తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Veera Simha Reddy Ott Platform: వీర సింహా రెడ్డి స్ట్రీమ్‌ అయ్యేది ఆ ఓటీటీలోనే..

Veera Simha Reddy OTT Platform: వీర సింహా రెడ్డి స్ట్రీమ్‌ అయ్యేది ఆ ఓటీటీలోనే..

Hari Prasad S HT Telugu

12 January 2023, 8:06 IST

    • Veera Simha Reddy OTT Platform: వీర సింహా రెడ్డి స్ట్రీమ్‌ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఏదో తేలిపోయింది. ఈ సినిమా గురువారం (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే.
వీర సింహా రెడ్డిలో బాలకృష్ణ
వీర సింహా రెడ్డిలో బాలకృష్ణ

వీర సింహా రెడ్డిలో బాలకృష్ణ

Veera Simha Reddy OTT Platform: గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌, నట సింహం బాలకృష్ణ నటించిన సినిమా వీర సింహా రెడ్డి. అఖండ సూపర్‌హిట్‌ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడం, అందులోనూ సంక్రాంతి సందర్భంగా వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్‌లో రెడ్డి ఉంటే బంపర్‌ హిట్టే అన్న సెంటిమెంట్‌ కూడాఎలాగూ ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Pushpa Pushpa Song Lyrics: పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్ చూశారా? భూమి బద్ధలయ్యే పాట ఇది

SIT Telugu OTT: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అవుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎక్క‌డ‌...ఎప్పుడంటే?

Guppedantha Manasu Serial: వ‌సుధార ప్లాన్ రివ‌ర్స్ - రాజీవ్ కుట్ర‌ల‌ను క‌నిపెట్టిన రిషి వైఫ్ - మ‌ను క‌ళ్ల‌లో భ‌యం

Krishna mukunda murari serial today: సరోగసి మథర్ గురించి నిజం దాచిన మురారి.. మీరాతో తిరగొద్దని మురారికి చెప్పిన కృష్ణ

ఈ నేపథ్యంలో రిలీజైన వీర సింహా రెడ్డికి ఊహించినట్లే పాజిటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. యూఎస్‌ ప్రీమియర్‌ షోలు, తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్‌ షోలు చూసిన ఫ్యాన్స్‌.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అంటూ ట్విటర్‌లో రివ్యూలు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ల దగ్గరికి రావడంతో ముందుగానే సంక్రాంతి పండగ వచ్చిన ఫీలింగ్‌ కలుగుతోంది.

ఇక తాజాగా ఈ సినిమా తన ఓటీటీ ప్లామ్‌ఫామ్‌ను కూడా రివీల్‌ చేసింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ పెద్ద మొత్తం చెల్లించి డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్‌.. సినిమా ఓపెనింగ్‌ క్రెడిట్స్‌ సమయంలో వెల్లడించారు. ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో రాబోతుందన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలుస్తుంది.

గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో వచ్చిన వీర సింహా రెడ్డిలో శృతి హాసన్‌ ఫిమేల్‌ లీడ్‌గా కనిపించింది. ఇక దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌లు కీలకపాత్రల్లో నటించారు. వీర సింహా రెడ్డి సందడి తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే మొదలైంది. కొన్ని చోట్లు రాత్రి 2 గంటల షోలు వేయగా.. హైదరాబాద్‌ సహా వివిధ నగరాల్లో బాలయ్య అభిమానుల హడావిడి కనిపించింది.

ఈ సినిమా మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లు కూడా తొలిసారి ఉదయం 4.30 గంటల షోలు వేశాయి. ఇప్పటి వరకూ కేవలం సింగిల్‌ స్క్రీన్లు మాత్రమే ఇలా బెనిఫిట్‌ షోలు వేసేవి. అయితే మల్టీప్లెక్స్‌లు కూడా వీర సింహా రెడ్డితో ఈ కొత్త సాంప్రదాయానికి తెరతీశాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.