తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Erectile Dysfunction | అంగస్తంభన సమస్య ఇలా అధిగమించవచ్చు

Erectile Dysfunction | అంగస్తంభన సమస్య ఇలా అధిగమించవచ్చు

Manda Vikas HT Telugu

28 December 2021, 11:59 IST

    • ఇటీవలి కాలంలో మగవారిలో అంగస్తంభన (ED) కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ సమస్యకు శారీరక లేదా మానసిక పరిస్థితుల కారణం కావొచ్చు. మగవారిలో అంగస్తంభన (ED) కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ సమస్యకు శారీరక లేదా మానసిక పరిస్థితుల కారణం కావొచ్చు.
ED- Representational Image
ED- Representational Image (Getty Images)

ED- Representational Image

చాలా మంది తమ లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల గురించి గోప్యంగా ఉంచుతారు. అలా గోప్యంగా ఉంచినంత వరకు సరే కానీ, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. సకాలంలో సరైన వైద్యం తీసుకోకపోతే అది భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ఇటీవలి కాలంలో మగవారిలో అంగస్తంభన (ED) కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ సమస్యకు శారీరక లేదా మానసిక పరిస్థితుల కారణం కావొచ్చు. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి తదితర కారణాల చేత 25 ఏళ్లకు మించని పురుషుల్లో కూడా అంగస్తంభన జరగకపోవడం అనేది ఇప్పుడు సాధారణ సమస్యగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Peanuts for Diabetic: మధుమేహం ఉన్నవారు వేరుశెనగ పలుకులను తినడం ప్రమాదమా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Ghee with Milk: గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని రోజూ తాగి చూడండి, మీలో మార్పును గమనించండి

Chanakya Niti Telugu : పెళ్లయ్యాక మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తే మీ వైవాహిక జీవితం నరకమే

Carrot Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ కోసం క్యారెట్ పరాటా రెసిపీ, అరగంటలో దీన్ని వండేయచ్చు

ఏవైనా కొన్ని సందర్భాల్లో అంగస్తంభన జరగకపోతే దాని గురించి చింతించాల్సిన అవసర లేకపోవచ్చు గానీ, ప్రతీసారి అలాగే అవుతుంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ సమస్య కారణంగా ఆత్మవిశ్వాసం మరింత సన్నగిల్లి, ఒత్తిడి పెరిగి అది సమస్య తీవ్రతను పెంచే అవకాశం ఉంది.

అంగస్తంభన సమస్యకు దోహదపడే కొన్ని సాధారణ కారణాలు:

  • గుండెజబ్బులు
  • రక్తనాళాలు మూసుకుపోవడం (అథెరోస్ల్కెరోసిస్)
  • అధికకొలెస్ట్రాల్
  • అధికరక్త పోటు (హైబీపీ)
  • మధుమేహం (షుగర్)
  • ఊబకాయం
  • మెటబాలిక్సిండ్రోమ్ - అధిక ఇన్సులిన్ స్థాయిలు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు, అధిక కొలెస్ట్రాల్‌తో కూడినపరిస్థితి
  • పార్కిన్సన్స్ వ్యాధి
  • మల్టిపుల్ స్క్లీరోసిస్
  • కొన్నిరకాలఔషధాలతో సైడ్ ఎఫెక్ట్స్
  • స్మోకింగ్, టోబాకో నమలడం
  • పెరోనిస్ వ్యాధి - పురుషాంగం లోపల మచ్చలాంటి కణజాలంఅభివృద్ధి
  • మద్యపానం, డ్రగ్స్
  • నిద్రలేమి
  • ప్రొస్టేట్ క్యాన్సర్ , ప్రొస్టేట్ గ్రంథికి సంబంధించిన చికిత్సలు
  • వెన్నుపామునుప్రభావితం చేసే శస్త్రచికిత్సలు లేదాగాయాలు
  • తక్కువటెస్టోస్టెరాన్ ఉత్పత్తి

ఈ సమస్య నుండి బయటపడేదెలా?

కొన్ని రకాల వ్యాయామాలు చేయడం ద్వారా లైంగికశక్తికి పునరుజ్జీవం కల్పించవచ్చు. రన్నింగ్, స్విమ్మింగ్, ఇతర ఏరోబిక్ వ్యాయామాలు EDని నిరోధించడంలో సహాయపడతాయని నిరూపితమైనవి. కలరిసూత్రం, కెగెల్ వ్యాయామాలు కూడా ఈ సమస్యని తగ్గిస్తాయనే వాదన ఉంది కానీ అందుకు ఆధారాలు లేవు. అయితే ఎలాంటి వ్యాయామాలు చేసినా కూడా అవి స్క్రోటమ్, పాయువు మధ్య ఉండే పెరినియంపై అధిక ఒత్తిడిని కలగజేయనీయకుండా చూసుకోవాలి.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాయలు, చేపలు, రెడ్ వైన్‌ తీసుకునే వారిలో ED సమస్య తలెత్తదు. ఇతర నూనెలకు బదులు ఆలివ్ నూనె తీసుకోవడం ఉత్తమం.

అధిక శరీర బరువు కారణంగా టైప్ 2 డయాబెటిస్‌తో సహా అనేక ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక బరువు నరాలను దెబ్బతీస్తాయి. పురుషాంగానికి సరఫరా చేసే నరాలపై ప్రభావం పడితే ED సమస్య రావచ్చు. కాబట్టి బరువును తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి.

అనాబాలిక్ స్టెరాయిడ్లు తీసుకోవద్దు- అథ్లెట్లు, బాడీబిల్డర్లు తరచుగా అనాబాలిక్ స్టెరాయిడ్లు తీసుకుంటున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఇవి వృషణాలను కుదించి, టెస్టోస్టెరాన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ధూమపానం, మద్యపానం వదిలివేయడం మంచింది. సిగరెట్ తాగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. పొగాకులో ఉండే నికోటిన్ రక్త నాళాలను సంకోచించేలా చేస్తుంది ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని నిరోధించవచ్చు. కాబట్టి ధూమపానం, పొగాకు సంబంధింత పదార్థాలు వీలైనంత త్వరగా వదిలేయడం చాలా మంచిది.

మితంగా ఆల్కాహాల్ తీసుకోవడం వలన పెద్దగా నష్టం లేకపోవచ్చు గానీ, దీర్ఘకాలికంగా అధిక మద్యపానం తీసుకుంటే అది కాలేయం పనితీరు, నరాలను దెబ్బతీస్తుంది. దీంతో హార్మోన్లలో అసమతుల్యం జరిగి EDకి దారితీయవచ్చు.

మానసిక ఒత్తిడి అడ్రినలిన్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది, ఇది రక్త నాళాలను సంకోచించేలా చేస్తుంది. దీంతో అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. టెన్షన్‌ని లేకుండా ఒకరు మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే అదే వారి లైంగిక జీవితానికి గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోతే సరైన సమయంలో వైద్య సహాయం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

 

టాపిక్