Rohit Miss IPL 2023: ఐపీఎల్‌కు రోహిత్ దూరం.. ముంబయి కెప్టెన్‌గా సూర్యకుమార్..!
Rohit Miss IPL 2023: ఈ ఐపీఎల్‌కు రోహిత్ శర్మ దూరం కానున్నాడట. క్రీడా వర్గాల సమాచారం ప్రకారం ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో ముంబయి కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
Rohit Miss IPL 2023: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు.. గతేడాది మాత్రం పూర్తి విఫలమైంది. లాస్ట్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ఈ జట్టు.. ప్లే ఆఫ్ రేసు నుంచి మిగిలినవాటికంటే ముందుగానే నిష్క్రమించింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించగా.. మిగిలినవాటిలో పరాజయం పాలైంది. దీంతో ఈ ఏడాది ఎలాగైన ఆరోసారి టైటిల్ ముద్దాడాలనే కసితో ముంబయి బరిలో దిగబోతుంది. అయితే ఆ జట్టు కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికే అందుబాటులో ఉండట్లేదు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొన్ని మ్యాచ్‌లకు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఓ ప్రముష నేషనల్ మీడియా రిపోర్టు ప్రకారం ఐపీఎల్ 2023లో కొన్ని మ్యాచ్‌లకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండట్లేదని సమాచారం. అతడి స్థానంలో ఆ మ్యాచ్‌లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడట. అంతేకాకుండా ఏ మ్యాచ్‌లకు అతడు ఆడట్లేదో వాటిని ముందుగానే ఎంచుకున్నట్లు సమాచారం. అయితే ఆడనప్పటికీ జట్టుతోనే ట్రావెల్ చేస్తూ సూర్యకుమార్‌కు అవసరమైన మార్గనిర్దేశాలు అందించనున్నాడని సమాచారం.
గత ఐపీఎల్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా అతడు చేయలేదు. ఐపీఎల్ 2023లో ముంబయి ఆడిన తన మొదటి 8 మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా పరాజయం పాలైంది. రోహిత్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 19.14 సగటుతో 268 పరుగులు చేశాడు. ఇదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ 8 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేశాడు.
అంతకుముందు మాట్లాడిన రోహిత్ శర్మ ఫిట్నెస్‌పై స్పందించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడమనేది ఆటగాళ్లపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు ఫ్రాంఛైజీల ఇష్టం. వారిని సొంతం చేసుకున్నది ఫ్రాంఛైజీలో కాబట్టి అది వారిష్టం. ప్రస్తుతం జట్లకు కొన్ని సూచలను చేశాము. కానీ చివరకు నిర్ణయమనేది ఫ్రాంఛైజీల చేతిలో ఉంటుంది. ఫిట్‌నెస్ పరంగా జాగ్రత్త వహించాలి. భారమవుతుందనుకుంటే దానిపై మాట్లాడవచ్చు. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు బ్రేక్ తీసుకోవచ్చు. అని హిట్ మ్యాన్ స్పష్టం చేశాడు.
ఇదే విషయంపై రోహిత్ శర్మను ప్రశ్నించగా.. 'నేను రెస్ట్ తీసుకోవాలా.. ఈ ప్రశ్నకు మార్క్ బౌచర్ సమాధానమిస్తాడు' ఆయనకు మైక్ ఇచ్చాడు. ముంబయి కోచ్ బౌచర్ ఈ ప్రశ్నపై స్పందిస్తూ.. "రోహిత్‌కు విశ్రాంతినిచ్చే విషయానికొస్తే అతడు కెప్టెన్. మంచి ఫామ్‌లో ఉన్నాడని అనుకుంటున్నా. అలాగే రోహిత్ విశ్రాంతి తీసుకోకూడదనే భావిస్తున్నా. అయితే విభిన్నపరిస్థితులకు అనుగుణంగా ఉంటాం. బెస్ట్‌గా ఉండాలంటే.. రోహిత్ కెప్టెన్‌గా ఆటగాడిగా ఉండాలని కోరుకుంటాను. అప్పుడు గొప్పగా ఉంటుంది. లేదా అతడు ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు విశ్రాంతి కావాలనుకుంటే కచ్చితంగా ఇస్తాము. అందులో ఎలాంటి సమస్య లేదు." అని మార్క్ బౌచర్ అన్నారు.