తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial Today: సరోగసి మథర్ గురించి నిజం దాచిన మురారి.. మీరాతో తిరగొద్దని మురారికి చెప్పిన కృష్ణ

Krishna mukunda murari serial today: సరోగసి మథర్ గురించి నిజం దాచిన మురారి.. మీరాతో తిరగొద్దని మురారికి చెప్పిన కృష్ణ

Gunti Soundarya HT Telugu

07 May 2024, 8:16 IST

    • Krishna mukunda murari serial today may 7th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. సరోగసి మథర్ మీరా అనే విషయం మురారి కృష్ణ దగ్గర చెప్పకుండా దాచి పెడతాడు. తన మీద మంచి అభిప్రాయం కలిగిన తర్వాత చెప్పాలని అనుకుంటాడు. 
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 7వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 7వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 7వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial today may 7th episode: మీరా తమ బిడ్డని మోసేదని మురారికి తెలుస్తుంది. మురారి ఇక నుంచి తనని ప్రేమగా చూసుకుంటాడని అనుకుంటుంది. కారులో ఇంటికి వెళ్దామని పిలుస్తాడు. మీకెందుకు శ్రమ అని డ్రామా ఆడుతుంది. నువ్వు మా బిడ్డని మోస్తున్నావ్ కాలు కింద పెట్టకూడన చూసుకోవాలని చెప్పి తన చేతిని పట్టుకుని కారులో కూర్చోబెడతాడు.

ట్రెండింగ్ వార్తలు

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Horror Movie: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్! ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

నిజం తెలుసుకున్న మధు

ముకుంద మురారి పక్కన కూర్చున్నానని తెగ మురిసిపోతుంది. సంగీత ఏడుపు మొహం పెట్టుకుని ఉంటే మధు ఫోటో తీసి చూడు ఎలా ఉన్నావో ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతాడు. ఎప్పుడు ఉండే గోల ఆదర్శ్ బావ నా మొహం చూడటం లేదంటే తనని వలలో వేసుకోవడం లేదని మా అమ్మ చంపుతుందని చెప్తుంది.

మధు తనని దృష్టిలో పెట్టుకోమని అంటూ ఇన్ డైరెక్ట్ గా నేనే నీకు మంచి సంబంధం చూస్తానని అంటాడు. అయితే ఈ సారి మీ అమ్మ ఉన్నప్పుడు ఆదర్శ్ దగ్గరకు వెళ్ళు తను కసురుకుంటాడు మీ అమ్మ చూస్తుంది. అప్పుడే వర్కౌట్ అవదని సైలెంట్ అయిపోతుందని అంటాడు.

నేను అలాగే అనుకున్నాను కానీ ముకుంద ఉంది కదా తను నాకు ఆదర్శ్ బావకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిందని చెప్తుంది. అది విని మధు ఆశ్చర్యపోతాడు. మీరా నీతో ఆదర్శ్ పెళ్లి చేస్తానని చెప్పిందా అంటాడు. ఆవిడ ఆదర్శ్ బావతో క్లోజ్ గా ఉంటుంది కదా అందుకని మా అమ్మ మీరాని నిలదీసింది.

అప్పుడు ఆవిడ మా ఇద్దరి మధ్య ఏం లేదు ఆదర్శ్ తో నీ కూతురు పెళ్లి చేసే బాధ్యత తనదని మా అమ్మకి మాట ఇచ్చింది. ఆదర్శ్, ముకుందని చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని డౌట్ రావడం లేదా కానీ మా అమ్మ పిచ్చిదానిలా తననే నమ్ముతుందని చెప్తుంది.

ఆదర్శ్ పిచ్చి వాడు అవుతాడు

నాలుగు రోజులు ఆగితే అంతా సర్దుకుంటుందని తనకి నచ్చజెప్పి పంపిస్తాడు. ఈ విషయం వెంటనే కృష్ణకి చెప్పాలని అనుకుంటాడు. తన దగ్గరకు పరుగున వచ్చి మీరా గురించి చెప్తాడు. సంగీతకి ఆదర్శ్ తో పెళ్లి చేస్తానని రజిని అత్తకి మాట ఇచ్చిందంట అని కృష్ణకి చెప్పేస్తాడు.

నీకు ఈ విషయం తెలిసిందా? ఆదర్శ్ మీరా మీద అలాంటి అభిప్రాయం లేదా అంటుంది. ఆదర్శ్ ఎప్పుడు మీరా వెంట పడుతున్నాడు. ఇద్దరి వాలకం చూస్తుంటే ఎంత దూరం వెళ్లిపోయారో తెలియడం లేదు. పెద్ద పెద్దమ్మ ఆదర్శ్ కి మీరాతో పెళ్లి చేయాలని చూస్తుంది. వాళ్ళిద్దరూ రాసుకుపూసుకు తిరుగుతున్నారు.

కానీ ఇదేంటి ఇటు వీళ్ళకు మాట ఇచ్చి అటు ఆదర్శ్ తో క్లోజ్ గా ఉంటూ డబుల్ గేమ్ ఏంటని మధు కూడా అంటాడు. కృష్ణ రజిని మాటలు గుర్తు చేసుకుంటుంది. మీరా ఎందుకు ఇలా చేస్తుంది తప్పు కదా అంటుంది. అటు ఆదర్శ్, ఇటు సంగీత మీరా మీద ఆశలు పెట్టుకున్నారు.

ఆందోళనలో కృష్ణ

సంగీత కోసం మీరా ఆదర్శ్ ని దూరం పెడితే మళ్ళీ తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు కదా అలాగని ఆదర్శ్ ని పెళ్లి చేసుకుంటే నా కూతురు పెళ్లి కాలేదని రజిని అత్త ఏడుస్తుందని అంటాడు. క్లోజ్ గా ఉండి తర్వాత వదిలేస్తే ఆదర్శ్ ఏమైపోతాడోనని కృష్ణ కూడా కంగారుపడుతుంది.

ఒకప్పుడు ఇలాగే ముకుందని ఆశపడి పెళ్లి చేసుకున్నాడు తన మనసులో లేదని తెలుసుకుని హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆ ముకుంద మీద ప్రేమ చావక తనకి ఆ పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరా కూడా మోసం చేస్తే ఆదర్శ్ పిచ్చి వాడు అవుతాడని కృష్ణ కంగారుపడుతుంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యి ఆదర్శ్ విషయంలో నేను వేలు పెట్టనని మధు అంటాడు.

మీరాని తిట్టిన రేవతి

మీరా ఎందుకు ఇలా చేస్తుంది? అసలు ఎవరైనా ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అనుకుంటుంది. అప్పుడే మురారి వస్తాడు. కారులో నుంచి మీరా, మురారి కలిసి రావడం చూసి కృష్ణ ఆశ్చర్యపోతుంది. పెళ్ళాన్ని ఇంటికి ఒంటరిగా పంపించి ఏం చేస్తున్నావని రేవతి మురారిని అరుస్తుంది.

కడుపుతో ఉన్న దాన్ని క్యాబ్ లో పంపించి ఏమి లేని దాన్ని కారులో ఎక్కించుకుని వస్తున్నావా అని రేవతి అడిగేస్తుంది. మీరా ఎండలో వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఇచ్చానని చెప్తాడు. మీరా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. కృష్ణ కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతుంది.

మీరాకు దూరంగా ఉండు

మీరా సరోగసి మథర్ అని చెప్దామని వస్తే ఇలా జరిగింది ఏంటని అనుకుంటాడు. గదిలోకి వెళ్ళి కృష్ణని ఏమైందని అడుగుతాడు. మీరా క్యాబ్ లోనో ఆటోలోనూ వచ్చేది కదా కారులో ఎందుకు ఎక్కించుకున్నావని కృష్ణ కూడా నిలదీస్తుంది. మన ఇంట్లో ఉంటున్న అమ్మాయి ఒక్కతే ఎండలో ఉంటే ఎక్కించుకున్నా అందులో తప్పు ఏముందని అంటాడు.

