Guppedantha Manasu Today Episode: మ‌ను అమ్మ ప్రేమ‌కు వ‌సు ఫిదా - శైలేంద్ర శ‌త్రువుల లిస్ట్‌లో ఫ‌ణీంద్ర - రిషి ఎక్క‌డంటే?-guppedantha manasu april 13th episode rajiv cunning plan over on manu guppedantha manasu today serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Today Episode: మ‌ను అమ్మ ప్రేమ‌కు వ‌సు ఫిదా - శైలేంద్ర శ‌త్రువుల లిస్ట్‌లో ఫ‌ణీంద్ర - రిషి ఎక్క‌డంటే?

Guppedantha Manasu Today Episode: మ‌ను అమ్మ ప్రేమ‌కు వ‌సు ఫిదా - శైలేంద్ర శ‌త్రువుల లిస్ట్‌లో ఫ‌ణీంద్ర - రిషి ఎక్క‌డంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 13, 2024 08:05 AM IST

Guppedantha Manasu Today Episode: మ‌ను, అనుప‌మ కాలేజీ వ‌దిలిపెట్టి వెళ్లిపోయేలా రాజీవ్ స‌హ‌కారంతో శైలేంద్ర‌, దేవ‌యాని ఓ ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్‌తో శైలేంద్ర ఎండీ కావ‌డం ఖాయ‌మ‌ని దేవ‌యాని సంబ‌ర‌ప‌డుతుంది. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu april 13th Episode: మ‌ను తండ్రి ఎవ‌రు అని అంద‌రూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు భ‌య‌ప‌డి కాలేజీకి రావ‌డం మానేస్తుంది అనుప‌మ‌. ఆమెను తిరిగి కాలేజీకి ర‌ప్పించేందుకు మ‌హేంద్ర ప్లాన్ చేస్తాడు. పేరెంట్స్‌, స్టూడెంట్ మీటింగ్‌కు అనుప‌మను ర‌మ్మ‌ని మ‌హేంద్ర‌, వ‌సుధార ఆహ్వానిస్తారు. కానీ ఆ మీటింగ్‌కు మ‌ను వ‌స్తున్నాడ‌ని తెలిసి తాను రాన‌ని అంటుంది అనుప‌మ‌.

ఎవ‌రో వ‌స్తున్నార‌ని, మీరు రాకుండా ఉండ‌టం క‌రెక్ట్ కాద‌ని, మిష‌న్ ఎడ్యుకేష‌న్ ఇంఛార్జ్ హోదాలో మీరు త‌ప్ప‌కుండా మీటింగ్ రావాల్సిందేన‌ని అనుప‌మ‌ను ఇరికిస్తుంది వ‌సుధార. దాంతో ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క అనుప‌మ సైలెంట్‌గా ఉండిపోతుంది. మౌనం అర్ధాంగీకారం కాబ‌ట్టి అనుప‌మ మీటింగ్‌కు రావ‌డం ఖాయ‌మ‌ని మ‌హేంద్ర అంటాడు.

అంద‌రం క‌లిసే మీటింగ్‌కు వెళ్దామ‌ని మ‌నుతో అంటాడు మ‌హేంద్ర‌. స‌రేన‌ని అనుప‌మ‌ను చూస్తూ మ‌ను బ‌దులిస్తాడు.

దేవ‌యాని ఆనందం...

దేవ‌యాని ఆనందంగా క‌నిపిస్తుంది. ఇప్పుడు మ‌నం స‌రైన దారిలో వెళుతున్నామ‌ని శైలేంద్ర‌తో చెబుతూ సంతోష‌ప‌డుతుంది. ఆమె ఆనందంలో అర్థం లేద‌ని, ఏం జ‌ర‌గ‌కుండా ఎందుకు సంబ‌ర‌ప‌డుతున్నావ‌ని దేవ‌యానిని అడుగుతాడు శైలేంద్ర‌. ఎండీ సీట్ కోసం అడ్డుగా ఉన్న‌వాళ్లంద‌రిని పై లోకానికి పంపించా. అయినా ఎండీ సీట్ త‌న సొంతం కాలేద‌ని శైలేంద్ర ఆవేద‌న‌కు లోన‌వుతాడు.

