తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu May 6th Episode: గుప్పెడంత మనసు- ఫిటింగ్ పెట్టిన వసుధార- శైలేంద్ర బిగ్ ట్విస్ట్- దొరికిపోయిన మహేంద్ర

Guppedantha Manasu May 6th Episode: గుప్పెడంత మనసు- ఫిటింగ్ పెట్టిన వసుధార- శైలేంద్ర బిగ్ ట్విస్ట్- దొరికిపోయిన మహేంద్ర

Sanjiv Kumar HT Telugu

06 May 2024, 8:45 IST

google News
  • Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 6వ తేది ఎపిసోడ్‌లో మను ఒప్పుకుంటేనే ఎండీ బాధ్యతలు ఇవ్వాల్సి వస్తుందని వసుధార అంటుంది. దాంతో ఏం చేయాలని ఆలోచించినా శైలేంద్ర ట్విస్ట్ ఇస్తాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 6వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 6వ తేది ఎపిసోడ్‌

గుప్పెడంత మనసు సీరియల్‌‌ మే 6వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 1067: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో డీబీఎస్‌టీ కాలేజ్ బోర్డ్ మీటింగ్‌లో శైలేంద్ర సార్‌కు ఎండీ బాధ్యతలు అప్పజెబుదామా అని మేనేజ్‌మెంట్ అంటుంది. ఇక చేసేదేముందు అని ఫణీంద్ర అని ఒప్పుకుంటాడు. దాంతో శైలేంద్ర మనసులోనే తెగ సంబరపడిపోతుంటాడు. ఏంటీ నేను ఎండీ కాబోతున్నానా. ఇది కల నిజమా. ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తే రాని పదవి ఇంత ఈజీగా వచ్చేస్తుందేంటీ అని ఆనందపడిపోతాడు శైలేంద్ర.

తను ఒప్పుకుంటేనే జరుగుతుంది

నేను ఎండీ బాధ్యతల నుంచి తప్పుకుని శైలేంద్రకు అప్పజెప్పాలంటే ఒకతను ఉండాలి. అతని సమక్షంలోనే ఇది జరగాలి అని వసుధార అంటుంది. ఆ ఎవరతను అని శైలేంద్ర అడుగుతాడు. మను గారు. మను గారికి కాలేజ్ 50 కోట్ల అప్పు ఉంది. అది నేను ఎండీగా ఉన్నప్పుడు జరిగింది. అంతేకాకుండా ఆయన ఇప్పుడు బోర్డ్ మెంబర్ కూడా. కాబట్టి తను ఒప్పుకుంటేనే ఇది జరుగుతుంది అని వసుధార పెద్ద ఫిటింగ్ పెడుతుంది.

కానీ, ఆయన పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు కదా. తనెలా వస్తాడు అని శైలేంద్ర అంటాడు. రావాలి. వచ్చిన తర్వాతే ఏదైనా జరుగుతుందని వసుధార అంటుంది. అవును, తను చెప్పిందే కరెక్ట్. ముందు మను రావాలి. మను ఒప్పుకుంటే ఎండీ బాధ్యతలు శైలేంద్రకు ఇద్దాం.. ఏమంటావ్ శైలేంద్ర అని ఫణీంద్ర అంటాడు. అవును డాడీ.. కానీ, మను నేరం చేశాడని పక్కా ఆధారాలతో పట్టుబడిపోయాడు. అతనెలా బయటకు వస్తాడు అని శైలేంద్ర అంటాడు.

వసుధార ప్లాన్ ఏంటీ

వసుధార మేడమ్ గారు ఉన్నారు కదా సార్. ఎలాగైన మను గారిని బయటకు తీసుకొస్తారు అని ఒక మెంబర్ అంటాడు. దాంతో మీటింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పి వసుధార వెళ్లిపోతుంది. కంగ్రాచ్యులేషన్స్ సార్ కాబోయే ఎండీ గారు అని అంతా శైలేంద్రకు విష్ చేసి వెళ్లిపోతారు. కచ్చితంగా ఏదో ఉంది. అందుకే మను గాడు బయటకు రావాలంటుంది. అసలు వసుధార ప్లాన్ ఏంటీ అని శైలేంద్ర అనుమానిస్తాడు. మరోవైపు ఏంజెల్ కాల్ చేసి మిమ్మల్ని రమ్మంటున్నారని అనుపకు చెబుతుంది వసుధార.

