తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అసలే డెలికేట్ మైండా మీది? అయితే ఇలా చేయండి!

అసలే డెలికేట్ మైండా మీది? అయితే ఇలా చేయండి!

Manda Vikas HT Telugu

15 March 2022, 18:51 IST

    • అసలే డెలికేట్ మైండ్ అయితే మైండ్‌ను స్ట్రాంగ్‌గా చేసుకోవడానికి ఎక్స్‌పర్ట్స్ కొన్ని చిట్కాలు అందిస్తున్నారు. అందుకు మన అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. అవేంటో చూడండి.
Delicate Mind - Image used for representative purpose
Delicate Mind - Image used for representative purpose (aha/youtube)

Delicate Mind - Image used for representative purpose

అన్ని సమస్యలు మీకే ఉన్నాయని ఉన్న సమస్యలన్నీ నెత్తి మీద పెట్టుకుంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. తద్వారా మైండ్ మీద ఒత్తిడి పెరిగి చిన్న మెదడు చితికుతుంది, పెద్ద మెదడు పగులుతుంది. టోటల్‌గా మైండ్ డెలికేట్ అవుతుంది. అయితే మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి అనంతమైన అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 8 అంకెను తిప్పితే అది ఇన్ఫినిటీ సంజ్ఞ (∞) ను సూచిస్తుంది. అంటే కేవలం చూసే దృష్టి కోణం మారిస్తే ఒక అంకె విలువ అమాంతం పెరిగినట్లు.. మన ఆలోచనా విధానం, మనం సమస్యను చూసే కోణం మారిస్తే అందులోనూ ఎన్నో అవకాశాలు లభిస్తాయనేది వారంటున్నారు.

స్ట్రాంగ్ మైండ్ కోసం మన అలవాట్లలో మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు.మరి ఎలాంటి అలవాట్లను అలవర్చుకుంటే మైండ్ స్ట్రాంగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

ఈ అలవాట్లు ఆచరణలో పెట్టండి మీ డెలికేట్ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది

రన్నింగ్

ప్రతిరోజూ ఒక అర్ధ గంట రన్నింగ్ అలవాటు చేసుకుంటే అది బాడీకే కాకుండా మైండ్‌కి మంచి ట్రీట్మెంట్ ఇస్తుంది. లోలోపల అణచివేసుకుంటున్న తీవ్రమైన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా సరైన మార్గంలో దృష్టి కేంద్రీకరించడానికి మనస్సును శిక్షణ ఇస్తుంది. మానసిక స్పష్టత అంటే ఏ విషయంలోనైనా క్లారిటీ కావాలన్నా రన్నింగ్ ఎంతో గొప్పగా సహాయపడుతుంది.

ప్రాణాయామం

యోగాలో ప్రాణాయామం ఎంతో గొప్ప ఆసనం అని చాలా సార్లు నిరూపించడం జరిగింది. ఇది మీ శ్వాస మెరుగుపరచటమే కాకుండా మీకు తెలియని మీలోని నైపుణ్యాలను నిద్రలేపుతుంది. మీ మైండ్ గొప్పగా ఆలోచించేలా ప్రాణాయామం సహాయపడుతుంది. ప్రతిరోజూ ప్రాణాయామం చేస్తే అది మైండ్‌కు ఎంతో రిలాక్సేషన్ ఇచ్చి మిమ్మల్ని మానసికంగా ధృడంగా మారుస్తుంది.

ఏమీ చేయకండి

ఒక చాక్లెట్ అడ్వర్టైజ్‌మెంట్లో చెప్పినట్లు కొన్ని సార్లు ఏమీ చేయకుండా కూడా ఏదైనా మంచి జరుగుతుంది. కాబట్టి మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకొని ఏమీ చేయకుండా ఉండండి. ఈ సమయంలో కనీసం ఫోన్ లేదు, పుస్తకం లేదు, నెట్‌ఫ్లిక్స్ లేదు జస్ట్ ఖాళీగా ఏం ఆలోచించకుండా ఉండండి. ఈ గ్యాప్‌లో మీ మైండ్ కూడా రిలాక్స్ అయి కొత్త శక్తి పొందుతుంది. ప్రతీరోజూ ఓ 10-15 నిమిషాలు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.

మీకు ఇష్టమైన వారితో గడపండి

వారంలో ఒకరోజు మిమ్మల్ని ప్రేమించే లేదా మీరు ఇష్టపడే వ్యక్తులతో గడపండి. మీకు నచ్చిన పని చేయండి. అప్పుడు మీకు తెలియకుండానే మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఆరోగ్యానికి హానికరమైనవి వద్దు

ఇది చాలా ముఖమైనది. ప్రతీ సినిమా ముందర చెప్పినట్లుగా ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే హానికరమైన ఆహారం జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మానేసి నట్స్, డ్రై ఫ్రూట్స్, పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, టొమెటోలు, గుడ్లు ఇలాంటివి మైండ్‌కి శక్తినిస్తాయి.

టాపిక్