Guppedantha Manasu February 1st Episode:ఎండీగా వసుధారనే ఉండాలన్న శైలేంద్ర - గేమ్ రివర్స్ - రిషి మిస్సింగ్‌పై డౌట్స్
Guppedantha Manasu February 1st Episode: వసుధార ఎండీ పదవి చేపట్టిన రోజు నుంచే కాలేజీలో సమస్యలు మొదలయ్యాయని బోర్డ్ మెంబర్స్ అంటారు. ఎండీ పదవి నుంచి వసుధారను తొలగించాలని పట్టుపడతారు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu February 1st Episode: యూత్ ఫెస్టివల్ ఫెయిల్ కావడంతో వసుధారపై మినిస్టర్ ఫైర్ అవుతాడు. నువ్వు ఎండీగా ఉన్నప్పుడే ఇలా జరిగింది అని అంటాడు. రిషితో ఇప్పుడే మాట్లాడాలని పట్టుపడతాడు. కానీ రిషి ఎక్కడున్నాడో తనకు తెలియదని, కాంటాక్ట్‌లో లేడని వసుధార సమాధానమిస్తుంది. రిషి కాలేజీకి రావాలంటూ క్లాస్‌లను బాయ్‌కాట్ చేసిన స్టూడెంట్స్‌ను మినిస్టర్ రిక్వెస్ట్ చేసి క్లాస్‌లకు పంపించే ప్రయత్నం చేస్తాడు.
రిషి గురించి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తామని నచ్చజెపుతాడు. రిషి సార్ అంటే మీ అందరికి ప్రాణం అని నాకు తెలుసు. రిషి సార్ కోసం మీకు ఇంకా గొడవ చేయాలని, అల్లరి చేయాలని ఉంటుంది. కానీ ఇది టైమ్ కాదు అంటూ మినిస్టర్‌కు సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడుతాడు శైలేంద్ర. మినిస్టర్ వద్ద మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తాడు.
వసుధార పదవి చేపట్టిన రోజు నుంచే...
మినిస్టర్ బోర్డ్ మీటింగ్ ఏర్పాటుచేస్తాడు. కాలేజీ సమస్యలపై వసుధారతో పాటు ఫణీంద్ర, మహేంద్రలకు క్లాస్ ఇస్తాడు. కాలేజీలో ఉండే చిన్న చిన్న సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని సలహా ఇస్తాడు. వసుధార ఎండీ పదవి చేపట్టిన రోజు కాలేజీలో సమస్యలు మొదలయ్యాయని బోర్డ్ మెంబర్స్ అంటారు. వసుధార వల్లే కాలేజీ పరువు పోయిందని, ఆమె ఈ సమస్యలకు కారణమని బోర్డ్ మెంబర్స్ నిందలు వేస్తారు. మహేంద్ర, అనుపమ మాత్రం వసుధారకు సపోర్ట్ చేస్తారు. కానీ ఎంత చెప్పినా బోర్డ్ మెంబర్స్ మాత్రం వసుధారనే తప్పుపడతారు.
కాలేజీకి రాదు...
మీరు ఇంత బాధ్యతరాహిత్యంగా ఉంటే ఎ లా...కాలేజీకి సరిగా రారు. బోర్డ్ మీటింగ్స్‌కు అటెండ్ కారు. సిలబస్, ల్యాబ్స్‌తో పాటు కాలేజీలో అన్నీ సమస్యలే అంటూ వసుధారను తప్పుపడతారు బోర్డ్ మెంబర్స్. అసలు మనం ఎగ్జామ్స్ సరిగా నిర్వహించే స్థితిలోనే లేమని చెబుతారు. ఎండీగా వసుధార ఏం పట్టనట్లుగా ఉండటం సరికాదని క్లాస్ ఇస్తారు. చిన్న చిన్న సమస్యలను పెద్దదిగా చేసి వసుధారను నిరుత్సాహపరచడం కరెక్ట్ కాదని బోర్డ్ మెంబర్స్‌కు నచ్చజెప్పేందుకు అనుపమ ట్రై చేస్తుంది. కానీ ఆమె మాటలను వినరు.
కాలేజీలో సమస్యలు అన్నింటికి కారణం ఎండీగారే అంటూ డిక్లేర్ చేస్తారు. కాలేజీలో ఏం జరుగుతుందో కూడా వసుధారకు తెలియదని అంటారు. వసుధార వల్ల కాలేజీకి నష్టం జరిగింది నిజమేనని బోర్డ్ మెంబర్స్‌తో పాటు శైలేంద్ర కూడా అంటాడు. కానీ మనం తనవైపు కూడా ఆలోచించాలి. వసుధారకు ఇంతకుముందు ఎండీ పదవిని నిర్వహించిన అనుభవం లేదు. కేవలం మా ఫ్యామిలీ మెంబర్ అనే రిషి ఆమెను ఎండీ సీట్‌లో కూర్చోబెట్టాడు. ఇకపై తప్పులు జరగకుండా మనం ఆమెకు సపోర్ట్‌గా ఉండాలంటూ నాటకం ఆడుతాడు శైలేంద్ర.
వసుధార ఆవేదన...
వసుధార కాలేజీ తరఫున ఎన్నో ప్రాజెక్ట్‌లను సక్సెస్‌ఫుల్‌గా చేసిందని మహేంద్ర బోర్డ్ మెంబర్స్‌కు గుర్తుచేస్తాడు. తనను బోర్డ్ మెంబర్స్ నిందించడం పట్ల వసుధార కూడా మనసులోనే బాధపడుతుంది. మనిషి నైజమే అంత ఒక తప్పు చేస్తే అప్పటివరకు చేసిన మంచి మొత్తం మరచిపోతారని ఆవేదనకు లోనవుతుంది. రిషి వస్తే ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని, అతడు ఏమయ్యాడో చెప్పాలని మినిస్టర్‌తో పాటు బోర్డ్ మెంబర్స్ అంటారు.
