తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 6th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ కాదని తేల్చేసిన కావ్య- సీసీ కెమెరాతో బయటపడిన నిజం- కోటితో స్వప్న కారు

Brahmamudi May 6th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ కాదని తేల్చేసిన కావ్య- సీసీ కెమెరాతో బయటపడిన నిజం- కోటితో స్వప్న కారు

Sanjiv Kumar HT Telugu

06 May 2024, 7:37 IST

  • Brahmamudi Serial May 6th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 6వ తేది ఎపిసోడ్‌లో సీసీ కెమెరా మూడు గంటల ఫుటేజ్‌ను రాజ్ డిలీట్ చేశాడని వాచ్ మెన్ కావ్యకు చెబుతాడు. దాంతో దాన్ని రికవరీ చేస్తారు. అందులో రాజ్ బిడ్డ కాదని కావ్యకు తెలిసిపోతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మే 6వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 6వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ మే 6వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్ సర్, మాయ మేడమ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్లను చూడగానే నాకు అనుమానం వచ్చి వినడం మొదలు పెట్టాను అని కేర్ సెంటర్ అతను చెబుతాడు. ఏం మాట్లాడుకున్నారు అని కావ్య అడుగుతుంది. దాంతో అప్పుడు జరిగింది చూపిస్తారు. ఈవిడ ఏంటీ రోజు బాబును ఇక్కడ వదిలేసి వెళ్లేది. ఈవేళ సెంటర్‌లో వదలకుండా ఇక్కడ ఏం చేస్తుంది అని అనుకుంటాడు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

Karthika Deepam Chandu: కార్తీక దీపం చందు ఆత్మ‌హ‌త్య - ప‌విత్ర జ‌యరాం చ‌నిపోయిన ఐదు రోజుల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

బిడ్డకు న్యాయం

బెదిరించడానికి వచ్చావా అని రాజ్‌ను మాయ అడుగుతుంది. బెదిరించడం ఆపమని చెప్పటానికి వచ్చాను అని రాజ్ అంటాడు. అలా ఆపితే నాకు నా బిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది అని మాయ అంటుంది. జరిగిందంతా మర్చిపో.. జరగాల్సింది నేను చూసుకుంటాను అని రాజ్ అంటాడు. ఎంతకాలం ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా నిందలు మోస్తూ బతకాలి. ఇప్పుడు నువ్ వచ్చి మాత్రం ఏం సాధిస్తావ్ అని మాయ అంటుంది.

అది విన్న కేర్ సెంటర్ అతను షాక్ అవుతాడు. నాకు ఇంకా ఏ దారి లేదు. ఈ బిడ్డతోపాటు మీ ఇంటికి వచ్చి జరిగిందంతా చెబుతాను. నేను ఇప్పటికే ఆలస్యం చేశాను అని మాయ అంటుంది. అలా తొందరపడకు. దయచేసి ఏ గొడవ చేయకు అని రాజ్ బతిమిలాడుతాడు. దీనికి తప్పకుండా ఏదో ఒక దారి వెతుకుతాను అని రాజ్ అంటాడు. మళ్లీ నన్ను మోసం చేయాలని చూస్తున్నారా. మర్యాదగా నన్ను నా బిడ్డను తీసుకెళ్లి ఇంట్లో వాళ్లకు అప్పజెప్పాలి. ఈ బిడ్డను వారసుడిగా పరిచయం చేయాలి అని మాయ అంటుంది.

మీడియా ముందుకు వెళ్తాను

అంతా నువ్ అనుకున్నట్లే జరుగుతుంది. కానీ, ఓపిక పట్టు. ఒకేసారి బిడ్డతోపాటు నిన్ను తీసుకెళ్తే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇప్పుడు నువ్ కోరుకుంటున్నట్లుగానే బిడ్డను మా ఇంటికి తీసుకెళ్లి ఇంటి వారసుడిగా చేస్తాను. ఆ తర్వాత సమయం చూసి నిన్ను కూడా తీసుకెళ్తాను. ప్రస్తుతం నన్ను నమ్మటం తప్పా నీకు ఇంకో దారి లేదు అని రాజ్ అంటాడు. సరే మాట మార్చినా. నా బిడ్డకు ఎలాంటి హాని తలపెట్టినా నేను సాక్ష్యాధారలతో సహా మీడియా ముందుకు వెళ్తాను అని మాయ అంటుంది.

