Guppedantha Manasu Today Episode: మనుకు వసు సపోర్ట్ - హంతకుడిగా రిషి తమ్ముడిపై నింద - పార్టీ మార్చిన శైలేంద్ర
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో రాజీవ్‌ను తాను హత్య చేయలేదని పోలీసులతో అంటాడు మను. కానీ మనునే ఈ హత్య చేశాడు అనడానికి తమ వద్ద ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు అంటారు. వాటిని చూపిస్తారు.
Guppedantha Manasu Today Episode: మనును దత్తత తీసుకునేందుకు మహేంద్ర అన్ని ఏర్పాట్లు చేస్తాడు. దత్తత కార్యక్రమం ముగుస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకుంటారు. రాజీవ్‌ను హత్య చేసిన కేసులో మనును అరెస్ట్ చేస్తారు. మనును పోలీసులు అరెస్ట్ చేయడంతో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజీవ్‌ను మనునే హత్య చేసి కేసును తప్పుదోవ పట్టించడానికే దత్తత కార్యక్రమానికి వచ్చాడని దేవయాని నిందలు వేస్తుంది. ఆమె మాటలతో మహేంద్ర ఫైర్ అవుతాడు. నిజానిజాలు తెలియకుండా నిందలు వేయద్దని అంటాడు.
దేవయాని అబద్ధాలు...
మను మర్డర్ చేశాడు అంటే ఫణీంద్ర నమ్మడు. శైలేంద్ర కూడా మనుపై సానుభూతి చూపిస్తాడు. మనుది మర్డర్ చేసే క్యారెక్టర్ కాదని అంటాడు. మను హంతకుడు కాదని, ఇది అతడిపై పడిన నింద మాత్రమేనని ఫణీంద్ర అంటాడు. కానీ భర్త, కొడుకు మాటలను కొట్టిపడేస్తుంది దేవయాని. మను ఈ హత్య చేశాడు అనడానికి అన్ని ఆధారాలు పక్కగా పోలీసలు దగ్గర ఉన్నాయని దేవయాని అంటుంది. మనును నమ్మి మీరు, మహేంద్ర తప్పు చేశారని దేవయాని ఫైర్ అవుతుంది.
మను డ్రామా...
దత్తత కార్యక్రమం చేయద్దని నేను ఎంత చెప్పిన ఎవరూ వినలేదని, దత్తత పూర్తయితే తమ కుటుంబం పరువు గంగలో కలిసిపోయేది అంటూ భర్తతో అంటుంది దేవయాని. మను ఎంత కేడీగాడో అర్థమైంది. మహేంద్రను బుట్టలో వేసుకొని అతడు ఆడిన డ్రామా మొత్తం బయటపడిందంటూ మనుపై తన మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపడుతుంది.
ఫణీంద్ర ఫైర్...
దేవయాని మాటలను అప్పటివరకు ఓపిగ్గా భరించిన ఫణీంద్ర ఒక్కసారిగా ఫైర్ అవుతాడు. ఎంత చెప్పిన నీకు బుద్దిరాదు. ఎదుటివాళ్లకు ఎప్పుడు ప్రశాంతత లేకుండా చేస్తావని దేవయానిని కోపగించుకుంటాడు. రాజీవ్‌ను మను హత్య చేయలేదని తాను నమ్ముతున్నట్లు దేవయానితో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మను కోసం మహేంద్ర, వసుధార, అనుపమ కలిసి పోలీస్ స్టేషన్‌కు వస్తారు. కానీ పోలీస్ స్టేషన్‌లో మనును నేరస్తుడిగా చూడటం అనుపమ తట్టుకోలేకపోతుంది. అందరి ముందు మను తలదించుకోవడం తాను చూడలేనని పోలీస్ స్టేషన్ ముందే ఆగిపోతుంది.
రాజీవ్ గొడవ...