బోర్డ్ మీటింగ్ త‌ర్వాత‌...

బోర్డ్ మీటింగ్ త‌ర్వాత ఎండీ సీట్ త‌ప్ప‌కుండా నీ సొంతమ‌వుతుంద‌ని కొడుకుతో అంటుంది దేవ‌యాని. మ‌ను అడ్డు లేక‌పోతేనే ఎండీ సీట్ త‌న‌కు ద‌క్కుతుంద‌ని, వ‌సుధార‌ను ఒక్క మాట కూడా ప‌డ‌నీయ‌కుండా తండ్రి అడ్డుప‌డుతున్నాని ఫ‌ణీంద్ర‌పై సీరియ‌స్ అవుతాడు శైలేంద్ర‌.

ప్ర‌శాంతంగా తండ్రి త‌న‌ను ఒక్క ప‌ని చేయ‌నీయ‌డం లేద‌ని, అస‌లు శ‌త్రువు త‌న‌కు తండ్రేన‌ని ఆవేశ‌ప‌డ‌తాడు శైలేంద్ర‌. ఫ‌ణీంద్ర‌కు త‌మ నిజ‌స్వ‌రూపం తెలిసిన భ‌య‌ప‌డేది ఏం లేద‌ని అంటాడు. కానీ శైలేంద్ర ఆవేశాన్ని కంట్రోల్ చేస్తుంది దేవ‌యాని.

దేవ‌యాని స‌ల‌హా...

ఫ‌ణీంద్ర క‌న్నెర్ర చేస్తే మ‌నం భ‌స్మ‌మైపోతామ‌ని, మంచివాళ్ల‌కు న్యాయం చేయ‌డానికి ఫ‌ణీంద్ర‌ ఎంత దూర‌మైన వెళ‌తారు. చెడ్డ‌వాళ్ల ప‌ని ప‌ట్ట‌డానికి ఎంత‌కైనా తెగిస్తారు. తండ్రి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని, ఫ‌ణీంద్ర ఎన్ని మాట‌లు అన్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని కొడుకుకు స‌ల‌హా ఇస్తుంది దేవ‌యాని.

నిన్ను ఎండీ సీట్‌లో కూర్చ‌బెట్టి డీబీఎస్‌టీ కాలేజీని రాజును చేస్తాన‌ని శైలేంద్ర‌తో అంటుంది దేవ‌యాని. అందుకు నా ద‌గ్గ‌ర ఓ ఆయుధం ఉంద‌ని, దాంతో మ‌ను, అనుప‌మ కూడా వ‌సుధార‌ను, కాలేజీని వ‌దిలిపెట్టి దూరంగా పారిపోతార‌ని అంటుంది.

ధ‌ర‌ణి ఎంట్రీ...

అప్పుడే ధ‌ర‌ణి అక్క‌డికి ఎంట్రీ ఇస్తుంది. మీరు ప్లాన్ చేస్తున్నారంటే ఎవ‌రికో మూడింద‌ని సెటైర్ వేస్తుంది. ఆమె స‌డెన్ ఎంట్రీని ఊహించ‌లేక‌పోతారు శైలేంద్ర‌, దేవ‌యాని. ఆమెపై ఫైర్ అవుతారు. ధ‌ర‌ణి ఎంత‌కు అక్క‌డి నుంచి క‌ద‌ల‌క‌పోవ‌డంతో మ‌మ్మ‌ల్ని ఇరివేట్ చేయ‌కుండా ఇక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌ని దేవ‌యాని కోపంగా అంటుంది. మీరు చేసే ప‌నుల వ‌ల్ల మంచివాళ్ల‌కు ఎప్పుడు మంచే జ‌రుగుతుంది. చెడుగా ఆలోచించి చేస్తే అది మీకు చెడే చేస్తుంది అని దేవ‌యాని, శైలేంద్ర‌పై పంచ్ వేసి అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది ధ‌ర‌ణి.

