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

Stock Market today | అంతర్జాతీయంగా ఉన్న స్టాక్​ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొన్న వేళ.. దేశీయ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 900 పాయింట్లు కోల్పోయి 54,802 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 263పాయింట్లు పతనమై 16,419 వద్ద కొనసాగుతోంది.

గురువారం 55,702 వద్ద ముగిసిన సెన్సెక్స్​.. శుక్రవారం మరింత పతనమై 54,928 వద్ద ప్రారంభమైంది. ఇక గురువారం 16,683 వద్ద ట్రేడింగ్​ను ముగించిన నిఫ్టీ.. ఏకంగా 16,416 వద్ద శుక్రవారం సెషన్​ను మొదలుపెట్టింది.

లాభాలు.. నష్టాలు..

ఎం అండ్​ ఎం, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Stock market crash today | బజాజ్​ ఫిన్​సర్వ్​, బజాజ్​ ఫైనాన్స్​ షేర్లు 3శాతం మేర నష్టపోయాయి. హెచ్​సీఎల్​ టెక్​, విప్రో, హెచ్​యూఎల్​, మారుతీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టైటాన్​ షేర్లు 2శాతం మేర నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు ఢమాల్​..

ఫెడ్​ తీసుకున్న రేట్​ హైక్​తో ద్రవ్యోల్బణం దిగిరాదని భావించిన అమెరికా మదుపర్లు.. భారీగా అమ్మకాలు చేపట్టారు. ద్రవ్యోల్బణం దిగిరాకపోతే.. మరింత రేట్​ హైక్​కు ఫెడ్​ సిద్ధమయ్యే అవకాశం ఉందన్న భయాలతో మదుపర్లు వణికిపోతున్నారు. ఫలితంగా అమెరికా స్టాక్​మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా టెక్​ స్టాక్స్​ తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.

ఈ ప్రభావం శుక్రవారం ఓపెన్​ అయిన ఆసియా మార్కెట్లపై పడింది. ఫలితంగా దాదాపు అన్ని ఆసియా దేశాల స్టాక్​మార్కెట్లు భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం