తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Zaheer Khan On Suryakumar: సూర్యకుమార్ బౌలర్ల సైకాలజీతో ఆడుకుంటాడు.. జహీర్ సంచలన వ్యాఖ్యలు

Zaheer Khan on Suryakumar: సూర్యకుమార్ బౌలర్ల సైకాలజీతో ఆడుకుంటాడు.. జహీర్ సంచలన వ్యాఖ్యలు

13 May 2023, 14:49 IST

    • Zaheer Khan on Suryakumar: ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై జహీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు బౌలర్ల సైకాలజీతో ఆడుకుంటాడని అన్నాడు. అతడి ఆట తీరు రోజు రోజుకు ఎంతో మెరుగుపడిందని స్పష్టం చేశాడు.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (MI Twitter)

సూర్యకుమార్ యాదవ్

Zaheer Khan on Suryakumar: గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సూర్యుకుమార్ యాదవ్ సెంచరీతో విజృంభించిన వేళ.. ముంబయి ఖాతాలో మరో విజయం చేరింది. ఈ మ్యాచ్‌లో సూర్య 49 బంతుల్లో 103 పరుగులతో ఆకట్టుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన సూర్యకుమార్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ కూడా స్పందించాడు. సూర్యకుమార్ బౌలర్ల సైకాలజీతో ఆడుకుంటాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"సూర్యకుమార్‌ను మొదటి నుంచి పరిశీలిస్తే రోజు రోజుకు మెరుగుపడుతున్నాడు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సమయం ఏ జట్టుకైనా చాలా ముఖ్యం. టోర్నీ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే అత్యుత్తమంగా ఆడాలి. సూర్య లాంటి ఆటగాళ్లు ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఈ సీజన్ ఆరంభంలో ముంబయి స్థానం.. ఇప్పుడు ఆ జట్టు పొజిషన్ చూస్తే మీకే తెలుస్తుంది." అని జహీర్ ఖాన్ అన్నాడు.

"సూర్యకుమార్ బౌలర్ల సైకాలజీతో ఆడుకుంటాడు. మైదానంలో ఆ రకంగా బంతులను స్టాండ్స్‌కు పంపిస్తున్నాడు. ముఖ్యంగా గుజరాత్‌తో మ్యాచ్‌లో కామ్ బ్యాటింగ్ చేస్తూ మరోసారి విధ్వంసం సృష్టించాడు. అతడి అప్రోచ్ చాలా బాగుంది. మైదానంలో నలువైపులా బ్యాటింగ్ చేస్తూ 49 బంతుల్లోనే 103 పరుగులు చేసి తనదైన సిగ్నేచర్ స్టైల్‌లో సెలబ్రేషన్‌తో ముగించాడు." అని జహీర్ ఖాన్ స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ గుజరాత్‌పై 27 పరుగుల తేడాతో గెలిచింది. 218 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్.. టాపార్డర్ విఫలం కాగా..స్పిన్నర్ రషీద్ ఖాన్ తన భీకర ప్రదర్శనతో చివరి వరకు పోరాడాడు. 32 బంతుల్లో 79 పరుగులు చేసినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో అదరగొట్టాడు. 4 వికెట్లుతో పాటు అర్ధశతకంతో రాణించాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ 3 వికెట్లు తీయగా.. కుమార్ కార్తికేయ, పియూష్ చావ్లా చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.