Suryakumar Maiden IPL ton: 'సూర్య' ప్రతాపం.. గుజరాత్‌పై సెంచరీతో కదం తొక్కిన మిస్టర్ 360
Suryakumar Maiden IPL ton: గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో కదం తొక్కాడు. ఐపీఎల్ కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్న సూర్య అద్భుత ఫామ్‌తో విజృంభించాడు.
Suryakumar Maiden IPL ton: టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంకరై సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తున్న ఈ స్టార్ తన ఐపీఎల్ కెరీర్‌లోనే తొలి శతకాన్ని నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ విధ్వంసం సృష్టించడంతో ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. సీజన్ ఆరంభంలో వరుసగా విఫలమైన సూర్యకుమార్.. ఆ తర్వాత గాడిలో పడ్డాడు. వరుసగా అర్ధ శతకాలతో చేసుకుంటూ స్టేడియాన్ని హోరెత్తించాడు. ముంబయి ఆడిన గత ఏడు మ్యాచ్‌ల్లో ఐదు అర్ధ శతకాలు నమోదు చేశాడు. తాజాగా విజృంభించి ఐపీఎల్‌లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు.
ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబయి ఇండియన్స్.. గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ దెబ్బకు వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. 49 బంతుల్లో 103 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇందులో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 210.20 స్ట్రైక్ రేటుతో సూర్యకుమార్ బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో అతడికిదే తొలి సెంచరీ కావడం విశేషం.
సూర్యకుమార్ తన తొలి సెంచరీ చేయడంతో నెట్టింట అతడికి ప్రశంసల వర్షం వెల్లువెత్తుతోంది. విరాట్ కోహ్లీ సైతం అతడిని అభినందిస్తూ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్టోరీని పోస్ట్ చేస్తారు. సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆరంభంలో రోహిత్ శర్మ(31), ఇషాన్ కిషన్(29) ధాటిగా ఆడగా.. ఒకే ఓవర్లో ఇద్దరినీ పెవిలియన్‌కు పంపి కోలుకోలేని దెబ్బ కొట్టాడు గుజరాత్ స్పిన్న రషీద్ ఖాన్. ఆ కాసేపటికే మరో బ్యాటర్ నేహలా వధీరాను(14) కూడా ఔట్ చేశాడు. దీంతో 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చి అద్భుత ఆటతీరుతో ముంబయి భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ పోషించాడు. చివర్లో విష్ణు వినోద్(30) మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 4 వికెట్లతో విజృంభించగా.. మోహిత్ శర్మ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.