తెలుగు న్యూస్  /  Lifestyle  /  2022 Maruti Suzuki Alto K10 Car Launched At Rs. 3.99 Lakhs

Maruti Suzuki Alto K10 । కేవలం రూ. 3.99 లక్షలకే మారుతి ఆల్టో కార్, సూపర్ మైలేజ్!

HT Telugu Desk HT Telugu

18 August 2022, 14:58 IST

    • మారుతి సుజుకి తమ సరికొత్త ఆల్టో కారులో 2022 మోడల్ Maruti Alto K10 కారును విడుదల చేసింది. దీని ధరలు ఎక్స్-షోరూం వద్ద రూ. 3.9 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. మరిన్ని వివరాలు చూడండి.
2022 Maruti Suzuki Alto K10
2022 Maruti Suzuki Alto K10

2022 Maruti Suzuki Alto K10

2022 Maruti Suzuki Alto K10 | మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అందుబాటులో ఉండే కార్, అందరూ ఎంతగానో ఎదురుచుస్తూస్తున్న మారుతి సుజుకి సరికొత్త ఆల్టోకార్ వచ్చేసింది. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ గురువారం తన ప్రముఖ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్టోలో నాల్గవ తరం మోడల్‌ Alto K10ను భారత మార్కెట్లో విడుదల చేసిందు. ఎక్స్-షోరూం వద్ద దీని బేసిక్ మోడల్ ధర రూ. 3,99,000 నుంచి ప్రారంభమవుతుంది.

సరికొత్త ఆల్టో K10 వేరియంట్లను పరిశీలిస్తే.. స్టాండర్డ్, LXi, LXi(O), VXi, VXi(O), VX+ , VXi+(O)తో అనే ఏడు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. అలాగే సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ , ఎర్త్ గోల్డ్‌ అనే ఆరు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది.

కొత్త మోడల్‌ ఆల్టో కె10 కారు, పాత దానికి చాలా భిన్నంగా ఉంది. ముందు భాగంలో కొత్త ఫ్రంట్ గ్రిల్‌ని ఇచ్చారు. అది దిగువకు అమర్చబడి ఆల్టో ముఖంలో చాలా పెద్ద భాగాన్ని కవర్ చేస్తుంది. హెడ్‌ల్యాంప్‌లు కూడా పెద్దవిగా సైడ్లను కవర్ చేసేలా ఉన్నాయి. ఓవల్-ఆకారపు హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. వెనుక భాగంలో కొత్త స్క్వారీష్ టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. టర్న్ ఇండికేటర్లు ఫెండర్‌లపై అమర్చారు, ORVMలో లేవు.

మారుతి సుజుకి ఆల్టో కె10 కారు దాని వేరియంట్ల వారీగా ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

స్టాండర్డ్ MT - రూ. 3,99,000

LXi MT - రూ. 4,82,000

VXi MT - రూ. 4,99,500

VXi AGS - రూ. 5,49,500

VXi+ MT - రూ. 5,33,500

టాప్-ఎండ్ మోడల్ VXi+ AGS - రూ. 5,83,500

ఫీచర్లు- స్పెక్స్

క్యాబిన్‌ భాగం ఆల్-బ్లాక్ థీమ్‌తో వచ్చింది డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంది. ఇది యాపిల్ కార్-ప్లే సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లకు సపోర్ట్ చేసే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెక్ సిస్టమ్ ఉంది.

భద్రతపరంగా, కొత్త హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) , వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.

ఇంజన్ కెపాసిటీ- మైలేజ్

సరికొత్త Maruti Suzuki Alto K10 కారులో 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా AMT యూనిట్‌తో అనుసంధానం చేసి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 66bhp శక్తిని, 89Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.

ఈ కారు లీటరుకు 24.9 కిమీ మైలేజీని అందించగలదని కంపెనీ పేర్కొంది. Alto K10 కేవలం పెట్రోల్ వెర్షన్లో మాత్రమే లభిస్తుంది.

కొత్త ఆల్టో K10 కారు భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ శాంత్రో వంటి కార్లతో పోటీపడుతుంది.