తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sperm Count: క్వాలిటీ స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?

Sperm Count: క్వాలిటీ స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?

Manda Vikas HT Telugu

28 February 2022, 18:10 IST

google News
    • తీసుకునే ఆహారం కూడా వ్యక్తి సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా మగవారిలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మగవారిలో యుక్త వయస్సులో ఉన్నపుడు స్వరం, వెంట్రుక పెరుగుదల, కండరాల కూర్పు మొదలగు శారీరక మార్పులను నిర్ధారిస్తుంది.
Foods that Boost Sperm Count.
Foods that Boost Sperm Count. (Shutterstock)

Foods that Boost Sperm Count.

సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కారకాల్లో వీర్యం నాణ్యత ప్రధానమైనది. మానవ శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే, పునరుత్పత్తి వ్యవస్థ దానికి అందించే పోషకాలు, విటమిన్‌లపై ఆధారపడి ఉంటుంది. తీసుకునే ఆహారం కూడా వ్యక్తి సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా మగవారిలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇదొక స్టెరాయిడ్ హార్మోన్, ఇది పురుషుల వృషణాల్లో తయారవుతుంది. ఇది మగవారిలో యుక్త వయస్సులో ఉన్నపుడు స్వరం, వెంట్రుక పెరుగుదల, కండరాల కూర్పు మొదలగు శారీరక మార్పులను నిర్ధారిస్తుంది. పెరుగుతున్న కొద్దీ మగవారిలో సాధారణ ఆరోగ్యం, లైంగిక సామర్థ్యం మొదలైన వాటిలో ముఖ్యపాత్ర వహిస్తుంది.

మీరు తినే ఆహారం టెస్టోస్టెరాన్‌తో పాటు ఇతర హార్మోన్ స్థాయిలపై ప్రభావాన్ని చూపుతుంది. దీర్ఘకాలిక కేలరీల తీసుకోవడం, అతిగా తినడం వలన టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోయి లైంగిక సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్తీ ఫ్యాట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల సమతుల్యత కలిగిన ఆహారం తీసుకోవాలి. అప్పుడే టెస్టోస్టెరాన్ సరైన స్థాయిలో ఉత్పత్తి జరిగి వీర్య కణాల సంఖ్య పెరగటంతో పాటు వాటి చలనశీలత, నాణ్యత మెరుగుపడుతుంది.

స్పెర్మ్ కౌంట్ పెంచే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని:

గుడ్లు

గుడ్లలో ప్రొటీన్ కంటెంట్ నిండుగా ఉంటుంది కాబట్టి స్పెర్మ్ కౌంట్‌ను పెంచే ఆరోగ్య పదార్థాలలో ఇవి ఒక మేలైన ఎంపిక అని చెప్పొచ్చు. ఎల్లప్పుడు గుడ్లను తినడం ద్వారా అందులోని పోషకాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుంచి వీర్యకణాలను కాపాడటమే కాకుండా వాటి చలనశీలతను మెరుగుపరుస్తాయి. బలమైన, ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి, సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

పాలకూర

మీరెప్పుడైనా 'పాపాయ్ కార్టూన్స్' చూశారా? అందులో పాపాయి శక్తికోసం స్పినాచ్ అంటే పాలకూర తింటాడు. గమనించారా? . వీర్యకణాల అభివృద్ధి, ఆరోగ్యానికి ఫోలిక్ యాసిడ్ అవసరం. ఆకు కూరల్లో ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా పాలకూర ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్. శరీరంలో ఫోలిక్ ఆమ్లం స్థాయిని పెంచితే అది వీర్యంలోని అసాధారణ స్పెర్మ్‌ల సంఖ్యను తగ్గిస్తుంది, తద్వారా నాణ్యమైన స్పెర్మ్ అడంలోకి చొచ్చుకుపోయే అవకాశాలను పెంచుతుంది.

అరటి

అరటిపండ్లు తినడం ద్వారా ఎ, బి1, సి మొదలగు విటమిన్లు శరీరానికి అందుతాయి. ఇవి ఆరోగ్యకరమైన, బలమైన స్పెర్మ్ కణాలను తయారు చేయడంలో సహాయపడతాయి. స్పెర్మ్ కౌంట్ కూడా ఈ విటమిన్లపైనే ఆధారపడి ఉంటుంది. అరటిపండ్లలో ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బ్రోమెలిన్ అనే అరుదైన ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ శరీరంలోని వాపును నిరోధించడంలో, అలాగే స్పెర్మ్ కౌంట్ క్వాలిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మాకా రూట్స్

మాకా రూట్స్ అనేవి ముల్లంగిలా కనిపించే అద్భుతమైన ఆయుర్వేద మూలికలు. ఇవి పురుషుల్లో లైంగిక ఆసక్తిని పెంచడమే కాకుండా వారి స్పెర్మ్ కౌంట్స్, ఫెర్టిలిటీని కూడా పెంచుతాయి. ఈ మూలికను సప్లిమెంట్‌గా తీసుకునే పురుషుల్లో వీర్యం కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. స్పెర్మ్ మొటిలిటీ కూడా బాగుంటుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో ఎల్-అర్జినిన్ హెచ్‌సిఎల్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది అధిక స్పెర్మ్ కౌంట్స్, వీర్యం మోతాదుకు దోహదపడుతుంది. పరిమితంగా డార్క్ చాక్లెట్ తినడం ద్వారా స్పెర్మ్ కౌంట్‌ను కొంతమేర పెంచుకోవచ్చు.

వాల్‌నట్స్

నట్స్ అనేవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లకు మంచి మూలం. స్పెర్మ్ కణాల రక్షణగా కణ త్వచం ఉత్పత్తికి ఆరోగ్యకరమైన కొవ్వులుగా చెప్పే ఒమేగా -3 ఫాటీ ఆసిడ్స్ అవసరం. ఇవి వృషణాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, తద్వారా వీర్యం వృద్ధి జరుగుంది. వాల్నట్ లోని అర్జినైన్ కంటెంట్ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి దోహదం చేస్తుంది. వాల్‌నట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా రక్తప్రవాహంలోని టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడతాయి.

గుమ్మడికాయ గింజలు

శరీరంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపరిచే ఫైటోస్టెరాల్ గుమ్మడి గింజల్లో లభిస్తుంది. ఇది స్పెర్మ్ కౌంట్, ఫెర్టిలిటీ పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి వీర్యం పరిమాణాన్ని పెంచుతాయి.

జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు

స్పెర్మ్ కణాల ఉత్పత్తిలో జింక్ భారీ పాత్ర పోషిస్తుంది. జింక్ లోపం వల్ల స్పెర్మ్ చలనశీలతపై ప్రభావం పడి సంతానోత్పత్తి తగ్గుతుంది. కాబట్టి మినరల్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. బార్లీ, బీన్స్, రెడ్ మీట్, చిక్కుళ్ళు, షెల్ ఫిష్, పాలు, తృణ ధాన్యాలు మొదలగు పదార్థాలలో జింక్ పుష్కలంగా లభిస్తుంది.

 

తదుపరి వ్యాసం