విశ్వనాథం గారు చాలా అడుగుతున్నారట అని వసు అంటుంది. ఇందులో నేను ఏం చెప్పను. తన నిర్ణయం తన ఇష్టం. కానీ, ఇక్కడ నేను, వసుధార ఉంటాం. సేఫ్‌గా ఉంటావ్ అని మహేంద్ర అంటాడు. ఒక్కసారి ఆలోచించండి మేడమ్. మను గారు జైల్లో ఉన్నారు. ఒంటరిగా అనిపిస్తుంది అని వసుధార అంటుంది. ఒంటరితనం నాకు ఎప్పుడూ ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మను బయటకు వచ్చాకా చూస్తాను అని అనుపమ అంటుంది.

దత్తత దాదాపుగా జరిగింది

ఇప్పుడైనా మనకు బదులు కొడుకు అనొచ్చు కదా. కానీ, మీ ప్రేమ తెలుస్తుంది. మేడమ్ నిర్ణయమే కరెక్ట్ మావయ్య. మీ కొడుకు బయటకు వచ్చేంత వరకు తను ఎక్కడికీ వెళ్లకపోవడమే మంచిది అని వసుధార అంటే.. అనుపమ షాక్ అయి చూస్తుంది. ఏంటీ మావయ్య నేనేమైన తప్పుగా అన్నానా. మీరే కొడుకుగా భావించారు కదా. దత్తత కూడా దాదాపుగా జరిగిపోయింది అని వసుధార అంటుంది. తప్పేం కాదు. ఎన్నిసార్లైనా మాట్లాడొచ్చు అని మహేంద్ర అంటాడు.

తను బయటకు రావడానికి ఎలాంటి దారులు ఉన్నాయో ఆలోచించాలి. ఇప్పుడిప్పుడే అన్ని దారులు తెరుచుకుంటాయి అని అనుపకు వసుధార ధైర్యం చెబుతుంది. కట్ చేస్తే మనకు ఇదే మంచి అవకాశం ఆ ఎండీ సీటు దక్కించుకోడానికి. వాళ్లే మనకు దారి చూపించారు. దీన్ని మనం వదులుకోకూడదు అని శైలేంద్రతో దేవయాని అంటుంది. కాలేజీ అంటే ప్రాణాలు ఇచ్చే వసు, మహేంద్ర బాబాయ్ ఆ మను గాడి కోసం వదులుకోవడం ఏంటని అనుమానిస్తాడు శైలేంద్ర.

రాజీవ్ గాడు బతికే ఉన్నాడా

మీటింగ్ పెట్టి చెప్పారంటే నిజమే అయింటుంది. వాళ్లు మనలాగా మోసం చేయరు. కానీ, నాకు ఒకటి అర్థం కావడం లేదు. మను బయటకు రాలేడు కదా. రాజీవ్ చనిపోయాడు కదా. మను చంపినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి కదా. ఎలా బయటకు వస్తాడు అని దేవయాని అంటుంది. ఎందుకు రాలేడు మామ్. నేను చూసుకుంటాను కదా అని శైలేంద్ర అంటాడు. ఎలా చూసుకుంటావ్. ఆ రాజీవ్ గాడు బతికే ఉన్నాడా. వాడు బతికి ఉంటేనే కదా మను గాడు బయటకు వచ్చేది అని దేవయాని అంటుంది.

