Kajal in Zee Telugu: జీ తెలుగులో సూపర్ క్వీన్‌ సీజన్ 2.. చందమామ వచ్చేస్తోంది-kajal in zee telugu super queen season 2 launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal In Zee Telugu: జీ తెలుగులో సూపర్ క్వీన్‌ సీజన్ 2.. చందమామ వచ్చేస్తోంది

Kajal in Zee Telugu: జీ తెలుగులో సూపర్ క్వీన్‌ సీజన్ 2.. చందమామ వచ్చేస్తోంది

Hari Prasad S HT Telugu
Apr 04, 2023 03:53 PM IST

Kajal in Zee Telugu: జీ తెలుగులో సూపర్ క్వీన్‌ సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. చందమామ కాజల్ ఈ షోకు స్పెషల్ గెస్ట్ గా రానుంది. దీనికి సంబంధించి ప్రోమోను జీ తెలుగు రిలీజ్ చేసింది.

జీ తెలుగులో వస్తున్న సూపర్ క్వీన్ సీజన్ 2 లాంచ్ లో మెరిసిన కాజల్
జీ తెలుగులో వస్తున్న సూపర్ క్వీన్ సీజన్ 2 లాంచ్ లో మెరిసిన కాజల్

Kajal in Zee Telugu: తెలుగులోని టాప్ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటి జీ తెలుగు. ఎప్పుడూ ఓ వినోదాత్మక ప్రోగ్రామ్ తో ప్రేక్షకులను అలరించే ఈ ఛానెల్.. ఇప్పుడు మరో షోతో రాబోతోంది. ఈ షో పేరు సూపర్ క్వీన్. ఇప్పటికే తొలి సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు రెండో సీజన్ కు సిద్ధమవుతోంది. ఈ షో ఏప్రిల్ 9న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది.

ఆ తర్వాత రెగ్యులర్ ఎపిసోడ్స్ ఏప్రిల్ 16 నుంచి ఉదయం 11 గంటలకు టెలికాస్ట్ అవుతాయి. మహిళల విజయాలను సెలబ్రేట్ చేసుకునే ఈ షో సీజన్ 2 తొలి ఎపిసోడ్ లో మరో సూపర్ క్వీన్ అయిన కాజల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. కాజల్ పార్టిసిపేట్ చేసిన ఈ షోకు సంబంధించిన ప్రోమోను జీ తెలుగు రిలీజ్ చేసింది. ఈ ప్రోమోను తమ అధికారిక ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఈ షోను ప్రముఖ యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్నాడు. సూపర్ క్వీన్ కు సూపర్ క్వీన్ ప్రోగ్రామ్ లోకి స్వాగతం అంటూ కాజల్ కు వెల్‌కమ చెప్పాడు ప్రదీప్. ఈ షోలో మహిళలతో కలిసి కాజల్ ఆడిపాడింది. తెలుగులోని పాపులర్ రియాల్టీ షోలలో ఈ సూపర్ క్వీన్ కూడా ఒకటి. తమ జీవితాల్లో వచ్చిన అడ్డంకులను ఎదుర్కొని శక్తివంతమైన మహిళలుగా ఎదిగిన వారిని ఈ షోకు ఎంపిక చేస్తారు.

ఈ సూపర్ క్వీన్ వినోదాన్ని పంచడంతో పాటు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా కూడా నిలుస్తోంది. ఈసారి పది మంది టాలెంటెడ్ క్వీన్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వాళ్లలో విజేతను ఎంపిక చేసే క్రమంలో ఒక్కో ఎపిసోడ్ లో వాళ్లకు ఒక్కో సవాలు ఇస్తూ దానిని వాళ్లు ఎలా అధిగమిస్తారో చూస్తారు. ఇవి ప్రేక్షకులకు కూడా ఆసక్తి క్రియేట్ చేసేలా చేస్తాయి.

ఈ రెండో సీజన్ లో విదుల్లేఖ రామన్, లిఖితా మూర్తి, మౌనిక యాదవ్, ఎస్తర్, ప్రియాంకా, పవిత్ర, సుశ్మిత, సుహాసిని, ఝాన్సీ, ప్రశాంతిలాంటి వాళ్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ షోలో పాల్గొనడంపై అటు కాజల్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. మహిళలు తమ నైపుణ్యాలను ప్రపంచానికి చూపించేందుకు సూపర్ క్వీన్ మంచి వేదిక అని కాజల్ చెప్పింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం