Kajal Aggarwal on Bollywood: బాలీవుడ్ విలువ‌లు లేని ఇండ‌స్ట్రీ - కాజ‌ల్ అగ‌ర్వాల్ షాకింగ్ కామెంట్స్ వైర‌ల్‌-kajal aggarwal shocking comments bollywood she says lack of values and ethics in hindi industry
Telugu News  /  Entertainment  /  Kajal Aggarwal Shocking Comments Bollywood She Says Lack Of Values And Ethics In Hindi Industry
 కాజ‌ల్ అగ‌ర్వాల్
కాజ‌ల్ అగ‌ర్వాల్

Kajal Aggarwal on Bollywood: బాలీవుడ్ విలువ‌లు లేని ఇండ‌స్ట్రీ - కాజ‌ల్ అగ‌ర్వాల్ షాకింగ్ కామెంట్స్ వైర‌ల్‌

31 March 2023, 11:22 ISTNelki Naresh Kumar
31 March 2023, 11:22 IST

Kajal Aggarwal on Bollywood: ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకునే ధోర‌ణి బాలీవుడ్‌లో అస‌లు క‌నిపించ‌ద‌ని అన్న‌ది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. రైజింగ్ ఇండియా స‌మ్మిట్‌లో బాలీవుడ్‌పై కాజ‌ల్ అగ‌ర్వాల్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

Kajal Aggarwal on Bollywood: బాలీవుడ్ పై హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. హిందీ చిత్ర‌సీమ‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌, నైతిక విలువ‌లు క‌నిపించ‌వంటూ కామెంట్ చేసింది. రైజింగ్ ఇండియా స‌మ్మిట్ 2023 అనే కార్య‌క్ర‌మంలో బాలీవుడ్‌పై కాజ‌ల్ చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.

ఈ వేడుక‌లో సౌత్ ఇండ‌స్ట్రీ వ‌ర్సెస్ బాలీవుడ్ అనే డిబేట్‌పై కాజ‌ల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ సౌత్ ఇండ‌స్ట్రీలో ఫ్రెండ్లీ నేచ‌ర్ క‌నిపిస్తుంద‌ని, భాషాభేదాల‌తో ప‌ట్టింపు లేకుండా ప్ర‌తిభ ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని ద‌క్షిణాది చిత్ర‌సీమ ఆద‌రిస్తుంటుంద‌ని పేర్కొన్న‌ది. ఆ స్నేహ‌త‌త్వం బాలీవుడ్‌లో ఉండ‌ద‌ని పేర్కొన్న‌ది.

పోటీత‌త్వం త‌ప్పితే...

ప‌ర‌స్ప‌రం ఒక‌రికొక‌రు స‌హ‌రించుకుంటూ స‌మిష్టిగా ఎదిగే ధోర‌ణి బాలీవుడ్‌లో అస‌లు క‌నిపించ‌ద‌ని కాజ‌ల్ తెలిపింది. ఫ్రొఫెష‌న‌లిజం, పోటీత‌త్వం త‌ప్పితే క్ర‌మ‌శిక్ష‌ణ‌, నైతిక విలువ‌లు పూర్తిగా బాలీవుడ్‌లో లోపించాయ‌ని చెప్పింది. అందువ‌ల్లే బాలీవుడ్ కంటే ద‌క్షిణాదిలోనే తాను సినిమాలు చేయ‌డానికి ఎక్కువ‌గా ఇంపార్టెన్స్‌ ఇస్తాన‌ని పేర్కొన్న‌ది.

"నేను ముంబైలోనే పుట్టిపెరిగాను. కానీ ద‌క్షిణాది సినిమాల‌తో నా కెరీర్ ప్రారంభ‌మైంది. సౌత్ ఇండ‌స్ట్రీనే నాకు పుట్టిల్లుగా మారిపోయింది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినా ప‌రాయి ఇండ‌స్ట్రీ అనే ఫీలింగ్ క‌లుగుతుంది.

బాలీవుడ్‌లో సినిమా చేస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌స్తుంద‌నే భావ‌న చాలా మందిలో ఉండేది. అందుకే హిందీలో సినిమా చేయాల‌ని త‌పిస్తుంటారు. కానీ ఇప్పుడా హ‌ద్దులు తొల‌గిపోయాయి. ద‌క్షిణాదిలో అద్భుత‌మైన కంటెంట్‌తో రూపొందిన సినిమాలు జాతీయ స్థాయిలో గొప్ప విజ‌యాల్ని సాధిస్తున్నాయ‌ని కాజ‌ల్ చెప్పింది.

షార్ట్ క‌ట్‌లు ఉండ‌వు...

బాలీవుడ్‌, సౌత్ ఇండ‌స్ట్రీ ఎక్క‌డైనా హార్డ్ వ‌ర్క్ మాత్ర‌మే విజ‌యాల్ని తెచ్చిపెడుతుంద‌ని న‌మ్ముతుంటాన‌ని అన్న‌ది. స‌క్సెస్ కు షార్ట్‌క‌ట్‌లు ఉండ‌వ‌ని పేర్కొన్న‌ది. బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌పై కాజ‌ల్ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. హిందీ సినిమా క్యా హో గ‌యాతోనే కాజ‌ల్ సినీ కెరీర్ ఆరంభ‌మైంది. ఆ త‌ర్వాత సింగం, స్పెష‌ల్ చ‌బ్బీస్‌తో పాటు బాలీవుడ్‌లో మ‌రికొన్ని సినిమాలు చేసింది.

ఈ సినిమాలు విజ‌యాల్ని సాధించినా కాజ‌ల్‌కు మాత్రం హిందీలో అవ‌కాశాలు రాలేదు. ఆ అసూయ‌తోనే కాజ‌ల్ బాలీవుడ్‌పై నెగెటివ్‌ కామెంట్స్ చేసిన‌ట్లుగా కొంద‌రు చెబుతున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ సినిమాతో పాటు క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న ఇండియ‌న్ 2లో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.