Guppedantha Manasu April 16th Episode: మనుకు కొత్త కష్టాలు తెచ్చిన మహేంద్ర - చంపేస్తానని దేవయానికి వసు వార్నింగ్
Guppedantha Manasu April 16th Episode: మను తండ్రి తానే అని అందరి ముందు మహేంద్ర ప్రకటిస్తాడు. అతడి మాటలను వసుధారతో పాటు మను, అనుపమ తప్పుపడతారు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu April 16th Episode: పేరెంట్స్, లెక్చరర్స్ మీటింగ్‌లో మనును అవమానించాలనే తన ప్లాన్ సక్సెస్ కావడంతో శైలేంద్ర ఆనందంలో మునిగిపోతాడు. తండ్రి మాత్రమే తెలియదా? తల్లి కూడా తెలియదా అంటూ మీటింగ్‌కు హాజరైన పేరెంట్స్ మనును ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతారు. తాను కొట్టిన దెబ్బకు మను హార్ట్ బ్రేక్ అయ్యి ఉంటుందని శైలేంద్ర అనుకుంటాడు.
కాలేజీతో పాటు సిటీని కూడా మను వదిలిపెట్టి వెళ్లిపోతాడని ఊహించుకుంటాడు. తాను గెలిచానని, తనకు ఎవరూ అడ్డు ఉండరని ఆనందంతో గట్టిగా అరుస్తాడు. శైలేంద్ర అరుపులు విని స్టూడెంట్స్ కంగారుగా పడతారు. పిచ్చి పట్టినట్లు అరుస్తున్నారు ఏమైందని శైలేంద్రను అడుగుతారు. సమాధానం చెప్పకుండా వారిపై సీరియస్ అవుతాడు శైలేంద్ర.
తన హ్యాపీనెస్ అందరికి పిచ్చితనంగా కనిపించడం చూసి తాను మనుపై గెలిచానా? ఓడిపోయానా అనే డైలామాలో పడిపోతాడు శైలేంద్ర.
వసుధార షాక్....
మను తండ్రిని తానే అనే పేరెంట్స్ అందరి మహేంద్ర ఒప్పుకోవడం చూసి వసుధార షాకవుతుంది. అలా ఎందుకు చేశారని మహేంద్రను అడుగుతుంది. మను కోసమే అలా ప్రకటించాల్సివచ్చిందని మహేంద్ర అంటాడు. అందరూ కలిసి మనును నిలదీస్తుంటే చూడలేకపోయానని, మను, అనుపమకు ఎలాంటి అవమానాలు ఎదురవ్వకూడాదని అలా చెప్పాల్పివచ్చిందని అంటాడు.
మీరు అలా చేయడం కరెక్ట్ కాదని మహేంద్రను తప్పుపడుతుంది వసుధార. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మీరు ఊహించలేదా అని అడుగుతుంది. ఆవేశంతో కాదు ఆలోచనతోనే మనును తన కొడుకు అని చెప్పానని మహేంద్ర అంటాడు. నేను చెప్పిన మాట వల్ల అనుపమ, మనులకు ఎలాంటి అనార్థాలు ఎదురవ్వవని అనుకుంటున్నట్లు వసుధారకు బదులిస్తాడు మహేంద్ర.
కానీ మీరు వారికి ఇంకా సమస్యలను తెచ్చిపెట్టారని, మీ మాటలకు అనుపమ, మను ఏమని అంటారో, ఆ మాటలను ఎలా తీసుకుంటారో అర్థం కావడం లేదని వసుధార అంటుంది.
దేవయాని వాదన...
మను తండ్రిని తానే అని మహేంద్ర చెప్పిన మాటల గురించే అనుపమ ఆలోచిస్తుంది. ఆమె దగ్గరకు దేవయాని వస్తుంది. నీ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది. రోజుకో ట్విస్ట్ చూపిస్తున్నావు. మొన్నటివరకు నువ్వు ఒంటరిదానిని అనుకున్నాను. ఆ తర్వాత నీకు ఓ కొడుకు ఉన్నాడని తెలిసింది.
