Guppedantha Manasu Today Episode: వసును తప్పుపట్టిన మను - అవమానంతో శైలేంద్ర కన్నీళ్లు - మహేంద్ర బ్యాడ్‌టైమ్
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఫణీంద్ర, మహేంద్ర మధ్య దూరం పెంచి ఇద్దరిని విడగొట్టాలని దేవయాని నిర్ణయించుకుంటుంది. మను తండ్రిని తానే అని మహేంద్ర ప్రకటించి భూషణ్ కుటుంబ పరువు మొత్తం పోగొట్టాడని భర్తకు చాడీలు చెబుతుంది.
Guppedantha Manasu Today Episode: మను తన కొడుకు అని ప్రకటించి అతడితో పాటు అనుపమను మరింత కష్టాల్లోకి నెడతాడు మహేంద్ర. అతడి నిర్ణయాన్ని వసుధారతో పాటు అందరూ తప్పుపడతారు. తన జీవితంలో ఇంత డ్యామేజ్ ఎవరూ చేయలేదని మను కూడా మహేంద్రపై ఫైర్ అవుతాడు. అనుపమ కూడా మహేంద్ర క్లాస్ పీకుతుంది. కొడుకు అనుకోవడం వేరు..కొడుకు అని ప్రకటించడం వేరని, నువ్వు అన్న మాట ఎంత మంది జీవితాలపై ప్రభావం చూపుతుందో ఆలోచించలేదా అంటూ కోపగించుకుంటుంది.
సమాధానం చెప్పే ధైర్యం ఉంది...
తన నిర్ణయాన్ని మహేంద్ర సమర్థిస్తాడు. అడిగిన వాళ్లకు, అవమానించిన వాళ్లకు సమాధానం చెప్పే ధైర్యం తనకు ఉందని, ఎవరు ఎన్ని రాళ్లు విసిరిన తాను భయపడనని అంటాడు. అనుకున్నది చేయడమే ఈ మహేంద్ర భూషణ్ నైజం అని చెబుతాడు. అప్పుడే ఫణీంద్ర ఫోన్ చేసి ఓ ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉందని, ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఫణీంద్ర దగ్గరకు బయలుదేరుతాడు మహేంద్ర.
దేవయాని ద్వేషం..
మనుకు తండ్రి తానే అని మహేంద్ర అన్న మాటల గురించే ఫణీంద్ర ఆలోచిస్తుంటాడు. ఫణీంద్ర మనసులో మహేంద్ర పట్ల ద్వేషాన్ని నింపాలని ఫిక్సవుతుంది దేవయాని. మహేంద్ర అన్న మాటలతో తన తల కొట్టేసినట్లు అయ్యిందని, మన కుటుంబ గౌరవాన్నిమహేంద్ర తుడిచేశాడని చెప్పుడు మాటలతో ఫణీంద్ర మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది.
మహేంద్ర చేసిన తప్పు గురించి లోకం మొత్తం కోడై కూస్తుందని, భూషణ్ ఫ్యామిలీలో పుట్టి మహేంద్ర ఇలాంటి తప్పు చేయడం ఏంటి అని ఇరుగుపొరుగువారు మాట్లాడుకుంటున్నారని దేవయాని అంటుంది. మహేంద్ర ఈ ఒక్క తప్పే చేశాడు. ఇంకా ఏమైనా తప్పులు చేశాడా అని కూడా అనుకుంటున్నారని మహేంద్రపై తన మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెట్టేస్తుంది.
బయటివాళ్లు అనుకుంటున్నారా..అది నీ మనసులో అభిప్రాయమా అని ఫణీంద్ర సెటైర్ వేస్తాడు. అతడి మాటలతో దేవయాని తడబడుతుంది. తాను విన్నవే నేను మీతో చెబుతున్నానని అంటుంది.
తమ్ముడిని వెనకేసుకొచ్చిన ఫణీంద్ర...
తన తమ్ముడు ఏ తప్పు చేయడని, అతడు నిప్పు అని మహేంద్రను వెనకేసుకువస్తాడు ఫణీంద్ర. మరి అందరి ముందు మను నా కొడుకు అని మహేంద్ర ఎందుకు చెప్పాడని ఫణీంద్రను అడుగుతుంది దేవయాని. ఈ రోజు మను నా కొడుకు అంటాడు. రేపు అనుపమ నా భార్య అని అంటాడు కావచ్చునని దేవయాని అంటుంది. ఆమె మాటలతో ఫణీంద్ర కోపం పట్టలేకపోతాడు. నోర్ముయ్ అంటూ అనుపమపై ఫైర్ అవుతాడు.
వసుధార ఓదార్పు...
మహేంద్ర అన్న మాటల గురించే మను తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. అతడి దగ్గరకు వసుధార వస్తుంది. మనును ఓదార్చేప్రయత్నం చేస్తుంది. ఓదర్చడానికి మీ అంతట మీరే వచ్చారా...మీ మావయ్య పంపించాడా అని వసుధారతో కోపంగా అంటాడు మను. మీ బాధను పోగట్టడానికే మావయ్య ఆ నిర్ణయం తీసుకున్నారని మహేంద్ర తప్పును సమర్థించే ప్రయత్నం చేస్తుంది వసుధార. మా బాధ ఏమో మేము పడేవాళ్లం, ఆయనకు ఎందుకు అంటూ మను సీరియస్ అవుతాడు.
జగతి, రిషిలను...
జగతి, రిషిలను మీలో మావయ్య చూస్తున్నాడని, వారు పడుతోన్న బాధను కళ్లారా చూశాడు. అందుకే మీకు అలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదనే మావయ్య అందరి ముందు ఆ మాట చెప్పి ఉంటాడని మనుతో అంటుంది వసుధార. మహేంద్ర ఉద్దేశం ఏదైనా దాని వల్ల మేము మరింత అవమానాలు, బాధలు పడాల్సివస్తుందని మను అంటాడు. మీ మావయ్యను వెనకేసుకొచ్చింది చాలు అంటూ వసుధార మాటలను ఆపేస్తాడు. వారి మాటలను చాటు నుంచి రాజీవ్ వింటుంటాడు. మనును వసుధార సపోర్ట్ చేయడం తట్టుకోలేకపోతాడు.
దేవయాని ఫైర్...
ఫణీంద్ర దగ్గరకు వస్తాడు మహేంద్ర. నన్ను ఎందుకు రమ్మన్నారని అన్నయ్యను అడుగుతాడు మహేంద్ర. నువ్వు చేసిన ఘనకార్యానికి సత్కరిద్దామని పిలిచామని దేవయాని తన నోటికి పదును పెడుతుంది. ఆమెకు ఫణీంద్ర వార్నింగ్ ఇస్తాడు.
నేను చెప్పింది తప్పు అని మీరు నమ్ముతున్నప్పుడు దీని గురించి చెప్పడానికి ఏం లేదని ఫణీంద్రతో అంటాడు మహేంద్ర. అలా ఎలా వదిలేస్తాం. నువ్వు చెప్పిన మాట వల్ల భూషణ్ ఫ్యామిలీ పరువు మొత్తం పోయిందని దేవయాని కోప్పడుతుంది. నేనేం నేరాలు, ఘోరాలు చేయలేదని, కుట్రలు పన్నడం తెలియదని మహేంద్ర సమాధానమిస్తాడు.
మనును తండ్రి పేరుతో అందరూ హేళన చేయడం నచ్చలేదని, అందరి నోర్లు మూయించడానికే మను తండ్రిని నేనే అని ప్రకటించానని మహేంద్ర అంటాడు. ఇందులో మరే ఉద్దేశం లేదని చెబుతాడు. అంతేనా..ఇంతకంటే ఏం లేదా అని దేవయాని అనుమానంగా అడుగుతుంది. ఫణీంద్ర సమాధానం చెప్పబోతుండగా అతడిని ఆపేస్తారు.
శైలేంద్ర కన్నీళ్లు...
మను మీ బాబాయ్ కొడుకేనా అని అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారని, వారికి ఏమని సమాధానం చెప్పాలి అంటూ మహేంద్రను ప్రశ్నిస్తాడు శైలేంద్ర. రేపటి నుంచి మేము ఎలా బయటతిరగాలి. నువ్వు చేసిన తప్పుకు మేము ఎందుకు శిక్ష అనుభవించాలి అంటూ మహేంద్రపై ఫైర్ అవుతుంది దేవయాని. కుటుంబానికి నువ్వు పెద్ద మచ్చ తెచ్చావని కోప్పడుతుంది. మీరు చేసిన పనికి నేను అవమానంతో కృంగిపోతున్నానని శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు.
అన్నయ్యకు క్షమాపణలు చెప్పిన మహేంద్ర...
దేవయాని మాటలను మహేంద్ర పట్టించుకోడు. అన్ని ఆలోచించుకునే నేను మను తండ్రిని అని చెప్పాను. అందులో ఎలాంటి తప్పు, స్వార్థం లేదని అంటాడు. ఈ విషయంలో ఎవరూ ఏమి అనుకున్న తగ్గనని అంటాడు. మను కోసం ముందుడుగు వేస్తాను. కానీ వెనకడుగు మాత్రం వేయను.
ఎలాంటి సిట్యూవేషన్స్ ఎదుర్కోవడానికైనా తాను సిద్ధమని చెబుతాడు. నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే క్షమించమని చేతులెత్తి ఫణీంద్రకు మొక్కుతాడు మహేంద్ర. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.