Guppedantha Manasu April 26th Episode: మర్డర్ కేసులో మను అరెస్ట్ - ఆగిపోయిన దత్తత - వసు ఫ్యామిలీకి కొత్త కష్టాలు
Guppedantha Manasu April 26th Episode: మనును మహేంద్ర దత్తత తీసుకునే కార్యక్రమాన్ని పోలీసులు ఆపేస్తారు. రాజీవ్‌ను హత్య చేసినందుకు మనును అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu April 26th Episode: మనును మహేంద్ర దత్తత తీసుకునే కార్యక్రమానికి తాను, శైలేంద్ర రావడం లేదని భర్తతో చెబుతుంది దేవయాని. కానీ శైలేంద్ర మాత్రం మాట మార్చేస్తాడు. తాము వస్తున్నామని తండ్రితో చెబుతాడు. కొడుకు చెప్పిన మాట విని దేవయాని షాకవుతుంది. శైలేంద్ర ప్లేట్ ఫిరాయించడం వెనుక ఏదో మతలబు ఉందని ధరణి అనుమానపడుతుంది. టాపిక్ డైవర్ట్ చేసి ధరణిని అక్కడి నుంచి పంపిస్తాడు శైలేంద్ర.
శైలేంద్ర ప్లాన్...
దత్తత కార్యక్రమానికి మనం వెళ్లడం ఏమిటి? దానిని ఆపడానికి నువ్వేమైనా ప్లాన్ చేశావా అని కొడుకును అడుగుతుంది దేవయాని. మనును దత్తత తీసుకోవాలని బాబాయ్ అనుకున్న అతడు రాడు? ఒకవేళ మను వచ్చిన కార్యక్రమం జరగదని తల్లితో అంటాడు శైలేంద్ర. ఏం ప్లాన్ చేసింది చెప్పడు శైలేంద్ర.
అక్కడికి వెళితే అన్ని విషయాలు నీకే తెలుస్తాయని మాట దాటేస్తాడు. కొడుకు వేసిన ప్లాన్‌పై దేవయానికి నమ్మకం కలగదు. ముందు అన్నీ ఇలాగే అంటావు. తీరా ఫ్లాపైన తర్వాత బాధపడుతూ బెల్ట్‌తో కొట్టుకుంటావని కొడుకుపై సెటైర్స్ వేస్తుంది దేవయాని. ఈ సారి మాత్రం నా మాట నమ్మమని, దత్తత కార్యక్రమం జరగదని దేవయానితో అంటాడు శైలేంద్ర.
వసుధార ఏర్పాట్లు...
దత్తత కార్యక్రమానికి వసుధార అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ మను మాత్రం అక్కడికి రాడు. అతడి కోసం మహేంద్ర, వసుధార ఎదురుచూస్తుంటారు. పెళ్లిళ్లు, పేరంటాలు జరగాల్సిన ఇంట్లో ఈ దత్తతలు ఏంటి? ఇలాంటి వేడుకను ఎప్పుడు, ఎక్కడ చూడలేదని సెటైర్స్ వేస్తుంది దేవయాని.
ఆమె ఈసడింపు మాటలను ఫణీంద్ర అడ్డుకుంటాడు. మనుకు అనుపమ, వసుధార ఇద్దరు కాల్ చేస్తారు. కానీ కాల్ రీచ్ అవ్వదు. దాంతో మహేంద్ర టెన్షన్ పడతాడు. మను వచ్చేటట్టు లేడు కానీ ఇక సర్దేసేయండి..ఈ మాత్రం దానికి మేకప్ వేసుకొని, పట్టుచీరలు కట్టుకొని రావాల్సివచ్చింది అంటూ మహేంద్ర, వసుధార టెన్షన్‌ను మరింత పెంచుతుంది దేవయాని.
మను ఎంట్రీ...
అప్పుడే అక్కడికి మను ఎంట్రీ ఇస్తాడు. అతడు రాకతో మహేంద్ర, వసు ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. అనుపమ కూడా సంతోషంగా కనిపిస్తుంది. మనును చూసి దేవయాని, శైలేంద్ర ముఖాలు వాడిపోతాయి. మను రాడు అన్నాడు. ఉరుములా వచ్చి ఊడిపడ్డాడు అంటూ కొడుకుపై ఫైర్ అవుతుంది దేవయాని. ప్రతి దానికి ముందు ఓవర్ బిల్డప్‌లు ఇస్తావు. చివరకు నీ ప్లాన్స్ అన్ని పులిహోర అవుతాయని క్లాస్ పీకుతుంది. మను వచ్చిన ఈ దత్తత జరగదని శైలేంద్ర అంటాడు. కొడుకు మాటలను దేవయాని నమ్మకుండా కొట్టిపడేస్తుంది.
