తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సెక్స్ లో తారాస్థాయికి చేరాలంటే ఈ చిట్కాలు పాటించండి

సెక్స్ లో తారాస్థాయికి చేరాలంటే ఈ చిట్కాలు పాటించండి

04 January 2022, 14:10 IST

    • కొన్నిసార్లు మీరు లైంగిక కల్పనలు, కోరికలను వ్యక్తపరచకుండా నిరంతరం దూరంగా ఉంటే అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి నిర్ణయాత్మక అవరోధాలను అధిగమించి మీ భాగస్వామితో అత్యుత్తమ లైంగిక అనుభూతని పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
శృంగారం
శృంగారం (Hindustan times)

శృంగారం

ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రేమను శృంగారం మరింత రెట్టింపు చేస్తుంది. ఎందుకుంటే ఒకరిపై ప్రేమ ఇంతకంటే బాగా ఎవరూ వ్యక్తపరచలేరు. భావోద్వేగాలను, మానసిక సంఘర్షణలను అర్థం చేసుకునే విధానం ఆధారంగా గొప్ప అనుభూతిని పొందుతారు. కొన్నిసార్లు మీ లైంగిక కల్పనలు, కోరికలను వ్యక్తపరచకుండా నిరంతరం దూరంగా ఉంటే అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి నిర్ణయాత్మక అవరోధాలను అధిగమించి మీ భాగస్వామితో అత్యుత్తమ లైంగిక అనుభూతిని పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

ట్రెండింగ్ వార్తలు

Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

అవమాన భావనతో ఉండకండి..

శృంగారమంటే చాలామంది ఏదో తప్పు చేసినట్లు భావిస్తారు. అవమాన భారంతో కుంగిపోతారు. సెక్స్ పట్ల సమాజంలో ఉన్న వివిధ రకాల దృక్పథాలు మీలో ఇలాంటి విశ్వాసాలకు కారణం. కేవలం నాలుగు గోడల మధ్య జరిగే కార్యంలానే చాలా మంది చూస్తారు. అలా కాకుండా లైంగిక అంశాల్లో సానుకూలంగా ఆలోచించడం మీకు విలువను చేకూరుస్తుంది. ఈ అవమానాన్ని అధిగమించడం వల్ల మీరు మీ భాగస్వామితో సెక్స్​లో స్వేచ్ఛగా మాట్లాడేలా చేయడంలో సహాయం చేస్తుంది.

శృంగారం గురించి తెలుసుకోండి..

చాలా మంది శృంగారం గురించి మాకు అంతా తెలుసని అనుకుంటారు. కానీ అలా అనుకోవడం తప్పు ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సెక్స్ గురించి మీకు అవగాహన ఉండటం వల్ల కచ్చితంగా ఏం చేయాలనుకుంటున్నారో, ఎదుటి వారు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు తరచుగా మీ భాగస్వామితో శృంగారం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించాలి.

తాకుతూ ఉండిపోండి..

ఆలుమగల మధ్య రొమాన్స్ అనేది వారి అన్యోన్యాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా శృంగారం ఎప్పుడూ ఉద్వేగంగా, తారాస్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. బదులుగా ఇరువురు రొమాంటిక్ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి. ఇందుకోసం ఒకరితో ఒకరు ఏకాంతంగా గడుపుతూ, సన్నిహితంగా ఉంటే బంధం మరింత వికసిస్తుంది. శారీరకంగా ఒకటవ్వడాని కంటే ముందు విస్తృతమైన ఫోర్ ప్లే మీ శృంగారానుభూతిని తారాస్థాయికి తీసుకెళ్తుంది.

ఏం కోరుకుంటున్నారో అంచనా వేయండి..

రోజూ మీ భాగస్వామి ఏ విధంగా ఉంటున్నారో, సెక్స్ పరంగా వారు ఏం కోరుకుంటున్నారో ముందుగానే ఊహించండి. వారు ఉల్లాసభరితంగా ఉన్నారా లేదా ఉద్వేగంతో ఉన్నారా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి మిమ్మల్ని సరదాగా తాకుతున్నారా, రొమాంటిక్​గా తాకుతున్నారా అనే విషయాన్ని తెలుసుకుంటే వారికి కావాల్సిన విధంగా, మీరు ఆనందించే విధంగా శృంగారంలో మునిగి తేలవచ్చు.

ఫాంటసీలు, కల్పనలు కలిగి ఉండటం..

మీ మనస్సులో శృంగారపరమైన ఫాంటసీలు, కల్పనలు కలిగి ఉండటం వల్ల అవి మిమ్మల్ని, మీ భాగస్వామిని మరింత ఉత్తేజపరుస్తాయి. ఈ ఫాంటసీలు లైంగిక భావాలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా ఇవి మనస్సు, శరీరం, ఆత్మలను ఉత్తేజపరుస్తాయి. మీకు కొన్ని లైంగిక ఫాంటసీలు, ఊహలు ఉంటే వాటిని ప్రయత్నించడానికి భయపడితే అన్ని విధాలుగా అలా చేయండి. ఇది మీకు శృంగార సాధికారతను అనుభూతి చెందడంలో సహాయపడుతుంది. పడకగదిలో ఎక్కువ సంతృప్తిని కలగజేస్తుంది.

టాపిక్