అవును మామ్ నిజమే. శైలేంద్ర అంటాడు. నేను అడిగేది వాడు బతికే ఉన్నాడా లేడా అని దేవయాని అంటుంది. పోలీసులు చెప్పారు కదా మామ్ అని శైలేంద్ర అంటాడు. లేదురా. నేను నీ తల్లిని నా దగ్గర ఏదో దాస్తున్నావ్ అని దేవయాని అంటుంది. నన్నే అనుమానిస్తున్నావా. లేదు మామ్. ఏదోలా చేసి వాడిని బయటకు తీసుకురావాలి. ఏదైనా మంచి ప్లాన్ వస్తే నాకు చెప్పు అని ఇద్దరూ వెళ్లిపోతారు. అక్కడ పక్కనే ఫోన్‌లో వాళ్లు మాట్లాడుకున్నది రికార్డ్ అవుతుంది.

ఇలా ప్లాన్ వేశాం

అక్కడ ఆ ఫోన్ ధరణి పెడుతుంది. అది తీసుకుని వెళ్లిపోతుంది. ఇంతలో వసుధార కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన ధరణి ఆయన మాటలు విన్నావు కదా. ఎక్కడ కూడా రాజీవ్ బతికి ఉన్నట్లు బయటపడలేదు. కానీ ఆయన వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది అని ధరణి అంటుంది. అందుకే మీ ఆయన మీద కన్నేసి ఉంచు. మోసాన్ని మోసంతోనే జయించాలి. అందుకే ఇలా ప్లాన్ వేశాను. ఇన్నాళ్లు ఆశ పడిన ఎండీ పదవి కోసం ఏమైనా చేస్తారు అని వసుధార అంటుంది.

ఇంతలో మెట్లు దిగుతూ శైలేంద్ర వస్తుంటాడు. రాజీవ్ బతికి ఉన్నట్లు కచ్చితంగా శైలేంద్రకు తెలిసినట్లు అనిపిస్తుంది అని వసుధార అంటుండగా.. ధరణి ఫోన్ మాట్లాడటం శైలేంద్ర చూస్తాడు. చూసి ధరణి అని పిలుస్తాడు. ఏం చేస్తున్నావ్ అని శైలేంద్ర అంటాడు. కాఫీ పెడుదామని ధరణి అంటే.. లేదు నువ్ ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్లు అనిపించిందని శైలేంద్ర అంటాడు. లేదండి. మీకు అలా ఎందుకు అనిపించిందో మీకే తెలియాలి అని ధరణి అంటుంది.

ఇలా దొరికిపోయానేంటీ

దాంతో శైలేంద్ర వెళ్లిపోతాడు. ఆయన వెళ్లిపోతున్నారని ధరణి చెబితే.. శైలేంద్రను ఫాలో అవ్వడానికి ఒకరిని పెట్టాను అని వసుధార అంటుంది. శైలేంద్రను మహేంద్ర ఫాలో అవుతాడు. కానీ, మిస్ అవుతాడు. ఓ చోట ఆపి ఈ కాలాంతకుడు మిస్ అయ్యాడే అని మహేంద్ర అనుకుంటే భుజంపై చేయి వేసి బాబాయ్ నువ్వా అని పెద్ద ట్విస్ట్ ఇస్తాడు శైలేంద్ర. వీడికి ఇలా దొరికిపోయానేంటీ. ఏదో ఒకటి చెప్పి అనుమానం రాకుండా చేయాలని మహేంద్ర అనుకుంటాడు.

ఏంటీ బాబాయ్ నన్ను ఫాలో అవుతున్నారా అని శైలేంద్ర అడిగితే.. నేను వెళ్లే దారిలో నువ్ వెళ్తున్నావ్ అని మహేంద్ర అంటాడు. ఈ గెటప్, బైక్ ఏంటని శైలేంద్ర అడిగితే.. ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. ఇప్పుడు నిజం చెప్పమని శైలేంద్ర అంటాడు. నువ్ చెప్పింది కరెక్టే. నీకు కూడా అప్పుడప్పుడు బుర్ర బాగా పని చేస్తుంది. ఆ రాజీవ్‌గాడు బతికే ఉన్నాడు. మనుకు కనిపించాడట. వాడు బతికి ఉన్నట్లు నీకు కూడా తెలుసని నాకు తెలుసు. వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడని మహేంద్ర అంటాడు.

