Guppedantha Manasu Today Episode: మను తండ్రి పేరు చెప్పేసిన అనుపమ - మహేంద్ర షాక్ - రిషి జాడ కనిపెట్టిన వసు
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో మనును కాలేజీని నుంచి శాశ్వతంగా దూరం చేసేందుకు శైలేంద్ర కొత్త స్కెచ్ వేస్తాడు. మనును తండ్రి పేరుతో మరోసారి దారుణంగా అవమానిస్తాడు. మరోవైపు రిషి కోసం అన్వేషిస్తోన్న వసుకు కీలకమైన క్లూ దొరుకుతుంది.
Guppedantha Manasu Today Episode: తల్లితో పాటు తాను పడుతోన్న అవమానాలకు తండ్రి కారణమని కోపంతో రగిలిపోతాడు మను. అతడిని ఎలాగైనా పట్టుకొని రివేంజ్ తీర్చుకోవాలని ఫిక్సవుతాడు. ఒకవేళ తండ్రి తన కళ్ల ముందుకు వస్తే తాను పడుతోన్న బాధలకు అతడు సమాధానం చెప్పి తీరాల్సిందేనని, ఆ తర్వాతే అతడిని తండ్రిగా అంగీకరిస్తానని మను ఛాలెంజ్ చేస్తాడు.
ప్రేమతో సమాధానం...
మను పడుతోన్న బాధ, ఆవేదన చూసి మహేంద్ర చలించిపోతాడు.కోపంగా కాకుండా ప్రేమతో అనుపమ నుంచి మను తండ్రి ఎవరో సమాధానం రాబట్టాలని డిసైడ్ అవుతాడు. అతడి ప్లాన్‌ను అనుపమ కనిపెడుతుంది. ఎన్ని రకాలుగా అడిగినా కూడా మను తండ్రి ఎవరన్నది అనుపమ బయటపెట్టదు. అనుపమ పంతం ముందు మహేంద్ర పట్టుదల ఓడిపోతుంది. అయినా నిరుత్సాహపడకుండా ఎలాగైనా అనుపమ నుంచి సమాధానం రాబట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.
అనుపమ హింట్...
మహేంద్ర పట్టువీడకపోవడంతో చివరకు మను తండ్రి ఎవరో హింట్ ఇస్తుంది అనుపమ. ఆ పేరు విని మహేంద్ర షాకవుతాడు. మనుకు ఆ విషయం మహేంద్ర చెప్పడా లేదా అన్నది నేటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
ఫణీంద్ర ట్విస్ట్...
మను కాలేజీకి రావడం లేదని తెలిసి ఫణీంద్ర ఆశ్చర్యపోతాడు. అతడికి ఏమైంద, కాలేజీకి ఎందుకు రావడం లేదో అంతుపట్టదు. మనును కాలేజీకి తిరిగి తీసుకువచ్చే బాధ్యతను శైలేంద్రకు అప్పగిస్తాడు ఫణీంద్ర. మనును అవమానించి కాలేజీ నుంచి పంపించిన విషయం తండ్రికి తెలిస్తే అతడు ఎలా రియాక్ట్ అవుతాడోనని శైలేంద్ర భయపడతాడు.
ఆ విషయం బయటపడకుండా మనును కాలేజీకి తీసుకొస్తానని తండ్రికి మాటిస్తాడు.మనును కాలేజీకి తీసుకురావడం కంటే అతడికి శాశ్వతంగా కాలేజీకి దూరం చేయడం కోసం కొత్త పథకం వేస్తాడు. తండ్రి పేరుతో అతడిని మరోసారి దారుణంగా అవమానిస్తాడు. శైలేంద్ర చేసిన అవమానాన్ని మను సహించలేకపోతాడు. శైలేంద్ర కొట్టిన దెబ్బకు మను ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా ఉండనుంది.
దేవయానికి ఇచ్చిన మాట...
అనుపమ గొడవల్లో పడి రిషి గురించి ఆలోచించడం మానేస్తుంది వసుధార. మూడు నెలల్లో రిషిని తిరిగి తీసుకొస్తానని దేవయానికి ఇచ్చిన మాట గుర్తొస్తుంది. ఎలాగైన రిషి ఆచూకీ కనిపెట్టేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. రిషి గురించి ఆమెకు ఓ కీలకమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అతడు బతికే ఉన్నాడనే నిజం తెలుస్తుంది. దాంతో వసు హ్యాపీగా ఫీలవుతుంది. రిషి అడ్రెస్ కోసం వసుధార ఏం చేసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌లో తేలనుంది.
రాజీవ్‌కు పంచ్...
డీఆర్ ఎస్ ప్లాన్‌లో భాగంగా వసుధారను ఫాలో అయ్యే బాధ్యతను రాజీవ్ తీసుకుంటాడు. వసును తన సొంతం చేసుకునేందుకు ఓ మాస్లర్ ప్లాన్ వేస్తాడు. కానీ తన తెలివితేటలతో రాజీవ్‌కు మైండ్‌బ్లాక్ అయ్యే పంచ్ వేస్తుంది వసుధార. మరోవైపు మనును బాధ నుంచి దూరం చేయడానికి అతడితో క్లోజ్‌గా మూవ్ కావడం మొదలుపెడుతుంది ఏంజెల్. బావ కావడంతో మనును ఆటపట్టిస్తుంది. ఆమె అల్లరిని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటాడు. ఆ అల్లరి ప్రేమకు దారితీసిందా? ఏంజెల్ మనసులో ఉన్నది మనునేనా కాదా అన్న ప్రశ్నలకు నేటి గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్‌లో సమాధానం దొరకనుంది.