వారి ప్రశ్నలకు వసుధార మౌనంగా ఉండిపోతుంది. రిషికి చాలా మంది శత్రువులు ఉన్నారని, అతడి చుట్టూ ప్రమాదాలు పొంచి ఉన్నాయని, వాటి నుంచి తప్పించుకునే క్రమంలో మాకు కాంటాక్ట్‌లో లేకుండా పోయాడని మినిస్టర్‌కు బదులిస్తాడు మహేంద్ర. రిషి వస్తేనే ఈ సమస్య కొలిక్కి వస్తుందని మినిస్టర్ అంటాడు. అప్పటివరకు ఎండీ బాధ్యతల్ని వేరే వాళ్లకు అప్పగిస్తే మంచిదని బోర్డ్ మెంబర్స్ మినిస్టర్‌తో అంటారు. వసుధారనే ఆ సీట్‌లో కొనసాగితే కాలేజీ పతనం మొదలైనట్లేననితీర్మాణిస్తారు.
శైలేంద్ర ప్లాన్...
వసుధారకు సపోర్ట్ చేస్తున్నట్లుగానే నటిస్తూ ఆమెలోని తప్పుల్ని మరిన్ని బయటపెడతాడు శైలేంద్ర. వసుధార ఎండీగా కొనసాగితే ఎగ్జామ్స్ సరిగా జరగకపోవచ్చు. స్టూడెంట్స్ గొడవలు చేయచ్చు. కాలేజీ పేరు పేపర్లలో, టీవీల్లో ఎక్కొచ్చు. కానీ అవన్నీ జరుగుతాయని వసుధారకు సపోర్ట్ ఇవ్వకుండా ఉంటామా అంటూ బోర్డ్ మెంబర్స్‌లో అనుమానాలు మరింత పెంచుతాడు శైలేంద్ర.
ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎండీ బాధ్యతల నుంచి వసుధారను తొలగించాలని బోర్డ్ మెంబర్స్ గొడవచేస్తారు. ఆమె రిజైన్ చేస్తేనే కాలేజీలో ఏ సమస్యలు ఉండవని అంటుంది. వసుధారను ఎండీ పదవి నుంచి దిగిపోవడం ఖాయమని శైలేంద్ర లోలోన ఆనందపడతాడు.
మినిస్టర్ సపోర్ట్...
మినిస్టర్ మాత్రం వసుధారకే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండీగా వసుధార కంటే మరెవరూ సమర్థులు కనిపించడం లేదు. ఇది నా అభిప్రాయం అని శైలేంద్రకు షాకిస్తాడు మినిస్టర్. ఏమంటావు అని శైలేంద్ర ఓపినియన్ అడుగుతాడు. మరోదారి లేకపోవడంతో ఎండీగా వసుధారే కరెక్ట్ అంటూ మినిస్టర్‌తో అంటాడు శైలేంద్ర. ఆ తర్వాత కాలేజీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని వసుధారతో పాటు మహేంద్ర, ఫణీంద్రలకు చెబుతాడు మినిస్టర్. రిషి వారం రోజుల్లో తిరిగివస్తాడని తన తరఫున స్టూడెంట్స్‌కు చెప్పమని అంటాడు.
రాజీవ్‌కు రిక్వెస్ట్...
ఆ తర్వాత రాజీవ్‌ను కలిసి శైలేంద్ర....వసుధార ఇంటికి పదేపదే వెళ్లొద్దని చెబుతాడు. వారికి పట్టుబడితే నువ్వు, నేను నామరూపాలు లేకుండాపోతామని, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తాడు. కానీ శైలేంద్ర సలహాలను రాజీవ్ పట్టించుకోడు. వసుధారను చూడకుండా ఉండలేనని అంటాడు. కొన్నాళ్లు ఓపిక పడితే వసుధార నీ సొంతం అవుతుంది రాజీవ్‌ను బతిమిలాడుతాడు శైలేంద్ర.
రాజీవ్‌ను సెలైంట్‌గా ఉంచడం ఎవరి తరం కాదంటూ శైలేంద్రకు బదులిస్తాడు. శైలేంద్ర పదే పదే రిక్వెస్ట్ చేయడంతో కొన్నాళ్లు వసుధారను కలవకుండా ఉండటానికి ప్రయత్నిస్తానని రాజీవ్ అంటాడు. రిషి గురించి రాజీవ్ ఏం మాట్లాడకపోవడంతో శైలేంద్ర షాకవుతాడు. రాజీవ్ దగ్గరే రిషి ఉన్నాడా? మరెవరైనా కిడ్నాప్ చేశారా అని అనుకుంటాడు. మరోవైపు రిషి గురించి తనను శైలేంద్ర ఎందుకు అడగలేదు, రిషి ఏమయ్యాడు అని రాజీవ్ కూడా మనసులో అనుకుంటాడు.
బోర్డ్ మెంబర్స్ పదే పదే మాటలు మారుస్తూ వసుధారను తప్పుపట్టడం మహేంద్ర తట్టుకోలేకపోతాడు. శైలేంద్ర వల్లే వారు ఇలా మారిపోయాని వసుధార అంటుంది. ఎండీ సీట్ కోసమే శైలేంద్ర వారితో కలిసి ఈ నాటకం ఆడుతున్నాడని మహేంద్రతో అంటుంది వసుధార. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.