అలాంటి పరిస్థితి నీకు ఎప్పటికీ రాదు. నాది హామీ. నేను మాటిస్తున్నాను అని చెప్పిన రాజ్ బిడ్డను తీసుకుంటాడు. అదంతా చెప్పిన కేర్ సెంటర్ అతను అప్పుడు అర్థమైంది మేడమ్.. రాజ్ సర్‌కి మాయ మేడమ్‌కు పుట్టిన ఇల్లీగల్ బిడ్డ అని అంటాడు. దాంతో కావ్య, అప్పు షాక్ అవుతారు. రాజ్ సర్‌ను చూస్తే చాలా డబ్బున్న వాడిలా కనిపించాడు. బ్లాక్ మెయిల్ చేస్తే బాగా డబ్బు వస్తుందని కక్కుర్తి పడ్డారు. కానీ, రాజ్ సర్ చాలా మంచివారు. నన్ను ఏమైనా చేసే పవర్ ఉన్న అడిగినంత డబ్బు ఇచ్చి వార్నింగ్‌ ఇచ్చారు అని కేర్ సెంటర్ అతను చెబుతాడు.

వెళ్లి కడిగేయ్..

ఆ మాయ ఎక్కడుందో మీకు తెలుసా అని కావ్య అడిగితే.. కేర్ సెంటర్ అతను తెలీదని, ఆమె ఇచ్చిన అడ్రస్, ఫోన్ నెంబర్ అంతా ఫేక్ అని చెబుతాడు. దాంతో అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోతారు కావ్య, అప్పు. ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. నువ్ బావ మీద అంతనమ్మకం పెట్టుకుంటే ఇలా మోసం చేశాడేంటీ. ఇంట్లోకి వెళ్లి కడిగేయ్ అని అప్పు అంటుంది. మనకు నిజం పూర్తిగా తెలియలేదు అని కావ్య అంటుంది.

ఆరోజు ఆయన కళ్లలో ఓ నిజం చూశాను. ఈరోజు నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాను అన్నారు. కానీ, నిజం చెబుతాను అనలేదు. శ్వేత నాకు చెప్పింది. ఆరోజు నాతో మనసు విప్పి మాట్లాడాలనుకున్నారట. ఆఫీస్‌కు వెళ్లేవరకు ఆయనకు బిడ్డ గురించి తెలియదు. ఆఫీస్‌లోనే ఏదో తప్పు జరిగింది. అది తెలియాలంటే మనం ఆఫీస్‌కు వెళ్లాలి అని కావ్య, అప్పు వెళ్తారు. మరోవైపు వడ్డీ వ్యాపారి రావడం గురించి తల పట్టుకుంటారు రాహుల్, రుద్రాణి.

లాకర్‌లో సేఫ్‌గా

అసలు వాడు ఎందుకు పేపర్స్ తెచ్చి ఇచ్చాడురా అని రుద్రాణి అంటే.. చెప్పాడుగా స్వప్న భక్తురాలు అని రాహుల్ అంటాడు. వాడు చెబితే నమ్ముతావా. స్వప్న ఏదో చేసింది అని రుద్రాణి అంటే.. దానిబొంద.. దానికన్ని తెలివితేటలు లేవు అని రాహుల్ అంటాడు. దాన్ని తక్కువగా అంచనా వేయకు రుద్రాణి అంటే.. ఇప్పుడు దాని గురించి కాదు ఆలోచించాల్సింది. వాడు కోటి తిరిగి ఇవ్వమంటున్నాడు. ఎక్కడ డబ్బు దాచావ్ అని రాహుల్ అడుగుతాడు.

లాకర్‌లో సేఫ్‌గా ఉందని రుద్రాణి అంటుంది. వెంటనే ఇచ్చేద్దామని రాహుల్ అంటే.. ఇంతలో స్వప్న ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ వస్తుంది. తన స్టేటస్‌కు తగినట్లు కనీసం కోటి రూపాయల కారు కావాలని, అంతా సింగిల్ పేమెంట్ చేస్తానని కావాలనే తల్లీకొడుకులు వినాలని గట్టిగా చెబుతుంది. అది విని ఇద్దరూ షాక్ అవుతారు. వెంటనే అనుమానంతో వెళ్లి లాకర్ ఓపెన్ చేస్తారు. బ్రీఫ్ కేస్‌లో పంగ నామం పెట్టిన పేపర్ ఉంటుంది.

