తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu Shows: జీ తెలుగు ప్రేక్షకులకు ఈ సండే పండగే.. ఆ రెండు షోల స్పెషల్ ఎపిసోడ్స్

Zee Telugu Shows: జీ తెలుగు ప్రేక్షకులకు ఈ సండే పండగే.. ఆ రెండు షోల స్పెషల్ ఎపిసోడ్స్

Hari Prasad S HT Telugu

04 May 2023, 22:22 IST

    • Zee Telugu Shows: జీ తెలుగు ప్రేక్షకులకు ఈ సండే పండగే.. ఆ రెండు షోలు స్పెషల్ ఎపిసోడ్స్ తో సందడి చేయనున్నాయి. సూపర్ క్వీన్ 2తోపాటు సరిగమప ఛాంపియన్‌షిప్ ఎపిసోడ్స్ సరదాగా సాగనున్నాయి.
జీ తెలుగులో సూపర్ క్వీన్ 2 దోస్తీ స్పెషల్ ఎపిసోడ్
జీ తెలుగులో సూపర్ క్వీన్ 2 దోస్తీ స్పెషల్ ఎపిసోడ్

జీ తెలుగులో సూపర్ క్వీన్ 2 దోస్తీ స్పెషల్ ఎపిసోడ్

Zee Telugu Shows: జీ తెలుగు ఛానెల్ తమ ప్రేక్షకులకు ఈ సండే (మే 7)ను మరింత ఫన్‌డేగా మార్చడానికి సిద్ధమవుతోంది. వచ్చే ఆదివారం సూపర్ క్వీన్ 2తోపాటు సరిగమప ఛాంపియన్‌షిప్ స్పెషల్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయనుంది. సూపర్ క్వీన్ షో దోస్తీ స్పెషల్ ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షో ఆదివారం ఉదయం 11 గంటలకు టెలికాస్ట్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu May 6th Episode: గుప్పెడంత మనసు- ఫిటింగ్ పెట్టిన వసుధార- శైలేంద్ర బిగ్ ట్విస్ట్- దొరికిపోయిన మహేంద్ర

Krishna mukunda murari serial: మీరా డబుల్ గేమ్ ఆడుతుందని తెలుసుకున్న కృష్ణ.. పట్టరాని సంతోషంలో ముకుంద, మురారి

Brahmamudi May 6th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ కాదని తేల్చేసిన కావ్య- సీసీ కెమెరాతో బయటపడిన నిజం- కోటితో స్వప్న కారు

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్ ..శోభ తప్పు లేదు నువ్వే దరిద్రమన్న అనసూయ.. గుండెలు పగిలేలా ఏడ్చిన దీప

ఇక సరిగమప సూపర్ స్టార్స్ తో స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. సూపర్ క్వీన్ 2 షోలో ఈసారి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ పార్టిసిపేట్ చేయనున్నారు. వాళ్లు సూపర్ క్వీన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పనున్నారు. అంతేకాదు కంటెస్టెంట్ల గురించి కొన్ని సీక్రెట్లను కూడా వీళ్లు ప్రేక్షకుల ముందు పెట్టనున్నారు. వీటితోపాటు కంటెస్టెంట్ల పర్ఫార్మెన్సెస్, సరదాగా సాగిపోయే గేమ్స్ కూడా ఉంటాయి.

ఇక సరిగమప ఛాంపియన్‌షిప్ కూడా ఓ స్పెషల్ ఎపిసోడ్ తో వస్తోంది. సెలబ్రేషన్స్ విత్ సూపర్ స్టార్స్ పేరుతో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ఈ షో పార్టిసిపెంట్ల అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఈ సండే ఈ షో మరింత ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.

సెలబ్రేషన్స్ విత్ సూపర్ స్టార్స్ లో భాగంగా ఈ షోలోని పార్టిసిపెంట్లు.. పాపులర్ సింగర్స్ తో కలిసి పాడనున్నారు. ఎస్పీ చరణ్, కల్పన, సుమంగళి, రాహుల్ నంబియార్ లాంటి సింగర్స్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. వాళ్లతో కలిసి పార్టిసిపెంట్లు పాటలు పాడనున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.