అతడికి తండ్రి ఎవరో తెలియదని బయటపడింది. ఈ రోజు కొత్తగా మనుకు తండ్రి నేనేనని మహేంద్ర అంటున్నాడు. . మహేంద్ర నిజంగా నీ భర్తనా...అతడే నీ భర్త అయితే నీ మెడలో తాళి ఎందుకు లేదని అనుపమపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది దేవయాని. కానీ అనుపమ మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది.
వసుధార ఎంట్రీ...
తాళి లేదంటే నీకు, మహేంద్రకు మధ్య ఏదైనా ఇల్లీగల్ రిలేషన్‌షిప్ ఉందా అని అనుపమతో దేవయాని అనబోతుంది. దేవయాని మాటలను చాటు నుంచి విన్న మను ఆవేశం పట్టలేకపోతాడు. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన వసుధార దేవయాని మాటలను అడ్డుకుంటుంది.
దేవయానికి వార్నింగ్...
మీరు వరస్ట్ అని తెలుసు. కానీ ఇంత దిగజారిపోతారని ఊహించలేదని దేవయానిపై వసుధార ఫైర్ అవుతుంది. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడమని వసుధారతో అంటుంది దేవయాని. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని వసుధార ధీటుగా బదులిస్తుంది.
నేనే మను తండ్రిని అని మీ మామయ్య చెప్పాడుగా...అది నిజం కాకపోతే అనుపమ, మను సైలెంట్‌గా ఎందుకు ఉన్నారని వసుధారను నిలదీస్తుంది దేవయాని. మౌనంగా ఉన్నారంటే అది నిజమనే కదా అర్థం అని అంటుంది. కొన్ని సార్లు అబద్ధం అని తెలిసినా అది నిజం కాదని చెప్పలేని పరిస్థితులు ఉంటాయని వసుధార అంటుంది.
అబద్ధం అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు. వాళ్ల గతం గురించి నీకు ఎలా తెలుసు అని వసుధారను నిలదీస్తుంది దేవయాని. మీ మావయ్య నిజం అని అంటున్నావు. నువ్వేమో అబద్ధమని చెబుతున్నావని వసుధారపై మాట దాడిని కొనసాగిస్తుంది దేవయాని.
వసుధార ఆవేశం...
నేను కాదు దిగజారింది. మీ మామయ్య అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది దేవయాని. ఈ అనుపమ దిగజారింది అని అంటుంది. అనుపమ గురించి ఇంకో మాట ఎక్కువ మాట్లాడిన ఏం చేస్తానో నాకు తెలియదని వసుధార కోప్పడుతుంది. ఏం చేస్తావు చంపేస్తావా... అని దేవయాని అంటుంది.
అందులో డౌటేం లేదని వసుధార ఆన్సర్ ఇస్తుంది. తనకు లేని పౌరుషం నీకు ఎందుకు వస్తుందని అనుపమను చూస్తూ వసుధారతో అంటుంది దేవయాని. ఊరికే నాతో కయ్యానికి కాలుదువ్వడం కాకుండా నిజాలేమిటో నువ్వు తెలుసుకొని నాకు చెప్పమని దేవయాని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మను ఆవేశం...
మహేంద్ర సీరియస్‌గా ఆలోచనల్లో మునిగిపోతాడు. అతడి దగ్గరకు మను వస్తాడు. మనును చూడగానే నేను చేసింది కరెక్ట్ కాదు అని చెప్పవడానికి వచ్చావా అని మనుతో అంటాడు మహేంద్ర. నాకు తండ్రి అనే పదం నచ్చదు. తండ్రి గురించి వెతుకుతుంది అతడు కనిపించగానే నిలదీయడానికి మాత్రమేనని మహేంద్రతో అంటాడు మను.