పీటలపై అనుపమ...
దత్తత తీసుకునేవాళ్లతో పాటు ఇచ్చేవాళ్లు కూడా వచ్చి పీటల మీద కూర్చోవాలని పంతులు అంటాడు. అనుపమ టెన్షన్ పడుతుంది. నేను మనును దత్తత తీసుకుంటుంది అతడికి దగ్గరవ్వాలని మాత్రమేనని మహేంద్ర అంటాడు. మనును పూర్తిగా వదులుకునేవాళ్లు ఎవరూ లేరని చెబుతాడు.
అనుపమ పీటల మీద కూర్చోవాల్సిన అవసరం లేదని పంతులు చెబుతాడు. దత్తత కార్యక్రమం చివరికి వస్తుంది. అయినా శైలేంద్ర చెప్పినట్లు కార్యక్రమం ఆగకపోవడంతో దేవయాని టెన్షన్ పడుతుంది. శైలేంద్ర మాత్రం దత్తత ఆగిపోతుందని అదే మాట చెబుతాడు. కొడుకు ఓవర్‌కాన్ఫిడెన్స్‌కు దేవయాని షాకవుతుంది.
మను అరెస్ట్...
మనును మహేంద్ర దత్తత తీసుకోవడం ముగుస్తుండగా అప్పుడే అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. దత్తత కార్యక్రమం ఆపేస్తారు. రాజీవ్‌ను హత్య చేసినందుకు మనును అరెస్ట్ చేస్తున్నట్లు పోలీస్ ఆఫీసర్ చెబుతాడు. అతడి మాటలకు అందరూ షాకవుతారు. తాను రాజీవ్‌ను హత్య చేయలేదని మను అంటాడు. మీరు హత్య చేశారో లేదో తేల్చాల్సింది మేము అంటూ పోలీస్ ఆఫీసర్ సమాధానమిస్తాడు. పక్కా ఇన్ఫర్మేషన్, ఆధారాలతో మనును అరెస్ట్ చేస్తున్నట్లు చెబుతారు.
మను గన్ స్వాధీనం...
రాజీవ్‌ను మను షూట్ చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూసినవాళ్లు సాక్ష్యం చెప్పారని పోలీస్ ఆఫీసర్ అంటారు. మీరు రాజీవ్‌ను కలిశారా, మీకు అతడికి మధ్య గొడవ జరిగిందా అని మనును పోలీస్ ఆఫీసర్ ప్రశ్నిస్తాడు. గొడవ జరిగిన మాట నిజమేనని, కానీ తాను రాజీవ్‌ను షూట్ చేయలేదని మను అంటాడు. పోలీసులు మను కారును సెర్చ్ చేసి అతడి గన్‌ను స్వాధీనం చేసుకుంటారు. అతడి గన్ నుంచి రెండు బుల్లెట్స్ మిస్సవుతాయి. రాజీవ్ హత్యకు గురైన ప్లేస్‌లో అవి దొరికాయని చెప్పి మనును పోలీసులు అరెస్ట్ చేస్తారు.
అనుపమ కన్నీళ్లు...
మనును పోలీసులు అరెస్ట్ చేయడంతో అనుపమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దత్తత కార్యక్రమం ఆగిపోవడం చూసి మహేంద్ర కూడా ఎమోషనల్ అవుతాడు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎదురువుతాయని అనుకుంటాడు. రిషి కనిపించకుండాపోయాడు...ఇప్పుడు మనును దత్తత తీసుకుందామని అనుకుంటే అది జరగలేదు అని బాధపడతాడు. మహేంద్రను ఫణీంద్ర ఓదార్చుతాడు.మనును రాజీవ్ ఎందుకు కలిశాడు? వాళ్లిద్దరికి మధ్య ఎందుకు గొడవ జరిగింది అని వసుధార ఆలోచిస్తుంటుంది.
మనునే హత్య చేశాడు...
మను ఎలాంటి తప్పు చేసి ఉండడని మహేంద్ర, అనుపమ అంటారు. కానీ దేవయాని మాత్రం మనునే ఈ హత్య చేసి ఉంటాడని అంటుంది. రాజీవ్‌ను చంపేసి ఏం తెలియనట్లు దత్తత కార్యక్రమానికి వచ్చినట్లు ఉన్నాడని అనుమానం వ్యక్తం చేస్తుంది. లేదంటే దత్తత ఇష్టం లేదు నేను రాను అన్న అతడు ఇప్పుడు ఎలా వచ్చాడని దేవయాని ప్రశ్నలు కురిపిస్తుంది. మనల్ని నమ్మించడానికే ఇలా చేశాడు కావచ్చునని దెప్పిపొడుస్తుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.