మ‌ను అమ్మ ప్రేమ‌...

బ‌ల‌వంతంగా అనుప‌మ‌ను కాలేజీకి ర‌ప్పించ‌డం మ‌నుకు ఇష్టం ఉండ‌దు. అమ్మ మ‌రికొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంద‌ని వ‌సుధార‌తో అంటాడు మ‌ను. బ‌ల‌వంతంగా కాకుండా ఇష్టంతో అనుప‌మ కాలేజీకి వ‌స్తే బాగుంటుంది మ‌ను అంటాడు. మీరు క‌న‌బ‌డ‌రు కానీ అమ్మపై మ‌న‌సులో మీకు బాగానే ప్రేమ ఉంద‌ని మ‌నుతో అంటుంది వ‌సుధార‌.

అనుప‌మ చాలా రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నారు. కాలేజీకి వ‌స్తే రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. పేరెంట్స్ మీటింగ్‌లో అనుప‌మ ఉంటే బాగుంటుంద‌ని వ‌సుధార బ‌దులిస్తుంది. మీరు మీటింగ్‌కు వ‌స్తార‌ని తెలిసి అనుప‌మ రాన‌ని చెప్పినందుకు బాధ‌ప‌డుతున్నారా అని మ‌నును అడుగుతుంది వ‌సుధార‌. మీ మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌లు తొల‌గిపోయి క‌లిసిపోయే రోజులు మ‌ళ్లీ వ‌స్తాయ‌ని మ‌నుకు స‌ర్ధిచెబుతుంది వ‌సుధార‌.

మాటిచ్చిన మ‌ను...

రిషిని మ‌ర్చిపోయావంటూ కాలేజీలో దేవ‌యాని అన్న మాట‌ల‌కు మీరు బాధ‌ప‌డ్డారా అని వ‌సుధార‌ను అడుగుతాడు మ‌ను. రిషి నా ప్రాణం. నాలో స‌గ‌భాగం. రిషి గురించి దేవ‌యాని అన్న మాట‌ల‌తో నా మ‌న‌సు విల‌విల‌లాడింద‌ని వ‌సుధార ఆవేద‌న‌కు లోన‌వుతుంది. రిషిని వెతికి తీసుకురావ‌డంలో మీకు నేను సాయంగా ఉంటాన‌ని మ‌రోసారి వ‌సుధార‌కు మాటిస్తాడు మ‌ను. వ‌సుధార ఇంట్లో నుంచి వెళ్ల‌బోతూ అనుప‌మ‌కు కూడా వెళుతున్నాన‌ని అంటాడు మ‌ను.

రాజీవ్ క‌న్నింగ్ ప్లాన్‌...

మ‌నును దెబ్బ‌కొట్టేందుకు రాజీవ్ స‌హ‌కారంతో దేవ‌యాని, శైలేంద్ర ఓ ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్‌ను ఎలాగైనా స‌క్సెస్ చేస్తాన‌ని రాజీవ్ అంటాడు. మ‌నును కాలేజీ నుంచి పారిపోయేలా ప‌థ‌కం ర‌చిస్తారు.

పేరెంట్స్ మీటింగ్‌కు హాజ‌రుకానున్న త‌ల్లిదండ్రుల‌కు డ‌బ్బు ఇచ్చి మ‌నుకు వ్య‌తిరేకంగా మాట్లాడేలా చేస్తాడు రాజీవ్‌. డ‌బ్బు కోసం వాళ్లు ఆ ప‌నిచేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌తారు. పేరెంట్స్ మీటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తాడు మ‌ను. ఆ మీటింగ్‌లోనే మ‌నుపై రివేంజ్ తీర్చుకోవ‌డానికి శైలేంద్ర సిద్ధంగా ఉంటాడు.

IPL_Entry_Point