మన డబ్బే కొట్టేసింది

అది చూసి గోవిందా.. గోవిందా.. అని రాహుల్ కుప్పకూలిపోతాడు. అది మన డబ్బును కొట్టేసి కారు కొంటుంది అని రాహుల్ అంటాడు. అది నా డబ్బే కొట్టేస్తుందా. దాని అంతు చూస్తాను అని వెళ్తుంది రుద్రాణి. దాంతో రాహుల్ ఆపి.. డబ్బు గురించి అడిగితే వడ్డీ వ్యాపారి సంగతి మొత్తం బయటకు వస్తుందని రాహుల్ అంటాడు. అది మనకు మత్తు మందు పెట్టి డ్యాన్స్ ఆడించి మన డబ్బే కొట్టేసింది. ఇప్పుడు నోరు మూసుకుని ఉండాల్సిందే అని రుద్రాణి అంటుంది.

టెక్నికల్‌గా చెప్పాలంటే అది మన డబ్బు కాదు. దాని పేపర్స్‌తో తెచ్చాం కాబట్టి దాని డబ్బే అని రాహుల్ అంటాడు. లాస్‌లో ఉన్నప్పుడు లాజిక్‌లు మాట్లాడావంటే లాన్‌లో ఉరేసి చంపుతా అని రుద్రాణి అంటుంది. దాని పేపర్స్ దానికి వచ్చాయి, కోటి రూపాయలు కూడా దానికే వెళ్లాయి అని రుద్రాణి అంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ కోటి మనమే కట్టాలి. లేకుంటే వాడు వచ్చి నిజం చెబితే మనం రోడ్డు పడతాం. ఏదైనా ప్లాన్ ఉంటే ఫోన్ చేయి వస్తాను అని వెళ్లిపోతాడు రాహుల్.

సీసీ కెమెరా చూడండి

ఆ స్వప్నను ఊరికే వదిలిపెట్టను అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు ఆఫీస్‌కు కావ్య, అప్పు వెళ్తారు. శ్రుతిని వాళ్ల పెళ్లి రోజు ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది కావ్య. లేదని శ్రుతి అంటుంది. ఆఫీస్‌లో అందరిని అడిగితే.. లేదని చెబుతారు. ఇంతలో వాచ్‌మెన్ కనిపిస్తే.. వెళ్లి అడుగుతారు. ఎవరు రాలేదని అంటాడు వాచ్ మెన్. నువ్ నిజం చెప్పట్లేదని, సరిగా వర్క్ చేయలేదని అప్పు అంటుంది. తను చెప్పేది నిజమే అని కావాలంటే సీసీ కెమెరా చూడమని చెబుతాడు వాచ్ మెన్.

దాంతో వెళ్లి వాచ్ మెన్ సీసీ కెమెరా చూపిస్తాడు. అది చూసి షాక్ అయిన కావ్య.. ఏంటిది మూడు గంటల ఫుటేజ్ డిలీట్ అయింది ఏంటని అడుగుతుంది. అదంతా ఎవరు డిలీట్ చేశారో నాకు తెలుసు. రాజ్ సర్ డిలీట్ చేశారని, అది డిలీట్ చేసి హడావిడిగా వెళ్లిపోయారు అని వాచ్ మెన్ అంటాడు. దాంతో షాక్ అయిన కావ్య ఆ మూడు గంటల్లోనే ఏదో తప్పు జరిగింది. అది బయటపడకూడదనే వాంటెడ్‌గా డిలీట్ చేసి వెళ్లారని కావ్య అంటుంది.

హార్డ్ డిస్క్ రికవరీ చేయొచ్చు

హార్డ్ డిస్క్ ఉంటే రికవరీ చేయవచ్చని అప్పు చెబుతుంది. దాంతో వాచ్ మెన్ దగ్గర హార్డ్ డిస్క్ తీసుకుంటారు. తొందరగా కిట్టు దగ్గర ఫుటేజ్ రికవరీ చేయించు అని అప్పుకు కావ్య చెబుతుంది. కట్ చేస్తే.. ఇంట్లో అంతా డిన్నర్‌కు కూర్చుంటారు. రాజ్ వచ్చి కూర్చుంటే అపర్ణ లేస్తుంది. ఎందుకు లేచారు. నిజంగా తెలియదు. ఇప్పుడు ఆయనతో కలిసి భోజనం చేస్తే ప్రళయం వస్తుందా. మీరు వెళ్లిపోతే ఆయన తృప్తిగా భోజనం చేస్తారా. ఆయన నా భర్త అని అపర్ణను నిలదీస్తుంది కావ్య.