ఎవరో ఉన్నారు

రాజీవ్ ఇక్కడ ఉండటం ఏంటని శైలేంద్ర అంటుండగా.. పక్కన చెట్టు చాటు నుంచి రాజీవ్ చూడటం శైలేంద్ర చూస్తాడు. చూసి షాక్ అవుతాడు. ఏంటీ షాక్ అయ్యావ్. రాజీవ్ కనిపించాడా అని వెనక్కి చూస్తాడు మహేంద్ర. కానీ, ఎవరు కనిపించరు. అక్కడ ఎవరు లేరని శైలేంద్ర కంగారుపడితే.. నువ్ కంగారుపడుతున్నావంటే ఎవరో ఉన్నారని చెట్టు దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు మహేంద్ర. కానీ, శైలేంద్ర అడ్డుకుంటాడు. నువ్ ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు.

నేను కూడా రాజీవ్ కోసం వెతుకుతున్నాను. మనును ఎలాగైన బయటకు తీసుకురావాలని నా వంతు సాయం చేస్తున్నాను అని శైలేంద్ర అంటాడు. నీకు రాజీవ్ బతికి ఉన్నట్లు తెలియదు కదా. అయినా నీ ఎలాంటి సాయం చేయాల్సిన అవసరం లేదని వెళ్లిపోతాడు మహేంద్ర. తర్వాత రాజీవ్ కోసం శైలేంద్ర వెతుకుతుంటే బ్రదర్ అని భుజంపై చేయి వేస్తాడు రాజీవ్. నిన్ను బయటకు రావొద్దని చెప్పాను కదా. బాబాయ్ చూస్తే ఎలా ఉండేది పరిస్థితి అని శైలేంద్ర అరుస్తాడు.

పకడ్బందీగా ప్లాన్ వేశారు

నువ్ చేసే పనులకు నిన్ను నిజంగానే చంపేయాలని ఉంది. ఇప్పటికే ఆ మనుగాడికి కనిపించి పెద్ద తప్పు చేశావ్. అందుకే మా బాబాయ్ నిన్ను వెతుకుతున్నాడు అని శైలేంద్ర అంటాడు. మీ బాబాయ్ నిన్ను ఫాలో అవుకుంటూ వచ్చాడు. అంటే నేను బతికి ఉన్నట్లు నీకు తెలుసని అనుమానం వచ్చినట్లు ఉంది. అందుకే ఫాలో అయ్యాడు. వాళ్లు పకడ్బందీగా నీ మీద ప్లాన్ చేశారేమో. ఒకవేళ నేను దొరికితే నీవల్లే భయ్యా. నన్ను కనిపెట్టడం ఎవరి వల్ల కాదు భయ్యా అని రాజీవ్ అంటాడు.

నీది ఓవరాక్షన్. ముందు నీ పిచ్చి తగ్గించుకో. అదే వసుధార మీదున్న పిచ్చి. అది తగ్గితే తనే నీ సొంతం అవుతుంది. అసలు ఇలా ఎందుకు చేశావ్ అని శైలేంద్ర అంటాడు. తనను చూడకుండా నేను ఉండలేను అని రాజీవ్ అంటాడు. అలా అయితే నీ వసుధార నీకు దక్కదు. చీటిమాటికి బయట తిరిగితే మనల్ని పట్టుకుని మను గాడిని బయటకు తీసుకొస్తాడు. ఆ వసుధార రిషి గాడిని బయటకు తీసుకొస్తుంది. అప్పుడు నువ్ జైల్లో చిప్ప కూడు తినాలి అని శైలేంద్ర ఆవేశంగా అంటాడు.

ఇప్పటికైనా నేను చెప్పింది విను. బయటకు రాకు అని శైలేంద్ర అంటాడు. సరే భయ్యా వింటాను అని రాజీవ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం