తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Renault Kwid 2022 మోడెల్ కారులో ఫీచర్లు ఏం మారాయి?

Renault Kwid 2022 మోడెల్ కారులో ఫీచర్లు ఏం మారాయి?

HT Telugu Desk HT Telugu

15 March 2022, 19:58 IST

    • 2022 Renault Kwid బేసిక్ వేరియంట్ కారు ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 4.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎంట్రీ-లెవల్ క్విడ్ RXE వేరియంట్ ఇప్పుడు రూ. 24,500 పెరిగింది.
Renault Kwid 2022
Renault Kwid 2022 (Renault Kwid India)

Renault Kwid 2022

ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనో (Renault) తమ బ్రాండ్ నుంచి ఇండియన్ మార్కెట్లో సూపర్ హిట్ అయిన హ్యాచ్‌బ్యాక్ కార్ మోడెల్ Kwidకు మరో కొత్త వెర్షన్ ను తాజాగా విడుదల చేసింది. 2022 Renault Kwid బేసిక్ వేరియంట్ కారు ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 4.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని అర్థం ఎంట్రీ-లెవల్ క్విడ్ RXE వేరియంట్ ఇప్పుడు రూ. 24,500 పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

రెనో క్విడ్ 2015లో తొలిసారిగా భారత మార్కెట్లోకి వచ్చింది. విడుదలయిన కొన్నేళ్లలోనే ఈ మోడెల్ 4 లక్షలకు పైగా విక్రయాలను సాధించింది. రెనో బ్రాండ్ నుంచి హ్యాచ్‌బ్యాక్ కార్లలో క్విడ్ కారుకు మంచి ప్రజాదరణ లభిస్తుండటంతో ఎప్పటికప్పుడు చిన్నచిన్న మార్పులు చేసుకుంటూ సరికొత్తగా విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే 2022 Renault Kwid కారును వివిధ వేరియంట్లలో కంపెనీ విడుదల చేసింది.

క్విడ్ కారు ఇప్పుడు తన కొత్త అవతార్‌లో డ్యూయల్-టోన్ ఫ్లెక్స్ వీల్స్ పొందింది. అంతేకాకుండా మరిన్ని కలర్ ఆప్షన్‌లలో ఈ కార్ లభ్యమవుతోంది. బ్లాక్ రూఫ్‌తో మెటల్ మస్టర్డ్, బ్లాక్ రూఫ్‌తో ఐస్ కూల్ వైట్, మూన్‌లైట్ సిల్వర్, జాన్స్‌కార్ బ్లూ కలర్ ఎంపికల్లో ఇప్పుడు ఈ కార్ అందుబాటులో ఉంది.

ఫీచర్లు

క్విడ్ RXL(O) వేరియంట్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఇందులోని ఫీచర్లలో భాగంగా పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఇచ్చారు. దీనికోసం ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ అమర్చారు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వాయిస్ రికగ్నిషన్, సిల్వర్-స్ట్రీక్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, రివర్సింగ్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రికల్‌ అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం-నాలుగు పవర్ విండోస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, AC, రివర్సింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ పైరోటెక్, లోడ్ లిమిటర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్‌ తదితర ఫీచర్లను ఈ కారు కలిగి ఉంది.

కెపాసిటీ

రెనో క్విడ్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఈ రెండు వేరియంట్లలో బేస్ మోడెల్ కారుకు అదే 0.8-లీటర్ (800 సిసి) ఇంజన్ ఇచ్చారు. ఇది 53 బిహెచ్‌పి వద్ద 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మరో వేరియంట్ RXL(O) లో 1.0-లీటర్ (1000 సిసి) ఇంజన్ ఉంటుంది. ఇది 67 bhp వద్ద 91 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కార్ వేరియంట్లలో 5 గేర్లు కలిగిన మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. కస్టమర్ కోరుకుంటే ఆటోమేటిక్ వెర్షన్ కూడా లభిస్తుంది.

తదుపరి వ్యాసం