కళావతి అని రాజ్ అంటే.. నేను ఏమైనా తప్పు మాట్లాడానా అని కావ్య అంటుంది. నిజం మాట్లాడవమ్మా. తినే చోట కూడా మాతృత్వం మంటగలిసిపోతుంటే ప్రశ్నించావ్. నవ్ తినకుండా వాడు తినకుండా ఇలా ఎన్నాళ్లు అని సుభాష్ అంటాడు. రెండు రోజులు. వాడికి ఇచ్చిన గడువు పూర్తవుతుంది. ఇక వాడు నిజం చెప్పడని అర్థమైంది. అందుకే ఇంట్లో నుంచి వెలివేయడమే అని అపర్ణ. వెలివేస్తారా.. వెలివేసి మీ వారసత్వాన్ని మీరే దూరం చేసుకుంటారా అని కావ్య అడుగుతుంది.

నన్ను పోషించగలడు

నువ్వెందుకు ఇంతలా అడుగుతున్నావ్ అని అపర్ణ అంటుంది. ఇంకెందుకు రాజ్ వెళ్లిపోతే తను కూడా వెళ్లిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఆస్తి అనుభవించలేదు కదా అని రుద్రాణి అంటుంది. పుట్టింటికి వచ్చి ఉన్న మీరు ఆ మాట అనకూడదు. ఇన్నాళ్లు నేను ఇక్కడ ఏం ఆస్తి అనుభవించాను. పట్టెడు అన్నం అంతేగా. ఆయన ఆ మాత్రం నన్ను పోషించగలడు అని కావ్య అంటుంది. అసలు ఇప్పటివరకు నువ్ ఇలా ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉంది అని రుద్రాణి అంటుంది.

నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. మొగుడుతో తెగదెంపులు చేసుకుని నీలా పుట్టింటికి వచ్చి ఉన్నట్లు తను వెళ్లనందుకు నాకు ఆశ్చర్యంగానే ఉంది. భర్త తప్పు చేశాడని తెలిసి.. అందరిలా నిలదీయకుండా కుంగిపోకుండా కుమిలిపోకుండా ఆత్మ స్థైర్యంతో ఉన్నందుకు ఆశ్చర్యంగానే ఉంది. తన సహనానికి, లోకంలో నీలాంటి వాళ్లే కాకుండా తనలాంటి గుణవంతులు కూడా ఉంటారని తెలిసి ఆశ్చర్యపోతున్నాను కావ్య గురించి గొప్పగా చెబుతాడు సుభాష్.

రుద్రాణికి గడ్డి పెట్టిన అన్నయ్య

దానికి పెద్దన్నయ్య అని రుద్రాణి కోపంగా అంటే.. చాలు ఆపు. అభినందించడం ఆపేసి.. నిందిస్తావా. ఆస్తి కోసం ఉంటుందంటావా. నా కోడలిని అనే హక్కు నీకు లేదు. నోరు మూసుకుని తిను అన్నం అని సుభాష్ అంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో అప్పుకు కాల్ చేసి పని జరిగిందా అని అడుగుతుంది కావ్య. కిట్టుగాడిని టార్చర్ పెట్టి రికవరీ చేయించా. నేను ఆల్రెడీ నీ మెయిల్ డ్రైవ్ సెండ్ చేశాను. ఓపెన్ చేసి చూడు అని అప్పు చెబుతుంది. దాంతో వెళ్లి ల్యాప్ టాప్ ఓపెన్ చేసి ఫుటేజ్ చూస్తుంది కావ్య.

అది చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది కావ్య. మరోవైపు రాజ్ ఏదో ఆలోచిస్తుంటాడు. అంటే ఆ బిడ్డ ఆయన బిడ్డ కాదన్నమాట అని కావ్య అనుకుంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం