Guppedantha Manasu Serial: దేవ‌యానిని అడ్డంగా బుక్ చేసిన వ‌సు - ఒక్క‌టైన మ‌ను, అనుప‌మ - రాజీవ్ డ్రామాకు పుల్‌స్టాప్‌-guppedantha manasu may 2nd episode vasudhara recollect rishi memories guppedantha manasu today serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Serial: దేవ‌యానిని అడ్డంగా బుక్ చేసిన వ‌సు - ఒక్క‌టైన మ‌ను, అనుప‌మ - రాజీవ్ డ్రామాకు పుల్‌స్టాప్‌

Guppedantha Manasu Serial: దేవ‌యానిని అడ్డంగా బుక్ చేసిన వ‌సు - ఒక్క‌టైన మ‌ను, అనుప‌మ - రాజీవ్ డ్రామాకు పుల్‌స్టాప్‌

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2024 07:23 AM IST

Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రాజీవ్‌ను హ‌త్య చేసిన కేసులో మ‌ను జైలుకు వెళ‌తాడు. కానీ రాజీవ్ మాత్రం బ‌తికే ఉంటాడు. వ‌సుధారను చూడ‌టానికి ఆమె ఇంటికి అర్థ‌రాత్రి ర‌హ‌స్యంగా వ‌స్తాడు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu Serial: రాజీవ్‌ను మ‌ను హ‌త్య చేయ‌లేద‌ని వ‌సుధార‌, మ‌హేంద్ర‌తో పాటు అనుప‌మ న‌మ్ముతారు. మ‌ను ఇప్పుడే కాదు..ఎప్పుడు ఏ త‌ప్పు చేయ‌డు..చేయ‌లేడ‌ని మ‌హేంద్ర అంటాడు. మ‌ను గురించి నాకు బాగా తెలుసున‌ని అంటాడు. అవును నీది, మ‌నుది ర‌క్త సంబంధం లాంటి బంధ‌మ‌ని మ‌హేంద్ర‌తో అంటుంది పెద్ద‌మ్మ‌.

మ‌ను మ‌హేంద్ర కొడుకు అనే నిజాన్ని ఇన్‌డైరెక్ట్‌గా బ‌య‌ట‌పెడుతుంది. కానీ పెద్ద‌మ్మ మాట‌ల వెనుక ఉన్న మ‌ర్మాన్ని మ‌హేంద్ర అర్థం చేసుకోలేక‌పోతాడు మాది ర‌క్త సంబంధం కాక‌పోయినా మ‌నును ద‌త్త‌త తీసుకోవాల‌ని అనుకున్నాన‌ని, కానీ త‌న‌కు అదృష్టం లేద‌నిపిస్తోంద‌ని మ‌హేంద్ర బాధ‌ప‌డ‌తాడు. మ‌ను లాంటి మంచి వ్య‌క్తికి తండ్రి అయ్యే యోగ్య‌త ఉండాల‌నే ఎన్నో జ‌న్మ‌ల పుణ్యం చేసుకోవాల‌ని మ‌హేంద్ర అంటాడు.

వ‌సు మ‌న‌సులో భారం...

త‌మ కుటుంబంలో ఏం జ‌రుగుతుందో అర్థం కాక వ‌సుధార బుర్ర వేడ‌క్కిపోతుంది. మ‌ను త‌న క‌న్న కొడుకే అనే నిజం మ‌హేంద్ర‌కు తెలిస్తే అత‌డు ఎలా రియాక్ట్ అవుతాడోన‌ని ఆలోచిస్తుంది. మ‌ను జీవితానికి సంబంధించి అనుప‌మ‌, పెద్ద‌మ్మ మ‌రేదో ర‌హ‌స్యాన్ని దాచుతున్నార‌ని అనుమాన‌ప‌డుతుంది. రిషి ఫొటో తీసుకొని త‌న గుండెల‌పై పెట్టుకుంటుంది. త‌న‌కు వ‌చ్చిన అనుమానాల‌ను రిషి ఫొటోతో చెప్పుకుంటూ మ‌న‌సులోని భారాన్ని దించుకుంటుంది.

రాజీవ్ ఎంట్రీ...

వ‌సుధార గాఢ నిద్ర‌లో ఉండ‌గా ఆమె ఇంట్లోకి రాజీవ్ వ‌స్తాడు. ఒక్క‌సారిగా నిద్ర‌లో నుంచి లేచిన వ‌సుధార చుట్టు ప‌క్క‌ల చూస్తుంది. ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌హేంద్ర‌ను పిలుస్తుంది. ఇంట్లోకు ఎవ‌రో వ‌చ్చార‌ని అంటుంది. డోర్ లాక్ చేసి ఉండ‌టంతో ఆమె మాట‌ల‌ను మ‌హేంద్ర న‌మ్మ‌డు. ఎవ‌రూ రాలేద‌ని అంటాడు. వ‌సుధార‌కు క‌నిపించ‌కుండా మాయ‌మైపోతాడు రాజీవ్‌.

బెయిల్ దొర‌క‌డం క‌ష్టం...

మ‌నుకు బెయిల్ దొర‌క‌డం క‌ష్ట‌మ‌ని లాయ‌ర్ అంటాడు. కేస్ ఫైల్‌లో ఉన్న ఆధారాలు అన్ని మ‌నుకు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని అంటాడు. మీరే ఈ హ‌త్య చేశారు అని అన్ని సాక్ష్యాలు నిరూపిస్తున్నాయ‌ని చెబుతాడు. మ‌నును ఈ కేసు నుంచి త‌ప్పించ‌డం ఎవ‌రి వ‌ల్ల కాద‌ని, చివ‌ర‌కు ఆ దేవుడు కూడా మ‌నును ఏం చేయ‌లేడ‌ని పోలీస్ ఆఫీస‌ర్ అంటాడు.

అనుప‌మ ఎమోష‌న‌ల్‌...

పోలీస్ ఆఫీస‌ర్ చెప్పిన మాట‌లు విని అనుప‌మ క‌న్నీళ్లు ఆపుకోలేక‌పోతుంది. త‌ల్లి త‌న‌పై ప్రేమ‌ను కురిపించ‌డం చూసి మ‌ను మ‌న‌సు సంతోషంతో నిండిపోతుంది. అత‌డి పెదాల‌పై చిరున‌వ్వు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. మ‌నును జైలు నుంచి విడిపించి ఆ న‌వ్వును శాశ్వ‌తం చేయాల‌ని మ‌హేంద్ర అనుకుంటాడు. ఇంత‌లోనే వ‌సుధార క‌ళ్ల ముందు రాజీవ్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. అత‌డిని మ‌హేంద్ర‌కు చూపించేలోపు మాయ‌మైపోతాడు.

దేవ‌యాని ఎంట్రీ...

అనుప‌మ వెతుక్కుంటూ దేవ‌యాని వ‌స్తుంది. ఆమెను చూడ‌టం తోనే మీరెందుకు వ‌చ్చార‌ని వ‌సుధార ఫైర్ అవుతుంది. అనుప‌మ‌ను ఓదార్చ‌డానికి వ‌చ్చాన‌ని దేవ‌యాని బ‌దులిస్తుంది. ఎవ‌రికి రానీ క‌ష్టం నీకు వ‌చ్చింద‌ని, మ‌నుకు బెయిల్ రావ‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నార‌ట‌ క‌దా అంటూ అనుప‌మ బాధ‌ను త‌న మాట‌ల‌తో మ‌రింత పెంచుతుంది. రాజీవ్‌ను మ‌నునే మ‌ర్డ‌ర్ చేశాడ‌ని ఆధారాలు చెబుతున్నాయ‌ని, నిజాన్ని గ్ర‌హించ‌మ‌ని, నువ్వు అనుకున్న‌ది త‌ప్పు అంటూ అనుప‌మ ఆలోచ‌న‌ల్ని కొట్టిప‌డేస్తుంది దేవ‌యాని.

నాన్న అని పిలిచే యోగం...

మ‌నుకు త‌న తండ్రి ఎవ‌రో ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌లేదు. మ‌నుకు తండ్రి లేని లోటును తీర్చేందుకు మ‌హేంద్ర ప్ర‌య‌త్నిస్తే చివ‌రి నిమిషంలో పోలీసులు వ‌చ్చి ద‌త్త‌త కార్య‌క్ర‌మాన్ని ఆపేశారు. మ‌నుకు నాన్న అని పిలిచే యోగం లేన‌ట్లు ఉంద‌ని అంటుంది. ఆమె మాట‌ల్ని అనుప‌మ అడ్డుకుంటుంది. అవ‌స‌రంగా మాట‌లు జారితే బాగుండ‌ద‌ని వార్నింగ్ ఇస్తుంది.

వ‌సుధార కోస‌మే...

వ‌సుధార కోస‌మే రాజీవ్‌ను మ‌ను హ‌త్య చేసి ఉంటాడ‌ని దేవ‌యాని అంటుంది. వ‌సుధార‌పై మ‌ను మ‌న‌సు ప‌డ్డాడ‌ని రాజీవ్‌కు అనిపించి ఉండొచ్చు. ఆ విష‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్లు ఉంద‌ని, వ‌సుధార విష‌యంలో త‌న‌ను నిల‌దీసినందుకు రాజీవ్‌ను మ‌ను హ‌త్య చేశాడ‌ని అనుప‌మ‌తో అంటుంది దేవ‌యాని. ఆమె మాట‌ల‌ను అనుప‌మ స‌హించ‌లేక‌పోతుంది. దేవ‌యానికి కొట్ట‌డానికి చెయ్యేత్తుతుంది. దేవ‌యానిని అనుప‌మ కొట్ట‌కుండా వ‌సుధార అడ్డుకుంటుంది. దేవ‌యానిని కొట్టి మిమ్మ‌ల్ని మీరు త‌క్కువ చేసుకోవ‌ద్ద‌ని అంటుంది.

అనుప‌మ వార్నింగ్‌...

వ‌సుధార చెప్పింది కాబ‌ట్టే ఈ సారి వ‌దిలిపెడుతున్నాన‌ని దేవ‌యానిని హెచ్చ‌రిస్తుంది అనుప‌మ‌. ఇంకోసారి మా గురించి త‌ప్పుగా మాట్లాడితే ఎవ‌రూ చెప్పిన విన‌ను. నా గురించి నీకు బాగా తెలుసుగా, జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని దేవ‌యానికి వార్నింగ్ ఇస్తుంది అనుప‌మ‌.

వ‌సుధార ప్లాన్‌...

దేవ‌యానికి బుద్ది చెప్ప‌డానికి ఆమె అనుప‌మ‌తో అన్న మాట‌ల‌ను రికార్డ్ చేసి ఆ వీడియోను ఫ‌ణీంద్ర‌కు పంపిస్తుంది వ‌సుధార‌. దేవ‌యాని కోసం ఫ‌ణీంద్ర కోపంగా ఎదురుచూస్తుంటాడు. ఇంట్లో అడుగుపెట్ట‌డంతోనే ఆమెపై ఫైర్ అవుతాడు. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని దేవ‌యాని బుకాయిస్తుంది.

కానీ వ‌సుధార ఇంట్లో దేవ‌యాని చేసిన గొడ‌వ తాలూకు వీడియోను ఆమెకు చూపిస్తాడు ఫ‌ణీంద్ర‌. ఆ వీడియో చూసి కూడా దేవ‌యాని మాత్రం త‌గ్గ‌దు. తాను మాట్లాడిన దాంట్లో ఏ త‌ప్పు లేద‌ని అంటుంది. దేవ‌యాని మాట‌ల‌ను స‌హించ‌ని ఫ‌ణీంద్ర ఆమె చెంప‌పై గ‌ట్టిగా ఒక్క‌టి కొడ‌తాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

IPL_Entry_Point