Anchor Pradeep Marriage: ఫ్యాషన్ డిజైనర్‌తో యాంకర్ ప్రదీప్ పెళ్లి.. ఆమె ఎవరంటే?
Anchor Pradeep Marriage: యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చేసుకోబుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌తో డేటింగ్‌లో ఉన్న అతడు త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబుతున్నాడని సమాచారం.
Anchor Pradeep Marriage: బుల్లితెర ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలియని తెలుగు కుటుంబాలు ఉండవంటే అతిశయోక్తి కాదేమో. ప్రదీప్ బుల్లితెరపై అనేక షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇదే సమయంలో అడపా దడపా సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తున్నాడు. అయితే ఈ స్టైలిష్ యాంకర్ పెళ్లి గురించి చాలా రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా ప్రదీప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ప్రదీప్-నవ్య చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు వీరి బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని భావించారట. ఇందుకోసం ఇరువురు తమ కుటుంబాలతో చర్చించి పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇరువురి మతాలు వేరైనప్పటికీ పెద్దలు వీరి పెళ్లికి పెద్ద మనస్సుతో ఒప్పుకున్నారట. అంతేకాకుండా ఇరువురి కుటుంబాలు కూడా ఎప్పటి నుంచో స్నేహితులు కావడం వల్ల వీరి పని సులభమైందని సమాచారం.
నవ్య.. ప్రదీప్‌తో పాటు చాలా మంది సెలబ్రెటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆమె కాస్ట్యూమ్‌లను డిజైన్ చేస్తున్నారు. ప్రదీప్ వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్ అయిన ఈమె.. ఆ చొరవను అతడితో స్నేహంగా, ప్రేమగా మార్చుకుని తాజాగా పెళ్లి పీటల వరకు వెళ్లిందని సమాచారం.
గతంలోనూ ఓ సారి అతడి పెళ్లి విషయం మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రదీప్ వివాహం కోసం స్వయంవరం నిర్వహించారు. ఆ షోలో విజేతగా నిలిచిన మహిళను వివాహం చేసుకుంటాడని నివేదించడమైంది. అయితే ఆ విధంగా జరగలేదు. షోలో పాల్గొన్న ఒకరు అతడిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆర్జేగా తన కెరీర్‌ను ప్రారంభించిన ప్రదీప్.. తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. మరోపక్క యాంకర్‌గా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. టాలీవుడ్‌లో టాప్ మేల్ యాంకర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా చేశారు. అంతకుముందు భం బోళేనాథ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, జులాయి, 100% లవ్, వరుడు లాంటి సినిమాల్లో ప్రదీప్ కనిపించాడు.