Govinda Naam Mera Review: గోవింద నామ్ మేరా మూవీ రివ్యూ - విక్కీకౌశల్, కియారా అద్వానీ కెమిస్ట్రీ మెప్పించిందా
Govinda Naam Mera Review: విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి ఫడ్నేకర్ హీరోహీరోయిన్లుగా నటించిన గోవింద నామ్ మేరా సినిమా డైరెక్ట్‌గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందంటే..
Govinda Naam Mera Review: విక్కీ కౌశల్(Vicky Kaushal). కియారా అద్వానీ(Kiara Advani) భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ సినిమా గోవింద నామ్ మేరా. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. ఓటీటీ ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పించిందా? డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విక్కీ కౌశల్, కియారా హిట్ అందుకున్నారా లేదా అన్నది చూద్దాం....
ట్రెండింగ్ వార్తలు
గోవింద కష్టాలు...
గోవింద వాఘ్‌మరే (విక్కీ కౌశల్) సినిమాల్లో సైడ్ డ్యాన్సర్‌గా పనిచేస్తుంటాడు. కొరియోగ్రాఫర్ కావాలన్నది అతడి కల. డ్యాన్సర్‌గా పనిచేసే సుకును (కియారా అద్వానీ) ప్రేమిస్తుంటాడు. అప్పటికే గోవిందకు బ్యూటీషియన్ గౌరితో (భూమి ఫడ్నేకర్) పెళ్లవుతుంది. భార్యకు చాలా భయపడుతుంటాడు గోవింద. ఆమెకు విడాకులు ఇచ్చి సుకును పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ విడాకులు కావాలంటే తనకు రెండు కోట్లు ఇవ్వమని గౌరి డిమాండ్ చేస్తుంటుంది.
మరోవైపు తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన బంగ్లా కోర్టు కేసులో ఉంటుంది. తండ్రి మొదటి భార్యతో పాటు ఆమె కొడుకు విష్ణుకు ఆ ఆస్తి దక్కకుండా గోవింద శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. సమస్యలు పెరిగిపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైన గోవిందకు కోట్ల విలువైన డ్రగ్స్ దొరుకుతాయి. ఆ డ్రగ్స్ తీసుకొని ఇంటికి వచ్చిన అతడికి భార్య గౌరి డెడ్‌బాడీ కనిపిస్తుంది. ప్రియురాలు సుకుతో కలిసి గౌరి శవాన్ని పాతిపెడతాడు గోవింద. కానీ ఆ విషయం పోలీసులకు తెలుస్తుంది.
ఆ హత్య కేసు నుంచి గోవింద ఎలా బయటపడ్డాడు? నిజంగా గౌరి హత్యకు గురైందా? గోవిందను సుకు ప్రేమించిందా? తండ్రి ఆస్తిని గోవింద దక్కించుకున్నాడా ? ఆర్థిక సమస్యల నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అన్నదే ఈ సినిమా కథ.
కామెడీ థ్రిల్లర్...
కామెడీ థ్రిల్లర్ కథాంశంతో గోవింద నామ్ మేరా సినిమాను దర్శకుడు శశాంక్ ఖైతాన్ తెరకెక్కించాడు. సింపుల్ కథను స్క్రీన్‌ప్లేతో ఎంగేజింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. భార్య కారణంగా గోవింద పడే ఇబ్బందులను ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దారు. మరోవైపు ఆస్తి గొడవలు, కొరియోగ్రాఫర్ కావాలనే కలలు తీరక గోవింద, సుకు ఎదుర్కొనే సమస్యలను సీరియస్‌గా కాకుండా ఫన్ వేలోనే చూపించారు.
ఆద్యంతం నవ్వులతో సాగిపోతున్న ఈ సినిమా గౌరి మర్డర్‌తో కాస్త సీరియస్‌గా టర్న్ తీసుకుంటుంది. అప్పటివరకు ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సాగిన సినిమాను చివరి అరగంటను థ్రిల్లింగ్‌గా నడిపించారు డైరెక్టర్. సుకు వేసిన ఎత్తులను గోవింద తన మాస్టర్ ప్లాన్‌తో ఎలా తిప్పికొట్టాడో చివరలో ఉత్కంఠభరితంగా చూపించారు.(Govinda Naam Mera Review)
ఫన్ మిస్..
విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్ ఎపిసోడ్‌లోని సర్కాస్టిక్ కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. హీరోకు ఎదురయ్యే కష్టాల నుంచి సరైన రీతిలో కామెడీని రాబట్టుకోలేకపోయారు దర్శకుడు. విక్కీ కౌశల్, కియారా లవ్ స్టోరీని అందంగా చూపించలేకపోయారు. మెయిన్ స్టోరీలోకి వెళ్లడానికి ఎక్కువగా టైమ్ తీసుకోవడం మైనస్‌గా నిలిచింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌తో ఇదివరకు బాలీవుడ్‌లో చాలా సినిమాలొచ్చాయి.
కియారా హైలైట్...
గోవిందగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో విక్కీ కౌశల్ చక్కటి నటనను కనబరిచాడు. ఫస్ట్ హాఫ్‌లో అమాయకుడిగా, సెకండాఫ్‌లో తెలివైనవాడిగా అతడి క్యారెక్టర్‌ను దర్శకుడు కొత్తగా డిజైన్ చేశాడు. ఫన్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. కియారా అద్వానీ గ్లామర్, యాక్టింగ్ రెండింటితో మెప్పించింది. పాజిటివ్ షేడ్స్‌తో కనిపించే నెగెటివ్ క్యారెక్టర్‌లో ఆమె నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. భూమి ఫడ్నేకర్‌ది చిన్న పాత్రే. రఫ్ వైఫ్‌గా తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నది.
Govinda Naam Mera Review-వన్ టైమ్ వాచ్...
గోవింద నామ్ మేరా ఫన్ , థ్రిల్ రెండు లేని రొటీన్ కమర్షియల్ సినిమా. విక్కీ కౌశల్, కియారా అద్వానీ యాక్టింగ్ కోసం ఒక సారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5