తప్పుడు మనుషులకు సాయం చేయడం కూడా తప్పే అని కృష్ణ కోపంగా అంటుంది. మీరా తప్పుడు మనిషా? అసలు తను మన కోసం ఏం చేసిందో తెలుసా? అని చెప్పబోయి ఆగిపోతాడు. మీరా మీద ఉన్న తప్పుడు అభిప్రాయం మార్చి నిజం చెప్పాలని డిసైడ్ అవుతాడు.

నిజం దాచిపెట్టిన మురారి

ఏం చేసింది అంతగా అంటుంది. ముకుంద వాళ్ళ నాన్న నన్ను అరెస్ట్ చేయిస్తే కాపాడింది కదా అంటాడు. మీరా చాలా తేడా తనకు దూరంగా ఉంటే మంచిదని అంటుంది. పొరపాటుగా ఒక మంచి మనిషిని తప్పుగా అర్థం చేసుకోవడం బాగోదని మురారి సర్ది చెప్పడానికి చూస్తాడు.

ఇలా మంచిదని అనుకుని నెత్తిన పెట్టుకోవడం వల్ల ఇలా అయింది. తనకు దూరంగా ఉండండి ఇలా ఇంకోసారి లిఫ్ట్ ఇవ్వొద్దు అంటుంది. ఏదో జరిగింది ఇప్పుడు నిజం చెప్తే ఇలాంటి ఆడది నా బిడ్డని మోయడం ఏంటని అవసరం లేదని అంటుంది. కృష్ణ అభిప్రాయం మార్చే వరకు చెప్పకపోవడం మంచిదని అనుకుంటాడు.

కొత్త క్యారెక్టర్ ఎంట్రీ

సరోగసికి ఒప్పుకున్న అమ్మాయి ఎవరో తెలిసిందా అని అడుగుతుంది. తెలియలేదు కొద్ది రోజుల తర్వాత తెలుసుకుందాంలే అని కవర్ చేస్తాడు. మీకు తెలిసి కూడా తెలియనట్టు ఆట పట్టిస్తున్నారు కదా అంటుంది. ఏదో చెప్పి కవర్ చేస్తాడు. సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అప్పుడు నువ్వే తనని జాగ్రత్తగా చూసుకుంటావని అంటాడు.

ఆమె ఆరోగ్య కోసం పూజ చేయిద్దామని కృష్ణ అంటుంది. సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. భవానీ అమెరికా నుంచి తన ఫ్రెండ్ అమృత వచ్చిందని చెప్పి ఇంట్లో అందరికీ తనని పరిచయం చేస్తుంది. కృష్ణని అమృతకి పరిచయం చేస్తుంది. తను డాక్టర్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది.

అమృత నిన్ను టెస్ట్ చేసి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుందని అనేసరికి మురారి, కృష్ణ షాక్ అవుతూ ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటారు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

తరువాయి భాగంలో..

కృష్ణ, మురారి హాస్పిటల్ కి వస్తారు. అప్పుడే ముకుంద కూడా హాస్పిటల్ కి వస్తుంది. సరోగసి మథర్ కూడా ఇప్పుడే వస్తుంది కదా డాక్టర్ చెప్పకుండానే మనం చూసేయొచ్చు అని కృష్ణ సంతోషంగా అంటుంది. ఆవిడ ఎవరైనా కావచ్చు అంటూ మురారి హాస్పిటల్ లో అందరినీ చూపిస్తూ ఉంటాడు. ముకుంద హాస్పిటల్ లో ఉండటం చూసి మురారి టెన్షన్ పడితే, కృష్ణ షాక్ అవుతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం