తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Trp: టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్.. మంచి టీఆర్పీ సొంతం చేసుకున్న తేజ సజ్జ మూవీ

Hanuman TRP: టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్.. మంచి టీఆర్పీ సొంతం చేసుకున్న తేజ సజ్జ మూవీ

Hari Prasad S HT Telugu

09 May 2024, 17:19 IST

    • Hanuman TRP: హనుమాన్ మూవీ టీవీల్లోనూ అదరగొట్టేసింది. ఈ మధ్యే తొలిసారి జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ అయిన ఈ మూవీని టీవీ ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించినట్లు ఈ రేటింగ్ చూస్తే స్పష్టమవుతోంది.
టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్.. మంచి టీఆర్పీ సొంతం చేసుకున్న తేజ సజ్జ మూవీ
టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్.. మంచి టీఆర్పీ సొంతం చేసుకున్న తేజ సజ్జ మూవీ

టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్.. మంచి టీఆర్పీ సొంతం చేసుకున్న తేజ సజ్జ మూవీ

Hanuman TRP: హనుమాన్ మూవీ హవా కొనసాగుతూనే ఉంది. మొదటి థియేటర్లలో, తర్వాత ఓటీటీలో, ఇప్పుడు టీవీలోనూ అదరగొట్టింది. ఏప్రిల్ 28న తొలిసారి జీ తెలుగు ఛానెల్లో ఈ మూవీ టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. అక్కడ కూడా మూవీని ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో తేజ సజ్జ నటించాడు.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

హనుమాన్ టీఆర్పీ

తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం హనుమాన్ మూవీకి జీ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లో ఏకంగా 10.26 టీఆర్పీ దక్కడం విశేషం. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో రెండంకెల టీఆర్పీ అందుకున్న తొలి సినిమా ఇదే. థియేటర్లు, ఓటీటీల్లో ఎంత పెద్ద హిట్ అయినా.. టీవీలోకి వచ్చేసరికి పెద్ద సినిమాలు కూడా బోల్తా పడుతున్నాయి.

అందుకు తాజాగా వచ్చిన సలార్ మూవీయే నిదర్శనం. ఈ సినిమా స్టార్ మాలో టెలికాస్ట్ కాగా.. కేవలం 6.5 టీఆర్పీ మాత్రమే నమోదు చేసింది. అంతకు ముందు వచ్చిన గుంటూరు కారం, నా సామిరంగ సినిమాల కంటే కూడా సలార్ కు తక్కువ టీఆర్పీ వచ్చింది. ఈ సలార్ తో పోలిస్తే హనుమాన్ మూవీకి వచ్చిన టీఆర్పీ చాలా ఎక్కువే అని చెప్పాలి.

ఈ మధ్య కాలంలో టీవీల్లోకి వచ్చిన సినిమాల్లో భగవంత్ కేసరి మాత్రం 9.86 టీఆర్పీతో హనుమాన్ కు దగ్గరగా ఉంది. ఆ తర్వాత గుంటూరు కారం మూవీ ఉంది. ఇప్పుడీ రెండు సినిమాల రికార్డును హనుమాన్ దాటేసింది.

జీ తెలుగులో హనుమాన్

హనుమాన్ మూవీ సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.330 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. తర్వాత జీ5 ఓటీటీలోకి చాలా ఆలస్యంగా వచ్చింది. ఈ సినిమా ఓటీటీతోపాటు శాటిలైట్ హక్కులను కూడా జీ నెట్‌వర్క్ దక్కించుకుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా చాలా రోజుల పాటు జీ5 ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది.

ఇక జీ తెలుగు తొలి ప్రసారంలోనే రెండంకెల టీఆర్పీ అందుకోవడం నిజంగా విశేషమే. ఏప్రిల్ 28న సాయంత్రం 5.30 గంటలకు మూవీ టెలికాస్ట్ అయింది. ఓటీటీ, ఐపీఎల్ పోటీ తట్టుకొని టీవీలోనూ హనుమాన్ దూసుకెళ్లడం మామూలు విషయం కాదు. ఈ సినిమాకు ఉన్న రేంజ్ ఎంతో దీనిని బట్టి మరోసారి స్పష్టమైంది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి సినిమా హనుమాన్. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ తో అతడు మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా రిలీజ్ కానుంది. హనుమాన్ తో తనపై భారీగా పెరిగిపోయిన అంచనాలను ప్రశాంత్ వర్మ ఎలా అందుకుంటాడో చూడాలి.

జై హనుమాన్ మూవీ కోసం యంగ్ టాలెంట్ ను ప్రశాంత్ వర్మ ఆహ్వానించాడు. నటీనటులతోపాటు సాంకేతిక నిపుణులు అయినా సరే అంటూ ఈ మధ్యే సోషల్ మీడియా ద్వారా అతడు ఈ ఆహ్వానం పంపడం విశేషం. మీకు నటన, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ ఇలా ఏదైన రంగంలో ఇంట్రెస్ట్, టాలెంట్ ఉంటే ఆ వివరాలను తాను చెప్పిన మెయిల్‌కు సెండ్ చేయమని, దాని ద్వారా పీవీసీయూలో అవకాశం పొందవచ్చని ప్రశాంత్ వర్మ నోట్ ద్వారా చెప్పాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం