తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Katrina-vicky Kaushal Divorce: కత్రీనా-విక్కీ విడాకులు తీసుకోబోతున్నారా? బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్

Katrina-Vicky Kaushal Divorce: కత్రీనా-విక్కీ విడాకులు తీసుకోబోతున్నారా? బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్

17 May 2023, 14:13 IST

    • Katrina-Vicky Kaushal Divorce: కత్రీనా-విక్కీ కౌషల్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై విక్కీ స్పందించాడు. కత్రీనాతో విడిపోయే ఆలోచనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కత్రీనా కైఫ్-విక్కీ కౌషల్
కత్రీనా కైఫ్-విక్కీ కౌషల్ (Instagram)

కత్రీనా కైఫ్-విక్కీ కౌషల్

Katrina-Vicky Kaushal Divorce: బాలీవుడ్ హాట్ కపుల్‌గా పేరుగాంచిన వారిలో కత్రీనా కైఫ్-విక్కీ కౌషల్ ముందుంటారు. కత్రీనాకు విక్కీ ఫ్యాన్ బాయ్ మాత్రమే కాకుండా.. ఆమెను విపరీతంగా ఆరాధిస్తుంటాడు. ఎన్నో వేదికలపై కత్రీనా అందం గురించి ప్రశంసల వర్షం కురింపించిన సంగతి తెలిసందే. కత్రీనాపై అన్ కండీషనల్ లవ్ చూపిస్తూ చివరకు ఆమెనే వివాహం చేసుకున్నాడు. వీరు వైవాహిక బంధంలో అడుగుపెట్టి రెండు సంవత్సరాలు కూడా కాలేదు.. అప్పుడే ఈ జంట సెపరేట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. కత్రీనా-విక్కీ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఊహాగానాలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ రొమాంటిక్ కపుల్ అప్పుడే తమ బంధానికి స్వస్తి పలకడమేంటి? అనుకుంటూ బాధపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu May 6th Episode: గుప్పెడంత మనసు- ఫిటింగ్ పెట్టిన వసుధార- శైలేంద్ర బిగ్ ట్విస్ట్- దొరికిపోయిన మహేంద్ర

Krishna mukunda murari serial: మీరా డబుల్ గేమ్ ఆడుతుందని తెలుసుకున్న కృష్ణ.. పట్టరాని సంతోషంలో ముకుంద, మురారి

Brahmamudi May 6th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ కాదని తేల్చేసిన కావ్య- సీసీ కెమెరాతో బయటపడిన నిజం- కోటితో స్వప్న కారు

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్ ..శోభ తప్పు లేదు నువ్వే దరిద్రమన్న అనసూయ.. గుండెలు పగిలేలా ఏడ్చిన దీప

విక్కీ కౌషల్ మరో అమ్మాయిని వివాహం చేసుకునేందుకు గాను.. కత్రీనాకు విడాకులు ఇవ్వబోతున్నాడనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ విషయం గురించి విలేకరులు సదరు హీరోనే అడిగారు. "మన దేశంలో పెళ్లి అనేది జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఘట్టం. జీవితాంతం గుర్తుండిపోయేది పెళ్లి. అలాంటిది మరో మంచి నటి దొరికినంత మాత్రాన కత్రీనా కైఫ్‌కు విడాకులు ఇవ్వడం న్యాయమని మీరు భావిస్తున్నారా?" అని విక్కీ కౌషల్ స్పందించాడు.

విక్కీ నటించిన జరా హక్తే జరా బాచ్‌కే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఈ అంశంపై స్పందించగా.. అతడు చెప్పిన మాటలకు హీరోయిన్ సారా అలీ ఖాన్ సహా అందరూ నవ్వుకున్నారు. తను ఇంకా చిన్నపిల్లాడినే అంటూ విక్కీ నవ్వులు పూయించాడు. "మీరు ఇప్పుడు ఏం అన్నారు? నేను సాయంత్రం ఇంటికి వెళ్లాలి. ఇలాంటి ట్విస్టెడ్ ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ఇంకా చిన్నపిల్లాడినే. ముందు నన్ను కాస్త ఎదగనివ్వండి. ఇంత ప్రమాదరమైన ప్రశ్నకు నేను ఎలా సమాధానం చెప్పగలను" అని విక్కీ క్లారిటీ ఇచ్చాడు.

విక్కీ చెప్పినదాని ప్రకారం చూస్తుంటే.. కత్రీనా కైఫ్‌తో విడాకులు ఉత్త రూమర్లేనని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ విషయంపై విక్కీ కూడా లైట్ తీసుకోవడంతో ఊహాగానాలు పటాపంచలయ్యాయి. రెండో పెళ్లిపై ఆలోచన కూడా కూడా విక్కీకి లేదని అతడి మాటల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం విక్కీ కౌషల్ జరా హక్తే జరా బచ్‌కే అనే సినిమాలో నటించాడు. ఇది కాకుండా ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, మెరా మెహబుబా మెరే సనమ్, సామ్ బహదురి లాంటి మూవీస్‌ను పూర్తి చేశాడు. దున్‌కీ అనే మరో సినిమాలో షుటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరోపక్క కత్రీనా చివరగా ఫోన్ బూత్ చిత్రంలో కనిపించింది. ఆమె నటించిన మెర్రీ క్రిస్మస్, టైగర్-3 షూటింగ్ దశలో ఉన్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.