తండ్రిపై నాకు అంత ద్వేషం, కోపం ఉంది. అలాంటిది నాకు తండ్రి అని మీరే ఎందుకు చెప్పారని మహేంద్రను నిలదీస్తాడు మను. నువ్వు, అనుపమ పడుతోన్న అవమానాలు, బాధలు చూడలేక అలాచెప్పానని మనుతో అంటాడు మహేంద్ర. దాని వల్ల వచ్చే సమస్యను గురించి మీరు ఆలోచించలేదని, మీరు అన్న మాటతో అనుపమ గురించి దేవయాని చాలా తప్పుగా మాట్లాడిందని మను ఆవేశంగా అంటాడు.
ఆస్థానంలోకి మీరు రావొద్దు...
తండ్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలియక నువ్వు పడుతోన్న బాధలను ఆపడానికే నీ తండ్రి స్థానంలోకి నేను వచ్చానని మహేంద్ర అంటాడు. మీరు ఆ స్థానంలోకి రావద్దొని మహేంద్రకు చెబుతాడు మను. నా దృష్టిలో తండ్రి అంటే ఎలాంటి అభిప్రాయం ఉందో చెబితే మీరు తట్టుకోలేదు. అందుకే మీరు ఆ స్థానంలోకి రావద్దొని కోపంగా మహేంద్రతో చెబుతాడు మను. జీవితంలో ఎవరూ చేయలేనంత డ్యామేజీ మీరు చేశారని, దీనిని ఇంతటితో వదిలేయమని అంటాడు.
శైలేంద్ర డిసపాయింట్...
తన ప్లాన్ అనుకున్నట్లుగా జరగకపోవడంతో శైలేంద్ర డిసపాయింట్ అవుతాడు. స్క్రిప్ట్‌లో లేని డైలాగ్స్ చెప్పి మహేంద్ర తమ ప్లాన్‌ను మొత్తం చెడగొట్టాడని అంటాడు. మను కాలేజీ వదిలిపెట్టి వెళ్లిపోతాడని అనుకుంటే కథ ఇలా అడ్డం తిరిగిందని చెబుతాడు. అనుకున్నది సాధించే వరకు మన ప్రయత్నాలు అపవద్దని కొడుకుతో అంటుంది దేవయాని. మనుకు తండ్రిని తానే అని మహేంద్ర చెప్పిన మాటను ఫణీంద్ర ముందు హైలైట్ చేయాలని ఫిక్సవుతారు. మహేంద్ర, ఫణీంద్ర మధ్య దూరాన్ని పెంచాలని అనుకుంటారు.
అనుపమ హర్ట్...
మను తండ్రి తానే అని మహేంద్ర చెప్పిన మాటలతో అనుపమ హర్ట్ అవుతుంది. అతడిపై కోపంగా ఉంటుంది. మహేంద్రతో మాట్లాడటానికి ఇష్టపడదు. తానేం తప్పు చేయలేదని మహేంద్ర అంటాడు. రిషి కనిపించకుండా వెళ్లిన తర్వాత తాను డల్ అయిపోయానని, సమస్యల వలయంలో కూరుకుపోయానని, అలాంటి తరుణంలో మను తనకు ధైర్యాన్ని ఇచ్చాడని, కొడుకులా ఆదుకున్నాడని అనుపమతో అంటాడు మహేంద్ర.
అందుకే మనును నా కొడుకు అనుకున్నానని అనుపమకు చెబుతాడు. మహేంద్ర. కొడుకు అనుకోవడం వేరు. అందరి ముందు కొడుకు అనడం వేరు. మను నీకు సాయం చేసినందుకు అతడి తండ్రిని అని నీకు నువ్వే ప్రకటించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మహేంద్రతో కోపంగా అంటుంది అనుపమ. ఆమె ప్రశ్నలకు మహేంద్ర సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.