తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay-lokesh Kanagaraj Movie Record Deal: విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ మూవీ డిజిటల్‌ హక్కులకు భారీ మొత్తం

Vijay-Lokesh Kanagaraj Movie Record Deal: విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ మూవీ డిజిటల్‌ హక్కులకు భారీ మొత్తం

Hari Prasad S HT Telugu

26 December 2022, 16:16 IST

    • Vijay-Lokesh Kanagaraj Movie Record Deal: విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ మూవీ డిజిటల్‌ హక్కులకు భారీ మొత్తం రావడం విశేషం. ఇది సౌతిండియాలోనే సరికొత్త రికార్డుగా నిలవనుంది.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న దళపతి 67
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న దళపతి 67

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న దళపతి 67

Vijay-Lokesh Kanagaraj Movie Record Deal: తమిళ సూపర్‌ స్టార్‌ దళపతి విజయ్‌ ప్రస్తుతం వారసుడు మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానున్నట్లు చెప్పినా.. రిలీజ్ డేట్‌ మాత్రం ఇంకా అనౌన్స్‌ చేయలేదు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్‌ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas at Kannapa sets: కన్నప్ప సెట్స్‌లో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. భారీ ప్రాజెక్టులో మరో స్టార్

Hanuman TRP: టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్.. మంచి టీఆర్పీ సొంతం చేసుకున్న తేజ సజ్జ మూవీ

Vijay Deverakonda movies: విజయ్ దేవరకొండ రాబోయే మూడు సినిమాలు ఇవే.. అదిరిపోయిన పోస్టర్స్

Aavesham OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

ఈ సినిమా తర్వాత విజయ్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌తో చేయనున్నాడు. నిజానికి ఈ మూవీ షూటింగ్‌ గత నవంబర్‌లోనే ప్రారంభం కావాల్సి ఉన్నా.. వారసుడు కారణంగా ఆలస్యమైంది. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంటే ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని ఆసక్తిని రేపింది. ఈ ఏడాది కమల్‌హాసన్‌తో విక్రమ్‌లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ అందించిన లోకేష్‌ కనగరాజ్‌ ఇప్పుడ దళపతి విజయ్‌తో సినిమా చేస్తున్నాడంటే మరో సూపర్‌ హిట్‌ ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.

దీంతో ఈ సినిమా డిజిటల్‌ హక్కులకు ఎక్కడ లేని డిమాండ్‌ ఏర్పడింది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. సౌతిండియాలోనే అత్యధిక మొత్తానికి ఈ సినిమా డిజిటల్‌ హక్కులు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ విజయ్‌, లోకేష్‌ సినిమా డిజిటల్‌ హక్కులను ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకోవడం విశేషం. అన్ని భాషల డిజిటల్‌ హక్కులు ఈ డీల్‌ కింద నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

ఈ ఏడాది బీస్ట్‌ సినిమా బోల్తా కొట్టినా.. అంతకు ముందు వరుస హిట్స్‌ అందుకున్న హీరో విజయ్‌. ఇప్పుడు వారసుడుపైనా భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇక విక్రమ్‌ హిట్‌తో ఊపు మీదున్న డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. అందుకే ఈ రికార్డు డీల్‌. ఈ సినిమాలో త్రిష ఫిమేల్‌ లీడ్‌లో కనిపించనుంది. ఇక సంజయ్‌ దత్‌, పృథ్విరాజ్‌ సుకుమారన్‌లాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.