మను కలిసిన మహేంద్ర...రాజీవ్‌తో జరిగిన గొడవ గురించి అడుగుతాడు. రాజీవ్‌ను తాను చంపలేదని, అసలు రాజీవ్ చనిపోయాడని దత్తత కార్యక్రమం వద్దకు పోలీసులు వచ్చే వరకు తనకు తెలియదని మను అంటాడు. ఎస్ఐ మాత్రం మను మాటలను నమ్మడు. మనుది నాటకం అంటూ కొట్టిపడేస్తాడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి మాటలే మాట్లాడుతారంటూ రాజీవ్‌ను అవమానిస్తాడు. రాజీవ్‌ను దారుణంగా హత్య చేసి దత్తత కార్యక్రమం వెళ్లావని, మీ లాంటివాళ్ల వల్లే సిటీలో క్రైమ్ రేట్ పెరుగుతుందని మనును ఆరోపణలు చేస్తాడు.
వసుధార ప్రశ్నలు...
నేరం రుజువు కాకుండా మనును నేరస్తుడు అని పోలీస్ ఆఫీసర్ అనడం వసుధార సహించలేకపోతుంది. మనునే హంతకుడు అనడానికి ఆధారాలు ఏవని పోలీస్ ఆఫీసర్‌ను అడుగుతుంది. మను గన్‌లోని రెండు బుల్లెట్స్ మిస్సయినంత మాత్రన అతడిని హంతకుడు అని ఎలా అంటారని పోలీస్ ఆఫీసర్‌ను ప్రశ్నిస్తుంది.
వీడియో సాక్ష్యం...
రాజీవ్‌ను మను షూట్ చేసిన వీడియోను వసుధారకు చూపిస్తాడు పోలీస్ ఆఫీసర్. ఆవీడియో చూసి మనుతో పాటు వసుధార షాకవుతుంది. తాను షూట్ చేసింది నిజమే...కానీ రాజీవ్‌ను షూట్ చేయలేదని, గాల్లోకి కాల్చానని మను చెబుతాడు. అయినా కూడా రాజీవ్‌ను మను హత్య చేశాడంటే మహేంద్ర, వసుధార నమ్మరు. రాజీవ్‌ను మను హత్య చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారని పోలీస్ ఆఫీసర్ అంటారు. ఆ సాక్షిని చూసి మను, వసుధార డబుల్ షాక్ అవుతారు. మను పీఏ అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. రాజీవ్‌ను మను హత్య చేస్తుండగా చూసింది ఇతనేనని పోలీస్ ఆఫీసర్ అంటాడు.
మను షూట్ చేయడం తాను చూశానని చెబుతాడు. అయితే రాజీవ్ అరవడం మాత్రం విన్నానని చెబుతాడు. రాజీవ్‌ను బెదిరించడానికే తాను గన్‌ను మిస్‌ఫైర్ చేశానని, తాను గన్ పేల్చడం మాత్రమే పీఏ చూశాడని, వీడియోలో కూడా అదే ఉందని పోలీస్ ఆఫీసర్‌తో అంటాడు మను. తాను గన్‌ను కావాలనే మిస్ ఫైర్ చేశానని జరిగింది మొత్తం చెబుతాడు.
రాజీవ్‌కు వార్నింగ్...
రాజీవ్‌ను బెదిరించి వదిలేస్తాడు మను. నిన్ను చంపి నీ డెడ్‌బాడీని మాయం చేసే కెపాసిటీ నాకు ఉంది గన్ కాల్చుతాడు. కానీ రాజీవ్‌ను కాకుండా పక్కకు షూట్ చేస్తాడు. నిన్ను చంపడం నాకు ముఖ్యం కాదు. నాకు చాలా సమస్యల ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. నన్ను, వసుధారను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దని రాజీవ్‌కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు మను. వసుధార అంటే ఎప్పటికీ రిషి భార్యనే అని రాజీవ్‌కు చెబుతాడు మను. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.